S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/24/2016 - 14:15

దిల్లీ: 15 రాష్ట్రాలకు సంబంధించి ఖాళీ అవుతున్న 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి మే 31 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 3 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 11న సంబంధిత రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. యుపి నుంచి అత్యధిక సంఖ్యలో 11 మంది ఎంపీలు రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు.

05/24/2016 - 13:34

దిల్లీ: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ మంగళవారం ఉదయం ఇక్కడి సిబిఐ కార్యాలయంలో అధికారులు జరిపిన విచారణకు హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లంచం ఇస్తున్నట్లు స్ట్రింగ్ ఆపరేషన్‌కు సంబంధించి ప్రచారంలో ఉన్న వీడియోపై ఆయనను ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన బలపరీక్షలో నెగ్గి రావత్ ముఖ్యమంత్రి పీఠాన్ని మళ్లీ అధిష్ఠించిన నేపథ్యంలో సిబిఐ అధికారులు విచారించడం ఇపుడు చర్చనీయాంశమైంది.

05/24/2016 - 11:57

దిల్లీ: మెడికల్ కోర్సులకు నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష (నీట్)ను ఈ ఏడాదికి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు ఎట్టకేలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఆర్డినెన్స్‌పై పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఆయన సంతకం చేశారు. విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు ఆర్డినెన్స్‌పై రాష్టప్రతి సంతకం చేయడంతో కేంద్రం ఊపిరి పీల్చుకుంది.

05/24/2016 - 12:09

దిల్లీ: స్మార్ట్ సిటీల రెండో జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు ఇక్కడ ప్రకటించారు. రెండో జాబితాలో తెలంగాణకు చెందిన వరంగల్‌కు స్థానం లభించింది. ఇంకా కోల్‌కత, చండీగఢ్, ధర్మశాల, లక్నో, రాంచీ, రాయ్‌పూర్ సహా 13 నగరాలను ఈ జాబితాలో చేర్చారు. నగరాల్లో వౌలిక వసతులను కల్పించేందుకు స్మార్ట్ సిటీస్, అమృత్ పథకాలను కేంద్రం అమలు చేస్తోంది.

05/24/2016 - 11:55

దిల్లీ: కేరళలో ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని, పశ్చిమ కనుమలలో వీస్తున్న బలమైన గాలులే ఇందుకు కారణమని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనుకున్న సమయం కంటే వారం ముందుగానే రుతుపవనాలు వస్తాయంటున్నారు.

05/24/2016 - 04:17

హైదరాబాద్, మే 23: మంచినీటి ఎద్దడితో తల్లడిల్లిపోతున్న పాలమూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి కర్నాటక ప్రభుత్వం ఒక టిఎంసి నీటిని పంపి, తన ఔదార్యం చాటుకుంది. జిల్లాలో నెలకొన్న మంచి ఎద్దడి తీర్చడానికి కర్నాటకలోని నారాయణపూర్ డ్యామ్ నీరు విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తి మేరకు కృష్ణా జలాలు సోమవారం జూరాలకు చేరుకున్నాయి.

05/24/2016 - 04:01

న్యూఢిల్లీ, మే 23: వివిధ ప్రాజెక్టులకు అటవీ భూములను వినియోగించుకుని వాటికి ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూమిని గ్రీన్ కారిడార్‌కు ఇస్తే రాయితీలు కూడా ఇవ్వాలని కోరుతున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో అటవీ భూములను తీసుకొని ఆ రాష్ట్రం గ్రీన్ కారిడార్‌కు భుములు ఇస్తోందని, ఇది మంచి ఉదాహరణ అని చెప్పారు.

05/24/2016 - 03:12

సూళ్లూరుపేట, మే 23: ఒకప్పుడు చిరుదీవిగా ఉన్న శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు స్పేస్ పోర్టుగానే కాకుండా రాకెట్ ప్రయోగాలకు గుండెకాయలా మారింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి పేరుప్రతిష్టలు తెచ్చిపెడుతోంది. బంగాళాఖాతం సముద్ర మట్టానికి ఏటవాలుగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని రాకెట్ ప్రయోగాలకు అనువైనదని 1971లో అప్పటి అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ఎంపిక చేశారు.

05/24/2016 - 03:11

సూళ్లూరుపేట, మే 23: ఆర్‌ఎల్‌వి-టిడి విజయం శాస్తవ్రేత్తల అందరి సమష్టి విజయమని ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. ప్రయోగ విజయం అనంతరం ఆయన శాస్తవ్రేత్తలు, షార్ ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్రోలో పనిచేసే ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి తక్కువ సమయంలో దీనిని రూపకల్పన చేసి ప్రయోగించి విజయం సాధించామని, ఇదంతా ఇస్రోలో పనిచేసే ప్రతి ఒక్కరి విజయంగా అభివర్ణించారు.

05/24/2016 - 02:41

న్యూఢిల్లీ, మే 23: నీట్ నుండి రాష్ట్ర ప్రభుత్వాల బోర్డులను మినహాయించేందుకు కేంద్ర ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్‌పై రాష్టప్రతి ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా సోమవారం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అదనపు సమాచారాన్ని అడిగినట్లు తెలిసింది.

Pages