డైలీ సీరియల్
భక్తునికి ఆపద.. శివయ్య ఆగ్రహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అప్పుడా గుడిలోని ఈశ్వరుడు దయతో ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించే రాజుమీద అరవభాషలో శృంగార రసబద్ధంగా ఒక పద్యాన్ని వ్రాసి యిచ్చి శివబ్రాహ్మణునితో ‘దీనిని రాజసభలో చదువు. రాజుమెచ్చి నీకు వేయి మాడలిస్తాడు. దానితో నీకు దినవెచ్చం (దినవ్యయం) లభించి సుఖంగా ఉండగలవు. కొంత కాలానికి కఱవు తొలగిపోతుంది. జనులందరికి హర్షం కలిగే విధంగా వర్షాలు పడతాయి. పంటలు పండుతాయి. ప్రజలకు సంతోషం కలుగుతుంది’. అని చెప్పి రాజసభకు పంపాడు. ఆ బ్రాహ్మణుడు రాజసమ్ముఖానికి పోయి పరమేశ్వరునిచే వ్రాయబడిన కవితను చదివి అందలి చమత్కారాన్ని వివరించాడు. ఆ కవితలో ‘గజరాజ గమనయైన పార్వతీదేవి కేశపాశం సహజసిద్ధంగా సుగంధభరితం’ అనే భావం ఇమిడియుంది. దానిని విని ఆ రాజసభలో గల నత్కీరుడనే కవి ఎగతాళి చేస్తూ ‘స్ర్తిలకేశపాశం సహజ సుగంధ భరితమంటె అందరు నవ్వుతారు. ఇది తప్పు. ఈ రీతిగా కవిత చెప్పరాదు. కవితా నియమాలకిది విరుద్ధం. నీవీవిధంగా వ్రాయడం సరియైనదా?’ అని పలికాడు. ఆ మాటల్ని విని ఆ శివబ్రాహ్మణుడు చిన్నబుచ్చుకొని ‘ఉత్తములారా! దీనిని నాకు ఆ పరమేశ్వరుడే వ్రాసి యిచ్చాడు. ఇందలి తప్పు-ఒప్పులు నాకు తెలియవు’ అని పలికాడు.
శివబ్రాహ్మణుని ఓదార్చి
శివుడే నత్కీరకవితో వాదానికి పోవుట
తదుపరి నేరుగా ఆ శివబ్రాహ్మణుడు ముక్కింటి వద్దకు వచ్చి ఆయన పద్యాన్ని తిరిగి ఆయనకే సమర్పించి ‘దేవా! నీ మాటల్ని నమ్మి సభకు పోయి అవమానపడి తిరిగివచ్చాను. సర్వజ్ఞత్వం (అన్నీ తెలియడం) బహుముఖకార్య నిర్వహణశక్తి అనే గొప్పగుణాలు కలవాడవని నిన్ము నమ్మి నేను సభలో పౌరుషాభిమానాల్ని పోగొట్టుకొని వచ్చాను. ఎవడైనా తానెరిగిన విద్యనే రాజసభలలో ప్రదర్శించాలి. అప్పుడే గౌరవం దక్కుతుంది. అలాకాక పరవిద్యాధీనుడై ఉంటే రాజసభలలో అవమానమే కలుగుతుంది. ఇక చెప్పేందుకు ఏముంది? నా అదృష్టము ఈవిధంగా ఉంది. నిన్ను - నత్కీరుని నిందించుట ఏమి న్యాయం? నీ దయ ఇక చాలు. ఈ కరువుచే నేనిట్లయ్యాను. ఎక్కడకయినా పోయి బిచ్చమెత్తుకొని కరువుపోయిన తర్వాత వస్తా ను. దేవా! నీకు భద్రమగు గాక. ఇక నేను వెళ్లడానికి అను మతించు. అని ప్రార్థించాడు.
