డైలీ సీరియల్

మాయా? మహిమా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకా కొంచెం దూరం శక్తి కూడదీసికొని వంగివంగి కొన్ని అడుగులు వేసాడు. కాళ్లుకాయలు కాయగా అడుగు ఆమడదూరంగా బాధపడ్డాడు. క్రమంగా కుష్ఠవ్యాధి తీవ్రమై శరీరంనుండి చీము-నెత్తురు కారసాగింది. ఈగలు ఝుమ్మని మూగసాగాయి. అతి కష్టంగా నడుస్తూ ఆ కవీశ్వరుడు ఎతె్తైన శిఖరాలు గల పర్వతాలు కలిగి నిర్మానుష్యప్రదేశమూ మరియు బహుక్రూర మృగాల సంచారం చేత భయంకరమైన అరణ్యంలో చిక్కుకొని దిక్కు తెలియక దీనావస్థలో పడిపోయాడు.
అంతలో ఆయనకు ఎదురుగా ఒక అందమైన కొలను కనిపించింది. అది ఝుంఝుమ్మని ఎగిరే తుమ్మెదలతో మనోజ్ఞంగా ఉంది. సుతారంగా వీచే గాలికి ఎగిరే తామరల పుప్పొడితో కొలనులో గల తామరలు అనే లతాంగి కేశపాశం నుండి వెదజల్లబడే ధూపపు పొగగా మనోహరంగా ఉంది. పుష్కలజలసమృద్ధి చేత రమణీయమైనది కావడం చేత హంసల (పరమహంసల) స్వేచ్ఛావిహారానికి కారణమై బహూదకులు (నీరుమాత్రం త్రాగి జీవించే యతులు) అనే యతుల సంచారం చేత రమణీయమై ఊహింపరాని (అప్రతర్క్యము) మరియు సాటియైన మరియొక వస్తువులేనిది (అద్వంద్వము) అయిన ఆకొలను పరబ్రహ్మం వలె సంపూర్ణశోభతో సుందరంగా ఉంది. తామరల రజస్సు (రజో గుణం)తో, దట్టంగా కమ్ముకొన్న సువాసనలు (పూర్వజన్మ సంబంధమైన గుణాలు) వ్యాపించిన ఆ కొలను కోశములు (అన్నమయ-మనోమయ-ప్రాణమయ-జ్ఞానమయ-ఆనందము కోశాలు) ఊర్ములు (మోహం-శోకం- ఆకలి- దాహం- వృద్ధాప్యం - మరణం) కలిగి సాక్షాత్తు భవ (సంసార సంబంధమైన) కాసారం (చెరువు) లాగ ప్రకాశిస్తూ ఉంది. అంతేకాదు తామరపూదళాలు (దళాలు, సైన్యాలు) రథాంగపక్షుల (చక్రవాక మరియు రదచక్ర) శబ్దాలతో నిండిపోయాయి. పరాగంపు (పుప్పొడి) ధూళి మరియు రాజహంసలచేత (రాజశ్రేష్ఠుల చేత) సంకులంగా (సమ్మర్ధంగా) ఉంది. రివ్వున వచ్చే శిలీముఖాల (బాణాలు) రొదవలె కొలనంతా శిలీముఖ (తుమ్మెదలు) రొదలతో కోలాహలంగా ఉంది. కదంబ (సైన్యాలు) సమూహాలతో ఆవరింపబడిన విధంగా కదంబవృక్షాలతో ఆవరింపబడి అది రమణీయంగా ఉంది. పుండరీకాల (తెల్లనిగొడుగులు) కాంతులతో ప్రకాశించే రీతిగా ఆ కొలను నిండుగా తామరపూలు కలిగి చిత్రంగా యుద్ధ్భూమిని తలపిస్తూ ఉంది.
