జాతీయ వార్తలు

‘వన్ మాన్ షో’ ఆరోపణలు అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వన్ మాన్ షో’ నడిపిస్తున్నారనే విమర్శలకు ఆధారాలు లేవని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో సమాజంలో చీలికలు వచ్చాయన్న భావన కూడా పూర్తి అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని, సంప్రదింపుల ప్రక్రియ ద్వారానే అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మోదీ అధికారాలన్నింటిని తన గుప్పిట్లో పెట్టుకున్నారని, ప్రధాన నిర్ణయాలన్నీ సొంతగానే తీసుకుంటున్నారని వస్తున్న విమర్శల గురించి ప్రశ్నించగా, ‘నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. మా కేబినెట్ సమావేశాలను మీకు (మీడియాకు) ప్రసారం చేయాలా? అప్పుడు మీరు కేబినెట్‌లో ఎలాంటి ప్రజాస్వామిక పనితీరు జరుగుతోందనేది మీరు అర్థం చేసుకుంటారా?’ అని జావడేకర్ ఘాటుగా బదులిచ్చారు. ‘ప్రతి ఒక్కరు మాట్లాడొచ్చు. తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. ప్రధానమంత్రి ఎప్పుడూకూడా జోక్యం చేసుకోరు. అన్ని అభిప్రాయాలను ఆయన వింటారు. తరువాత తన అభిప్రాయం చెబుతారు’ అని జావడేకర్ వివరించారు. మోదీ స్వయంమోహితుడని, అధ్యక్ష ప్రభుత్వం తరహా ఏకవ్యక్తి పాలన కొనసాగిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. ఎన్‌డిఎ పాలనలో సమాజం చీలిపోయిందన్న విమర్శను తోసిపుచ్చుతూ, ప్రధానమంత్రి తరచుగా 125 కోట్ల మంది భారతీయులు ఒక్కటేనని చెబుతుంటారని జావడేకర్ అన్నారు. సామాజిక విభజన అనేది తమ ప్రభుత్వం లేదా తమ పార్టీ అజెండా కాదని ఆయన అన్నారు. తాము సమైక్య భారత్‌ను కోరుకుంటున్నామని, ఒకే ప్రజలు, ఒకే దేశం పట్ల తమకు విశ్వాసం ఉందని, ప్రధానమంత్రి ఎన్నడూ ప్రజల మధ్య వివక్ష చూపలేదని జావడేకర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం మీద దాడి చేయడానికి అప్రధానమైన అంశాలను ఎంచుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు గేమ్‌లో ఓడిపోయాయని, వాటికి లేవనెత్తడానికి నిజమైన అంశాలు లేవని, అందువల్ల అవి ఇప్పుడు లేవనెత్తాల్సిన అంశాలకోసం శోధిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్ అంశంపై కేంద్రం ఉత్తమమైన మార్గాన్ని అనుసరించి ఉండాల్సిందా? అని ప్రశ్నించగా ‘అది ఒక్క ప్రభుత్వం పని కాదు. ఆ పరిస్థితి అలా ఉండింది. గవర్నర్ నివేదిక, దానిపై రాష్టప్రతి చర్య. సంఘటనలు చోటు చేసుకున్నాయి. చివరికి కోర్టు కూడా కీలక పాత్ర వహించింది’ అని ఆయన బుదులిచ్చారు.