శివబ్రాహ్మణుడి మాటలు విని చంద్రశేఖరుడు కారుణ్య మూర్తియై ‘కటకట! ఆ నత్కీరుడు నిన్నా విధంగా తూలనాడాడా? నేను వ్రాసిన కవితలో తప్పు పట్టాడా? అదేమిటో తెలుసుకొంటాను. నావెంట రాజసభకు రా’ అని పలికి తిన్నగా రాజసభకు వచ్చి ‘ఈ రాజన్యుని మీద నేను సాహిత్య స్ఫూర్తితో మధురమైన కవిత చెప్పి పంపగా నత్కీరుడు అసూయతో అందు తప్పుపట్టాడట. ఆ తప్పు లక్షణంలోనా? అలంకారంలోనా? పదబంధంలోనా? లేక రసంలోనా? ఇప్పుడు చక్కగా చెప్పండి’ అన్నాడు.
ఈశ్వరుడా రీతిగా పలుకగానే ఆ నత్కీరుడు ముందు తప్పన్న రీతిగా మరల తప్పని అన్నాడు. దానికి శివుడు హిమగిరి కన్యకామణి పార్వతి కేశపాశం సహజ సుగంధ వంతమైనదని సమర్థించాడు. ఈశ్వరుని సమర్థన విని నత్కీరుడు ‘పార్వతి ధమిల్లం (కేశపాశం) అట్లే సుగంధభరితం కావచ్చుగాక. లోకంలోని స్ర్తిల కది అసహజం. ఇక నీ హఠాన్ని మానుకో. ఆకాశంలో పుష్పముంది లాంటి నిరాధారమైన వాదాలు లోకంలోని ప్రత్యక్షవాదంతో సరితూగగలవా? కపటమైన- బుకాయింపు అయిన మాటలిక చాలు.’ అని ఎదురు పలికాడు. అప్పుడు నత్కీరుని దేవీధిక్కారగర్వాన్ని అణచేందుకు తన నిజస్వరూపాన్ని చూపదలచి ముక్కంటి తన త్రినేత్రాన్ని చూపాడు. అయినా నత్కీరుడు వెనుతిరుగక ‘నీవు తలచుట్టు నేత్రాలు కలిగినవాడవయినా ఈ పద్యం తప్పుకాదనవశమా? ఇక్కడ నీ మాయావిలాసాలు చాలుచాలు’ అని ధిక్కారస్వరంతో బదులు పలికాడు. అప్పుడు నీలకంధరుడు నత్కీరుని ప్రతి వచనాలకు కోపించి ‘నీవు కుష్ఠవ్యాధి పీడితుడవు కమ్ము’ అని శపించాడు. అంతట నత్కీరుడు పశ్చాత్తప్తుడై అపరిమితమైన భయాన్ని పొంది ‘స్వామీ! నీ యెడల అపరాధం చేసాను. క్షమించి నాకు శాపవిమోచనోపాయాన్ని తెలుపవే’ అని ఆ కృపాధాముని పాదపద్మాలమీద పడ్డాడు. అప్పుడా భక్తజనమందారుడు శాంతి వహించి కైలాసాన్ని దర్శిస్తే ఈ వ్యాధి తొలగి పోగలదు అని శాపవిమో చనాన్ని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.
పిమ్మట జరిగిన దానికి చింతిస్తూ నత్కీరుడిలా దుఃఖించాడు. ‘వ్యర్థంగా ఈ కవితాభిమానాన్ని నేనేల వహించాను? శంఖపీఠిపై కవులందరు మిన్నకుండినట్లుగా నేనునూ ఉండక దేవునితో ఎందుకు వాదులాటకు దిగాను? మహాభయం కరమైన ఈ కృష్ఠవ్యాధి బాధను ఎలా భరించ గలను? వెండికొండ నిక ఎప్పుడు చూడగలను? ఎనె్నన్నో మహానదులు-పర్వతాలు- బోయపల్లెలు- మృగాలు - నిర్జన మార్గాలు దాటి ఏ విధంగా మహాకైలాస దర్శనం చేయగలను? సదాశివా! ఈ ఆపద నేనూహించింది కాదు. ఏమి చేస్తాను? కరుణాసాగరా! భక్తవత్సల! శివా! గౌరీశ! సింహాలు - పులులు - మదగజాలు - ఖడ్గమృగాల సంచారం చేత భయంకరమైనవి, మహారాక్షస విహారం చేత భీతిదాయకమైనవి, అత్యధిక హిమపాతం చేత దుర్గమమైనవి (ప్రవేశింపరానివి) గ్రుచ్చుకొని బాధించే రాళ్లమయమైన మార్గాల్ని దాటడం నాకు శక్యమా?
- ఇంకావుంది...