జాతీయ వార్తలు

నేడు జయలలిత ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 22: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎఐఎడిఎంకె అధినేత్రి జయలలిత సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేయనుండటం ఇది వరుసగా రెండోసారి కాగా, మొత్తం మీద ఆరోసారి. ఈ కార్యక్రమంకోసం చెన్నైలోని మద్రాస్ యూనివర్శిటీ సెంటినరీ ఆడిటోరియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం ఈ ఆడిటోరియంలో జయలలిత 28 మంది మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1991 జూన్ 24వ తేదీన జయలలిత తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఇక్కడే కావడంతో ఆ ఆడిటోరియంకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. తర్వాత 2001లో ఆమె ప్రమాణ స్వీకారం రాజ్‌భవన్‌లో సాగినప్పటికీ 2011లో జయలలిత మళ్లీ మద్రాస్ వర్శిటీ సెంటినరీ ఆడిటోరియం ప్రాంగణంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రిగా మరోసారి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆ ఆడిటోరియం లోపల, వెలుపల అద్భుతమైన అలంకరణలు చేయడంతోపాటు ఆ భవనం మొత్తానికీ కళ్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో శనివారం నుంచే ఆ భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సచివాలయానికి వెళ్లే రోడ్లను కూడా ప్రత్యేకంగా అలంకరించారు. తమిళనాడులో నాలుగుసార్లు అధికార పగ్గాలను కైవసం చేసుకున్న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఆరోసారి.