జాతీయ వార్తలు

అవకాశమున్న చోటల్లా పొత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: అసోంలో బిజెపి ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో భవిష్యత్తులో బిజెపి సొంతంగా ఎన్నికల్లో విజయం సాధించలేని రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడానికే తమ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తుందని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలనుంచి అందిన ముఖ్యమైన సందేశం ఏమిటని అడగ్గా, ఎక్కడ అవసరముంటే అక్కడల్లా పొత్తులు పెట్టుకోవాలి. అలాగే స్థానిక సమస్యలను గుర్తించి వాటికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకోవాలని పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో వెంకయ్యనాయుడు చెప్పారు. అయితే అదే సమయంలో అసోంలో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే ఓటమి పాలయిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. పొత్తులు పెట్టుకున్నంతమాత్రాన సానుకూల ఫలితాలు రావని, ప్రభుత్వం పని తీరు, నాయకత్వం కూడా లెక్కలోకి వస్తాయని ఆయన అన్నారు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని అనుకోవడం వల్లనే అసోంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీ అభివృద్ధి అజెండాకు ఆమోదముద్ర అని నాయుడు అంటూ, కాంగ్రెస్ పార్టీ క్రమంగా కనుమరుగవుతోందని, బిజెపి దేశవ్యాప్తంగా విస్తరించిన పార్టీగా మారుతోందనేది అయిదు రాష్ట్రాల ఎన్నికలనుంచి వచ్చిన సందేశమని చెప్పారు.
కాగా, అసోంలో విజయం దృష్ట్యా పార్టీలోని అతివాద శక్తులు బలపడే అవకాశముందన్న భయాలను ఆయన తోసిపుచ్చారు. అసోంలో బిజెపి బంగ్లాదేశ్‌నుంచి ముస్లింల అక్రమ వలసలను ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు మట్టికరచిన తర్వాత ఇలాంటి అనుమానాలు ప్రజల మనసుల్లో కలుగుతున్నాయని ఆయన అంటూ, అయితే అలాంటి అవకాశమే లేదని, అనవసరంగా ప్రజల మనసుల్లో అపోహలు సృష్టించవద్దని ఆయన అన్నారు.