S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

01/07/2020 - 22:27

ఇంకా కొంచెం దూరం శక్తి కూడదీసికొని వంగివంగి కొన్ని అడుగులు వేసాడు. కాళ్లుకాయలు కాయగా అడుగు ఆమడదూరంగా బాధపడ్డాడు. క్రమంగా కుష్ఠవ్యాధి తీవ్రమై శరీరంనుండి చీము-నెత్తురు కారసాగింది. ఈగలు ఝుమ్మని మూగసాగాయి. అతి కష్టంగా నడుస్తూ ఆ కవీశ్వరుడు ఎతె్తైన శిఖరాలు గల పర్వతాలు కలిగి నిర్మానుష్యప్రదేశమూ మరియు బహుక్రూర మృగాల సంచారం చేత భయంకరమైన అరణ్యంలో చిక్కుకొని దిక్కు తెలియక దీనావస్థలో పడిపోయాడు.

01/02/2020 - 01:38

అప్పుడా గుడిలోని ఈశ్వరుడు దయతో ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించే రాజుమీద అరవభాషలో శృంగార రసబద్ధంగా ఒక పద్యాన్ని వ్రాసి యిచ్చి శివబ్రాహ్మణునితో ‘దీనిని రాజసభలో చదువు. రాజుమెచ్చి నీకు వేయి మాడలిస్తాడు. దానితో నీకు దినవెచ్చం (దినవ్యయం) లభించి సుఖంగా ఉండగలవు. కొంత కాలానికి కఱవు తొలగిపోతుంది. జనులందరికి హర్షం కలిగే విధంగా వర్షాలు పడతాయి. పంటలు పండుతాయి. ప్రజలకు సంతోషం కలుగుతుంది’.

01/01/2020 - 00:45

ఇంద్రుని కంటె అధికమైన కీర్తికలవాడు. నిరంతర దానం గుణంలో రెండవ కర్ణుడు. సముద్రం వలె చాల గంభీర స్వభావుడు. స్వస్వరూపమైన హిమమయ (మంచు) కాంతివలె యశోవంతుడైన హిమవంతునిలా మనోజ్ఞమైన సుందర స్వరూపం చేత చల్లని శాంతస్వభావుడనే ఘనకీర్తిని వహిం చాడు.

12/31/2019 - 04:14

అంతలో మహేశ్వరుడు సదయుడై కన్ను పెరుకబోవు కన్నప్ప వేగం కంటె వేగంగా అతని చేతనున్న బాణాన్ని పట్టుకుని ‘ఆగు ఆగు’మని పలుకుతూ శ్రీహరి- బ్రహ్మ- మునులు- అష్టదిక్పాలకులు మొదలైన దేవతలు ఇరువైపుల నిలిచి సేవిస్తూ ఉండగా హిమగిరికి తనయ ముద్దుకేలుతామర చిటికెన వ్రేలును పట్టుకుని నిర్మలమైన నిజలింగభాగం నుండి బయటకు వెలువడి ప్రత్యక్షమై ‘‘ఓ శివగోచరా! ఈ భక్తుని అచంచలమైన భక్తిని ఆద్యంతం నీవు చూసావు కదా.

12/30/2019 - 22:07

స్వచ్ఛమైన జలంతో స్నానం చేయించిన ఈ ఈశ్వరుని దేహం ఎందుకు నీటి చారికలు కట్టి ఉంది? ఆత్మశుద్ధి కల నీకు ఇట్టి నీచమైనవి తగునయ్యా! దేవా! ఈ కశ్మలాన్ని (అసహ్యకరమైన వస్తువు) ఎత్తిన ఈ రెండు చేతులతో నీ శరీరాన్ని తాకడానికి భయం కలుగుతూ ఉంది. ఓ పార్వతీశ్వర! దీనిని నీవెట్లు సహించావు. ఈ రీతిగా ఈ నీ ప్రదేశమంతా చెడిపోవుట నేటికి ఏడు దినాల నుండి జరుగుతున్నది. ఇది నీ మాయానాటకమా? లేక ఈ విధంగా ఎవడైనా చేస్తున్నాడా.

12/28/2019 - 22:18

‘అన్నా ! నిన్ను మాయచేసి యింతదూరం తీసుకొని వచ్చిన ఆ వరాహం ఎక్కడికి పోయింది? మమ్ముల్ని చూస్తూ కూడ ప్రియంగా మాటాడవేమి? ఏల కన్నీరు కారుస్తూ మేమేమన్నా కూడ మారు మాటాడవేమి? వేటాడేందుకు వచ్చి ఇచట నీవు ఈ విధంగా ఉంటే నీ తల్లిదండ్రులు దుఃఖింపరా? నీ గాలినే పసికట్టిన కుక్కలు ఒళ్లు విరుచుకొంటూ మెడలోని త్రాళ్లను ఎంతలాగినా లొంగక ఇటకు వచ్చి నీ చుట్టు తిరుగుతున్నాయి. వానిని కూడ చూడవేమి?

12/26/2019 - 00:11

ఎక్కడైనా కాసేపు విశ్రమిద్దామనుకొన్నాడు. అపుడు అతడికి ఒక బాగా పుష్పించిన వకుళవృక్షం కనిపించింది. దాని క్రింద తిన్నడు ఒంటరిగా నిద్రపోయాడు.
తిన్నని స్వప్నంలో ఈశ్వరుడు ప్రత్యక్షమగుట

12/25/2019 - 02:39

ఇంకొందరు ఊరికే ఉందామని తలంచి కూడ ఉండలేకపోయారు. వేరొకకొందరు లేవడానికి ప్రయత్నించి లేవలేక పోయారు. ఇంకా కొందరు ఎదుట ఎవరును లేకున్నా తిట్టేవారు. మరికొందరు పాడటం చేతకాకున్నా పాటలు పాడారు. మరికొందరు కనబడిన వారికందరికి దండాలు పెట్టేవారు. కొందరు సిగ్గులేక ఆడేవారు. మరికొందరు చాల త్రాగి కూడ ఇంకా కావాలని చేసాచేవారు. ఇంకా కొందరు ఊరగాయ పాత్రల్ని తడిమేవారు.

12/24/2019 - 21:51

కంటికి కాంతివంతంగా కాటుక దిద్దారు. మందుల తాయెత్తులు కట్టారు. తిన్నడు ఆవిధంగా శబర పుత్రులతో ఆటలాడటానికి వెళ్లాడు.

12/23/2019 - 22:25

ఇట్టి సకల భోగభాగ్యాలకు నివాసమైన ఆ యుడుమూరు అనే బోయపల్లెకు ప్రభువైన నాదనాథుడు మహాపరాక్రమశాలి. అతడు సింహాలకు కూడ పరాక్రమాన్ని విచక్షణతో శిక్షణనీయగల పరాక్రమవంతుడు. అరణ్యంలో గల ఆడ మదపుటేనుగులకు వైధవ్యాన్ని కల్పించగల బాహుబల సంపన్నుడు. ఆయన పరివారం జింక జంటల సంసారాన్ని నాశనం చేయడంలో అతి సమర్థులు. అతడు మృగాదనమనే జంతు సార్వభౌముని (తోడేలు) గర్వాన్ని అణచివేయడంలో అతిదారుణ పరాక్రమవంతుడు.

Pages