డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంత గొప్పవైన
వీరుడవు నీవొ?
ఐనచో నా విల్లు
నెక్కుపెట్టేవొ?
విష్ణుచాపమ్మిది! విష్ణుతేజమ్ము!

ఎక్కుపెట్టెదవేని
మెచ్చుకొని యెదను
మెచ్కుని నీతోడ
సేతు యుద్ధమును’’

‘‘అదెయైన మీ ఆజ్ఞ
శిరసావహింతు!’’
‘‘ఇదిగో విల్లమంచు
అందించెనతడు’’

రాఘవుండా విల్లు
పిడికించేను
కాదు భార్గవుడినె
పిడికించేను
పిడికించుచు శక్తిపిండివేసెను

ఏమి మిగిలెను ఉత్త తిత్తియే మిగిలె
ఏమి మిగిలెను ఉత్త వత్తియే మిగిలె

భానున్ని పోలుచు
పొంగె రాముండు
చంద్రున్ని కైవడి
కృంగె నాతండు

చాపమ్ము పైనొక్క
శరమెక్కుబెట్టి
‘‘ఎచట దీనిని విడుతు?’’
చెప్పమనినాడు

‘‘మీరు ఆర్జించిన
పుణ్యమ్ముపైనొ?
లేక మీ గమనమ్ము’’
పైనొ? తెలుపండి!’’’
అనుచు నిలదీసెను రాఘవుండంత

‘‘అయ్య! మీరవతార
పురుషులని గెరుగై
లోకబాంధవులంచు
నేనెరుగబోను!
నా తప్పు మన్నించి నన్ను బ్రోవరండి!

కరుణించి నా గమన
మాపబోకండి!
నా పుణ్యలోకాల
పైన విడువండి

మహేంద్రగిరిపైకి
మరలి నే పోదు
మరల తపమును జేసి
నే కూర్చుకొందు
జయము! జయము నీకు
జయము! శ్రీరామ!
నీవింక లోకాల
నేలుకో రామ!
వెలుగుచును వెలుగువలె వ్యాపించు రామ!’’
అనుచు చుట్టును తిరిగి
చేసె వందనము

‘‘అటులనే సరి’’యంచు
రామభద్రుండు
అతడు కూర్చిన పుణ్య
లోకాలపైకి
సంధించి శరమును వదలివేసెను

ఇంకా ఉంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087