నత్కీరుడట్టి కొలని సమీపం గా ఉన్న ఒక మఱ్ఱివృక్షం దగ్గరకు వెళ్లాడు. అది చాలా విశాలమైన వృక్షం. అది తన దట్టమైన ఆకులతో భూమి యంతటికి కట్టిన పట్టు వస్తప్రు చాందినిగా ప్రకాశిస్తూ ఉంది. పైకి బాగా పెరిగిన కొమ్మల సమూహం చేత దేవతలకు పచ్చని మరకతభవనాల్ని నిర్మి స్తూ వుంది. వ్రేలాడే కొమ్మలతో ఆ వృక్షం మునులకు పర్ణశాలా సముదాయాన్ని రచిస్తూ ఉంది. దిగంతాల వరకు వ్యాపించిన వటవృక్షపు నీడ చక్రవాళపర్వతం మీది పచ్చిక బయలుగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఇంకా ఏమిటంటే ఆ వటవృక్షం వాలఖిల్యాది మునులు అధిష్టించి తపస్సు చేసే రోహణ పర్వతమై యలరారుతూ ఉంది. అంతేకాక పితృదేవతలకు మోక్షాన్ని కలిగించే ప్రసిద్ధమైన గయా క్షేత్రంలోని అక్షయ వటవృక్షం వలె విశాలమై యుంది. ఆ విధంగా బహుశాఖలతో వ్యాపించటం చేత నల్లని నీడ కలిగి మిక్కిలి సంతోషాన్ని కలిగించే ఆ వటవృక్షం వద్దకు ఆ నత్కీర కవిరాజు చేరి కూర్చున్నాడు. ఆ సమయంలో చెట్టు నుండి రాలుతున్న పండుటాకులు నేలపై పడి పక్షుల్లా ఎగిరిపోసాగాయి. కొలనులో పడినవి మీనంబులై పోయాయి. మరికొన్ని కొలనులో సగం - గట్టుపై సగం పడి ఊగుతూ ఒకేసారి మీనత్వ పక్షిత్వ స్వభావాల్ని వహించి చమత్కారాన్ని కలిగిస్తున్నాయి. అట్టి వానిని చూస్తూ నత్కీరుడు ఆశ్చర్యపరవశుడై మైమరచి పోయాడు.
అంతలో వికటాకృతి కల ఒక మహాభూతం ఎచట నుండియో వచ్చి ఆ కవివరుణ్ణి పట్టుకొంది. అది క్రూరమైన కనుగ్రుడ్డు, భయంకరమైన కోరలు, వికారమై పైకిలేచిన వెంట్రుకలు, నల్లని శరీరం, కర్ణకఠోరమైన అరుపులు- వికటాట్టహాసాలు, నక్కకంఠం, భయంకర ఖడ్గం, మెడలో ఎముకల దండల శబ్దాలు కలిగిన ఆ మహాభూతం ఒక కొండగుహలోనికి నత్కీరుని తీసుకొని పోయి అంతకు ముందు తెచ్చిన మనుష్యుల్ని ఉంచిన ప్రదేశంలో ఉంచింది.
అప్పుడా అందరిని ఒకేసారి ఆహారంగా స్వీకరింపదలచిన ఆ మహాభూతం కొండ బిలానికి రాతిని అడ్డంగా పెట్టి స్నానమాడటా నికి వేగంగా కొలను వద్దకు వెళ్లింది.
అప్పుడు అంతకుముందే భూతం చేత చిక్కుపడిన అచటి మనుష్యులందరు నత్కీరు నితో ఇలా అన్నారు. ‘మా మీద దయలేక బ్రహ్మ నేడు నిన్ను నూరవ వ్యక్తిగా ఇక్కడకు తెచ్చిపెట్టాడు. ఈతడు నేడు మనందరిని తప్పక తిని వేస్తాడు. మనుష్యుల్ని చూచినంతనే ఈతడు నూరుకొని త్రాగి వేస్తాడు. ఒక నూరుమంది అయితేగాని ఇతడి నోటికి సరిపడదు. ఇప్పుడు నీవు రావడంతో నూరు మంది మనుష్యులు పూర్తి అయ్యారు. నేడు మనందరకు నూరేండ్లు నిండాయి. ఇక ఈశ్వరుడు ఏ విధంగా మనని దయచూస్తాడో’’. అచటి వారి మానల్ని విని నత్కీరమహాకవి త్రిపురాసుర భంజనుడైన ఈశ్వరుని కుమారుడగు సుబ్రహ్మణ్యస్వామి తనకు అండగా ఉండగా ఇక నేనేల భయపడాలి అని తన మనస్సులో ఇలా ప్రార్థించాడు.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512