S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

11/20/2019 - 22:38

స్ర్తిల మధురాధరాలే ఆకలి కొఱకు భుజించే ఫలాలు. చౌశీతిరతిబంధాలే యోగాసనాలు. ప్రణయకలహంలో వీడిపోవడమే తపస్సు. స్ర్తి సంభోగమే కైవల్యపదంలో అనుభవించే బ్రహ్మానందం. ఇట్టి విచిత్ర స్థితి లోకంలో ఎక్కడ ఏ మానవులకు లేదు.

11/19/2019 - 22:46

ఈశ్వరస్తుతి
ఎవరి ఇల్లాలు జగన్మాతయో, సంతానం సమస్త జీవరాశులో, భాషణం వేదాలో, విహారప్రదేశాలు మునుల హృదయపద్మాలో, సేవకులు బ్రహ్మ-విష్ణువులో అట్టి దేవోత్తముడైన ఆ మహాత్ముని కీర్తించడం ఎవరికి తరం?
షష్ఠ్యంతాలు
ఆ దేవదేవుడు సకల శుభగుణశాలి. సకల ప్రపంచాన్ని తన కంటె భిన్నంగా మరియు అభిన్నంగా ప్రకాశింపచేసే పరంజ్యోతి. నాదబిందుకళల కంటే అతీతమైన సర్వేశ్వరుడు.

11/19/2019 - 05:58

జ్ఞానప్రసూనాంబ స్తుతి

11/17/2019 - 22:38

శ్రీవిద్యానిధియై మహామహిమచే జెన్నై వసిష్ఠాజ లూ
తావాతాశన సామజాటవిక గోత్రాదేవ నత్కీర రా
జీవాక్షీ యుగయాదవాధిపులకున్ శ్రేయస్కరంబైన యా
ర్యావామాంగము దివ్యలింగము మదీయాభీష్టముల్ సల్పెడున్.
(శ్రీ.కా.హ.మా.1.1.)

11/12/2019 - 18:51

పరమశివుడు, పరమేశ్వరుడు, ఆదిదేవుడు, పార్వతీ ప్రియుడు, చంద్రశేఖరుడు అనంత నామధేయుడైన ఆ పరాత్పరునికి దర్శన స్పర్శన మాత్రాల చేత పాపాలను హరించగల ఒక్క బిల్వ పత్రాన్ని ‘త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం’ అంటూ సమర్పించినా, లేక హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ ఒక్క చెంబెడు నీళ్ళు పోసినా, చివరకు ‘ఓం నమశ్శివాయ’ అంటూ మనస్ఫూర్తిగా ఒక్క క్షణం ధ్యానం చేసినా చాలు, కరగిపోయి ధన కనక వస్తు వాహన ఆయురారోగ్య ఐశ్వర్య

11/11/2019 - 18:46

పరమ శివుడు తెలిపిన శివమహాపురాణం పనె్నండు సంహితలు కలిగి ఉన్నదని, ఐదు సంహితలు ఇప్పుడు లభ్యం కావటం లేదనీ తెలియవస్తున్నది. అవి వినాయక, మాతృ, ఏకాదశ రుద్ర, సహస్ర కోటి రుద్ర, ధర్మ సంహితలు.

11/10/2019 - 22:24

శివపురాణ ప్రవచన సమయంలో సూతుల వారు బ్రహ్మ, కార్తికేయుడు, వాయుదేవుడు, నందీశ్వరాదులు తెలిపిన ఎన్నో విషయాలు శౌనకాది మునులకి వివరించారు. ప్రణవ మంత్రం గురించీ, శివపూజా విధానాన్ని గురించీ, లింగ ఆవిర్బావాన్ని గురించీ, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించీ విశదీకరించిన ఆయన, మానసిక పూజా వైశిష్టాన్ని గురించి కూడా మహర్షులకు తెలిపారు.

11/07/2019 - 19:08

బ్రహ్మ దివ్య దృష్టితో చూసి, ‘‘మునులారా! ఈ దివ్య ప్రకాశ దర్శనం మీకు పరమేశ్వరుడిచ్చిన ప్రబోధానికి సంకేతం. ఆ ప్రకాశంలో మీకు కనిపిస్తున్న మహనీయులందరూ పశుపత వ్రతాన్ని ఆచరించి ఆయనలో ఐక్యమవబోతున్న సత్పురుషులు. వారి లాగే మీరూ ఆ వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాలని పరోక్షంగా మీకు పరమశివుని ఆదేశం.

11/06/2019 - 19:54

‘‘శౌనకాదులారా! ఒకప్పుడు వామ దేవుడనే మహా శివభక్తుడు సుమేరు పర్వతానున్న కుమార శిఖరాన అప్పుడక్కడ వసిస్తున్న కుమారస్వామిని దర్శించాడు. ఆయనతో సంభాషిస్తూ, శివ తనయుడైన కార్తికేయుడాయనకు ప్రణవ మంత్రం పరబ్రహ్మ స్వరూపమేననీ, ఆ మంత్ర జపంతో సాక్షాత్తూ మోక్షాన్ని పొందవచ్చనీ తెలిపాడు.

11/05/2019 - 18:52

శివ పూజకు చక్కటి పీఠాన్ని ఏర్పరుచుకుని దానిపై సాకార విగ్రహాన్ని (అష్టదళ కమలములతో రూపొందించిన పీఠం ఉత్తమం) మధ్యన ఉంచి, ముందుగా గణేశుడిని, దిక్పాలకులనూ, పూజించి మూడు మార్లు ఆచమనము చేసి శివుని రూపాన్ని భక్తి పూర్వకంగా ధ్యానించుకోవాలి.

Pages