S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/26/2016 - 06:31

న్యూఢిల్లీ,మే 25: ఉమ్మడి న్యాయస్థానం విభజన బంతిని కేంద్రం ఆంధ్రప్రదేశ్ కోర్టులో వేసింది. హైదరాబాద్‌లో ఏపీకి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముందుకొచ్చినా, అందుకు ఏపి ముఖ్యమంత్రి అంగీకరించాలే తప్ప కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. హైకోర్టు విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

05/26/2016 - 00:29

న్యూఢిల్లీ,మే 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పని చేయాలని, మహానాడులో ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచందర్‌రావు ఏపీ సీఎం చంద్రబాబుకు బుధవారం లేఖ రాశారు.

05/25/2016 - 17:58

దిల్లీ: దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అరాచకాలకు అడ్డాగా మారిందని, అక్కడ అత్యాచారాలు నిత్యకృత్యమని రాజస్థాన్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో 50 శాతం అత్యాచారాలకు జెఎన్‌యు విద్యార్థులే కారణమని గతంలో ఆరోపించిన ఆయన ఇపుడు వర్సిటీలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అదుపులేకుండా పోయిందంటున్నారు.

05/25/2016 - 17:56

తిరువనంతపురం: కేరళ 12వ ముఖ్యమంత్రిగా ఎల్‌డిఎఫ్ శాసనసభా పక్షం నేత విజయన్ బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడి సెంట్రల్ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ విజయన్ చేత ప్రమాణం చేయించారు. సిపిఎం ముఖ్యనేతలు, ఎల్‌డిఎఫ్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

05/25/2016 - 16:51

దిల్లీ: స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్‌ను చేర్చాలని తెరాస ఎంపీ వినోద్‌కుమార్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించారు. కొన్ని విధివిధానాలను సవరించి జాబితాలో కరీంనగర్‌ను చేర్చాలని అధికారులను ఆయన ఆదేశించారు. కేంద్రానికి పంపే నివేదికలో మార్పులు, చేర్పులు చేయాలని కరీంనగర్ మేయర్‌ను వెంకయ్య కోరారు.

05/25/2016 - 16:50

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో బుధవారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్యమంత్రి జయలలిత, డిఎంకె అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్, రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ సెమ్మలై ప్రమాణం చేయించారు. ప్రతిపక్ష నేతగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. స్పీకర్ ఎన్నిక జూన్ 3న జరుగుతుంది.

05/25/2016 - 15:20

తిరువనంతపురం: కేరళ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విజయన్ బుధవారం ఉదయం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి తనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేయనున్న వారి జాబితాను అందజేశారు.

05/25/2016 - 08:54

న్యూఢిల్లీ, మే 24: నేషనల్ ధర్మల్ పవర్ ప్లాంట్ మహబూబ్‌నగర్ జిల్లాలోని గట్టులో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంటుకు భూమి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించాలని కాంగ్రెస్ నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. నంది ఎల్లయ్య మంగళవారం ఈ మేరకు మోదీ, గోయల్‌కు లేఖ రాశారు.

05/25/2016 - 08:23

న్యూఢిల్లీ,మే 24: మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్లకు వచ్చే సంవత్సరం నుండి అందరికి వర్తించే నీట్ పరీక్షను తెలుగుతో పాటు ఏడు ప్రాంతీయ భాషల్లో రాసేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు 2016-17 సంవత్సరం అడ్మిషన్లకు నీట్ నుండి మినహాయింపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన ఆర్డినెన్స్‌లో ఈ అంశాన్ని పొందుపరిచారు.

05/25/2016 - 08:13

న్యూఢిల్లీ, మే 24: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ ప్రభుత్వం సాధించిన విజయాలను హైలైట్ చేయడానికి దేశంలో దాదాపు 200 కీలక ప్రాంతాలను గుర్తించింది. ఈ నెల 26నుంచి జూన్ 15 దాకా 21 రోజుల పాటు బిజెపి ‘వికాస్ పర్వ్’ను పాటించనున్నట్లు పార్టీ అంతర్గతంగా జారీచేసిన ఓ సందేశంలో తెలియజేశారు.

Pages