జాతీయ వార్తలు

బిజెపి లెజిస్లేచర్ పార్టీ నేతగా సోనోవాల్ ఏకగ్రీవ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మే 22: అసోంలో బిజెపి విజయ బావుటా ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించిన సర్బానంద సోనోవాల్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా ఆదివారం జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సోనోవాల్‌ను పార్టీ నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి బిజెపి కేంద్ర కమిటీ తరపున పరిశీలకుడుగా కేంద్ర మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ హాజరయ్యారు. శాసనసభా పక్ష నేతగా సోనోవాల్ పేరును పార్టీ ఎమ్మెల్యే హిమంత బిస్వా శర్మ ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు పి.్ఫకాన్, అతుల్ బోరా, అంగూర్‌లతా దేలా, భవేష్ కలిత, ఏసి జైన్ తదితరులు మద్దతు తెలిపారు. దీంతో బిజెపి శాసనసభాపక్ష నేతగా సోనోవాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పరిశీలకుడుగా విచ్చేసిన తవార్ చంద్ గెహ్లాట్ ప్రకటించారు. ఈ సందర్భంగా సోనోవాల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా సమష్టిగా కృషి చేస్తామని ప్రకటించారు. సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా, అభివృద్ధి చెందేలా పాలన అందించాలని ప్రధాని మోదీ సూచించారని సోనోవాల్ తెలిపారు. ‘సుస్థిర పాలన అందించేందుకు ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు.
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకు రావాల్సిందిగా బిజెపి కూటమిని గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య ఆహ్వానించారు. ఈ నెల 24న ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు తాము సుముఖంగా ఉన్నామంటూ బిజెపి కూటమి నాయకులు ఆదివారం గవర్నర్ ఆచార్యను రాజ్‌భవన్‌లో కలిశారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది.