డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం (రెండవ భాగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్ఘ్యపాద్యాలతో
ఎదురేగినారు
వారి ననుసరించి
నారు బ్రాహ్మణులును
స్తోత్రాలతో నతని ముంచెత్తినారు

రామలక్ష్మణుల కేమి పాలుపోలేదు
కనులు ప్రశ్నలతోడు ప్రశ్నింపసాగె

‘‘పరశురాముండితడు
జమదగ్నిసుతుడు
తండ్రి ఆనతితోడ
తల్లి రేణుకను
నరికినాడు పిదప బ్రతికించె తండ్రి

వేయి చేతులవాని
ద్రుంచి అర్జునుని
ఇరవదొక్కమారు
దండెత్తినాడు
శత్రులౌ క్షత్రియుల
దునుమాడినాడు
తనకు తానే సాటి ఈ జగజ్జెట్టి!’’

అంచు తెలిపెను గురువు
అతని చరితంబు
అపుడు దశరథుండు
ముందునకు నేగి
ఆకసమ్మే వంగి
చందురుని ముందు
మ్రొక్కినట్టుల మ్రొక్కె రాజు భార్గవునకు

‘‘ఓ రామ! శ్రీరామ! ఓ పరశురామ!
జయతు! జయతు రామ!
జయ పరంధామ!
జన్మధన్యమాయె మీ దర్శనమున!

నా కొడుకులే వీరు!
కోడండ్రు వీరలు!
ఇపుడే! ఈ ఓరోజె!
పెళ్ళాడినారు!
వెళ్ళుచుంటిమి తరలి ఇళ్ళకును ఇపుడె

అయ్య దీవించండి!
ఆశీస్సులిండు!
అనుచు వేడుకొనియె
అంత నా ప్రభువు
అక్షతల పళ్ళెమ్ము చేతికందించె

ఐన శాంతించడే
ఆ భార్గవుండు
ప్రళయరుద్రుని భాతి
ఎగిరిపడినాడు
పరశురాముడు కాడు
పరశువే అతడు
అగ్నిపర్వతమట్లు
భగ్గుమనినాడు
అందుకొని పళ్ళెమ్ము విసరేసినాడు
విష్ణుచక్రమ్మనగ
ఎగిరె పళ్ళెరము
నక్షత్ర రాశులే
చెదరనో యనగ
వ్యాపించె గగనాన
ఇంకా ఉంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087