S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

11/04/2019 - 19:30

శివ పద ప్రాప్తికి శుభ సమయంలో పవిత్ర తీర్థాలలో కానీ నదీ తీరాన కానీ దేవాలయాలలో కానీ శివలింగాన్ని స్థాపించటం సద్యోఫలాన్నిస్తుంది. శివలింగ ప్రతిష్ఠకు ప్రణవ మంత్రాన్ని జపించటం, శివ విగ్రహ ప్రతిష్ఠా సమయాన పంచాక్షరీ మంత్ర జపమూ వేదాలలో చెప్పబడ్డాయి. లింగానికి అభిషేకము, నైవేద్యము, నమస్కారమూ శక్తి కొలదీ ప్రతి నిత్యమూ చేయాలి. భూలోకంలో ఐదు రకాల శివలింగాలు ఉన్నాయి.

11/03/2019 - 22:07

వృక్షములు నాటిస్తే అక్షయలోకాలు పొందుతారని తెలిపి, మానవుడు సత్యమనే శ్రేష్ఠ యజ్ఞాన్ని ఆచరిస్తూ, తపస్సు, స్వాధ్యాయము, వేదాధ్యయనమూ, పురాణ శ్రవణమూ అనే సాధనాలు అవలంబిస్తే సంపూర్ణ యజ్ఞాలను చేసిన ఫలం పొందుతాడనీ, ముఖ్యంగా కలియుగంలో ఇంతకు మించిన ధర్మమేదీ లేదనీ, ఈ సాధనాలు ధ్యాన మోక్ష రూప ఫలలాను ఇస్తాయనీ తెలిపారు సనత్కుమార మహర్షి.

10/31/2019 - 18:52

‘‘మహా పురుషులారా! నందీశ్వర చరిత్రమూ, నందికేశ్వర తీర్థమూ ఎంత పావనమైనవో అర్థం అయింది కదూ! అంతటి భక్త శిరోమణి అయిన నందీశ్వరుడిని పరమ శివ భక్తుడైన మార్కండేయ మహర్షి పరమేశ్వర చరిత్రాన్నీ, ఆయన తత్త్వాన్నీ తనకు తెలుపవలసిందిగా అర్థించగా, అది శివాదేశం కనుక శివ తత్త్వాన్ని నందీశ్వరుడాయనకు బోధించాడు’’ అని భక్తిగా నమస్కరించుకున్నారు.
- - -
॥ మరణం,వినాదైనే్యన జీవనం

10/30/2019 - 19:02

పేరుకి వేదాలు వల్లించి, భాషణాలిచ్చి, నీతి సూత్రాలు బోధించే ఆ బ్రాహ్మణుడు పట్టరాని ఆగ్రహంతో, ఆ పసి పాదపు ఆ కాస్త వత్తిడికే ఆపాదమస్తకమూ కంపించిపోతూ, ప్రక్కనున్న దుడ్డు కర్ర తీసుకుని ఆ లేగదూడను విపరీతంగా బాదాడు.

10/29/2019 - 19:46

11
నందీశ్వర ధ్యానం
‘‘నందీశ్వర నమస్త్భ్యుం సాంద్రానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్థ మనుజ్ఞాం దాతుమర్హసి’’
నందీశ్వరుడి అకుంఠిత ప్రభు భక్తి (కోటి రుద్ర సంహిత)
‘‘శౌనకాదులారా!

10/28/2019 - 19:06

మీరు అనుమతిస్తేనేను ఈశ్వరానుగ్రహానికై కేదార క్షేత్రములో శివుని గూర్చి తపస్సు చేసి ఆయన ఆశీస్సులంది దీర్ఘాయుష్మంతుడినై తిరిగి వస్తాను’’ అని ఎంతో శాంతంగా, వినయంగా పలికి తల్లితండ్రుల అనుమతితో కేదార క్షేత్రానికి బయలు దేరాడు. అక్కడ ఓ అనువైన ప్రదేశంలో కూర్చుని శంకరుడి గూర్చి తీవ్రమైన తపస్సు చేయసాగాడు.

10/24/2019 - 18:30

ఆమె బిడ్డ లిరువురినీ పెంచి పెద్ద చేయగా రాకుమారుడు దైవవశాత్తూ తిరిగి రాజు కావటం, ఆమె రాజ మాత కావటం జరిగింది. ఆమె బిడ్డ రాజసోదరుడయి వారంతా సకల సుఖాలూ పొందారు.

10/23/2019 - 19:33

‘‘శౌనకాదులారా! మొట్టమొదటి వ్యాసుడు పరమేశ్వరుడే! మిగిలిన వ్యాసావతారాలు ఆయన ఆదేశించగా ప్రకటితమైన వివిధ మునులు, ఇరువై ఎనిమిదవ వ్యాసుడు పురుషోత్తముడైన శ్రీహరి అంశతో కృష్ణద్వైపాయనుడు. వ్యాసులందరూ ద్వాపరానా, యోగేశ్వరావతారులందరూ కలియుగానా ఉద్భవిస్తారు.

10/22/2019 - 19:31

10 శివావతారాలు (శతరుద్ర సంహిత)
సూత మహర్షి వివరిస్తున్న శివ పురాణాన్ని తన్మయులై వింటున్న శౌనకాది మునులు ఆయనని ఇలా ప్రార్థించాడు.
‘‘జ్ఞానివీ, వ్యాస శిష్యుడవూ అయిన సూత మునీంద్రా! దయ చేసి మాకు ఆ శంభుడి వివిధ అవతారాలనూ, వాటి వలన ప్రజలకు జరిగిన మేలూ వివరంగా తెలుపమని ప్రార్థిస్తున్నాము.’’

10/21/2019 - 19:59

తులసి లక్ష్మీ అంశురాలిగానూ, శంఖజూడుడు, కృష్ణాంశుడుగానూ జన్మించినా, శాపవశాత్తూ శంఖ చూడుడు లోక కంటకుడై ప్రజలనూ, దేవతలనూ బాధిస్తూండటంతో శివకేశవులు అతడిని వధించాలనే నిర్ణయానికి వచ్చారు. అమిత భక్తురాలూ, మహా పతివ్రతా అయిన అతని భార్య తులసి శీలాన్ని హరించాల్సి వచ్చింది విష్ణుమూర్తికి. బృంద వలెనే తులసి కూడా మోసపోయి తరువాత ఆయన మోసాన్ని గ్రహించి ఆయనకు పత్నీ వియోగం సంభవిస్తుందని శపించింది.

Pages