జాతీయ వార్తలు

ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, మే 22: ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం బద్దలై, దాన్నుంచి వెలువడిన లావాలో ఆరుగురు చనిపోయారు. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో ఉన్న సినాబంగ్ పర్వతం శనివారం బద్దలైందని.. దాదాపు మూడు కిలోమీటర్ల ఎత్తులో లావా వెలువడిందని.. సహాయకులకు ఆరు మృత దేశాలు లభ్యమైనట్లు ఇండోనేసియా జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ ప్రతినిధి సుతొపోపూర్వో నుగ్రోహొ తెలిపారు. కొండకు పశ్చిమాన దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల మేర లావా ప్రవహించి నదిలో కలిసిపోయిందని ఆయన అన్నారు. ఈ విపత్తులో కొన్ని జంతువులు కూడా చనిపోయినట్లు అధికారులు తెలపారు. ఇండోనేసియాలో దాదాపు 120 అగ్ని పర్వతాలు ఎప్పుడూ మండుతూ ఉంటాయి. వీటిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు.

పుదుచ్చేరి లెఫ్టినెంట్
గవర్నర్‌గా కిరణ్ బేడీ

న్యూఢిల్లీ, మే 22: బిజెపి నాయకురాలు, మాజీ ఐపిఎస్ అధికారి కిరణ్ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆదివారం నియమితులయ్యారు. అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నరే గత రెండు సంవత్సరాల నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్టప్రతి.. కిరణ్ బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించినట్లు రాష్టప్రతి భవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పదవీకాలం మొదలవుతుందని పేర్కొంది. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని 66ఏళ్ల కిరణ్ బేడీ అన్నారు. దేశ ప్రజల ప్రయోజనం కోసం తాను పనిచేస్తానని, దీనికోసం ప్రతి రోజు పాటుపడతానని ఆమె పేర్కొన్నారు. తన పట్ల విశ్వాసం ఉంచి ఈ పదవి అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే తొలి ఐపిఎస్ అధికారి అయిన కిరణ్ బేడీ స్వచ్ఛంద పదవీవిరమణ తరువాత నిరుడు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారానికి నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం పొందటంతో పాటు కిరణ్ బేడీ కూడా ఓడిపోయారు. 30 స్థానాలు గల పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్-డిఎంకె కూటమి 17 స్థానాల్లో విజయం సాధించిన 3 రోజుల తరువాత అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించటం విశేషం. ఎఐఎడిఎంకె ఇక్కడ నాలుగు సీట్లు కైవసం చేసుకుంది. బిజెపి ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. యుపిఎ హయాంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయిన వీరేంద్ర కటారియాను మోదీ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది.

‘మన్ కీ బాత్’ కోసం
టోల్-ఫ్రీ నెంబర్ ఏర్పాటు

న్యూఢిల్లీ, మే 22: ప్రతి నెలా రేడియోలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రసంగాన్ని తీరికలేక వినలేకపోతున్నారా? అయితే ఇక మీదట మీకు తీరిక దొరికినప్పుడే నాలుగు అంకెల టోల్-ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేసి ఆ ప్రసంగాన్ని వినవచ్చు. ఇందుకోసం టెలికామ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ‘1922’ టోల్-ఫ్రీ నెంబర్‌ను కేటాయించింది. వాయిస్ సర్వీసుల కోసం కేటాయించిన ఈ నెంబర్ గురించి దేశ వ్యాప్తంగా అన్ని టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లకు తెలియజేశామని టెలికామ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే తీరికలేక ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వినలేకపోతున్న వారు ఇకమీదట 1922 నెంబర్‌కు ఫోన్‌చేసి ఉచితంగా ప్రధాని ప్రంసగాన్ని వినవచ్చని టెలికామ్ శాఖ పేర్కొంది. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడకపోవడంతో 1922 నెంబర్‌కు ఫోన్ చేసినా ఫలితం ఉండటం లేదని, ‘మన్ కీ బాత్‌కు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు’ అని సమాధానం వచ్చి ఆటోమ్యాటిక్‌గా కాల్ డిస్‌కనెక్ట్ అవుతోందని పిటిఐ వార్తా సంస్థ తెలిపింది.