డైలీ సీరియల్

నిర్మల భక్తితో నిశ్చల జ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతలో మహేశ్వరుడు సదయుడై కన్ను పెరుకబోవు కన్నప్ప వేగం కంటె వేగంగా అతని చేతనున్న బాణాన్ని పట్టుకుని ‘ఆగు ఆగు’మని పలుకుతూ శ్రీహరి- బ్రహ్మ- మునులు- అష్టదిక్పాలకులు మొదలైన దేవతలు ఇరువైపుల నిలిచి సేవిస్తూ ఉండగా హిమగిరికి తనయ ముద్దుకేలుతామర చిటికెన వ్రేలును పట్టుకుని నిర్మలమైన నిజలింగభాగం నుండి బయటకు వెలువడి ప్రత్యక్షమై ‘‘ఓ శివగోచరా! ఈ భక్తుని అచంచలమైన భక్తిని ఆద్యంతం నీవు చూసావు కదా. ఇతడు సద్భక్తుడు అవునా. నీ మనస్సుకు నచ్చినాడా?’’ అని పలికాడు. పిమ్మట శివుడు దరహాసం చేస్తూ ఆటవికుడైన తిన్నని, శివ భక్తుడైన శివబ్రాహ్మణుని తన దరికి పిలుచుకొని మీకు ఏ వరాలు కావాలో తెలుపుండని ఆనతిచ్చాడు.
అప్పుడు వారిరువురు ‘ఓ దేవా! సంపూర్ణమైన నీ దివ్యతేజస్సు, జగత్తు మిద్య (జగత్తు అసత్యం) అనే సత్యాన్ని సుస్థిరపరచే నీ విలాసం మమ్ము ఆవేశించింది. దాని వలన దృష్టి-మనస్సు అను రెండు తన చంచల స్వభావాన్ని వీడి అచంచలమై వౌనముద్ర వహించాయి. ఈ సమయంలో మాకు దేహాత్మాభిమానం నశించింది. మాకింతకంటె కావలసిన ఫలమేముంది? జగములు, అంతరాత్మ, సాక్షి అన్నియు నీవే నని అదే నిత్యమని సర్వవేదాలు నిన్ను స్తుతిస్తున్నాయి. ఈ విషయం తెలిసీ కూడ వేరొక వరాన్ని మేమెట్లు కోరగలం? సర్వమూ నీవే అయిన చిదానందాత్మకమైన ఆకాశంలో మా ఇరువురిని లీనం చేసుకో. తిరిగి భూలోకంలో జనన మరణబాధలు లేకుండ చేయి. ఇతడు కిరాతుడు నేను దుర్మతుని. మమ్మడిగియే ఈ రీతిగా మాయందు ప్రసన్నుడవ య్యావా? అదే విధంగా మాకు మేలయిన సంసారదుఃఖాన్ని నివారించు. శివా! నీతలంపు కన్న మాతలంపు అధికమా? మమ్ముల్ని అడుగనేల? నీవు నీ చిత్తంలో మమ్ముల్ని ఏవిధంగా ఉంచదలచావో అట్లే ఉంచు. ఓ దయాగుణసాంద్రా! ఇప్పుడు మా మనస్సు ఆనందామృత రసవార్థిలో మునిగియుంది. వరానే్న ఈయదలిస్తే నీయందు ఐక్యమయ్యే వరాన్ని ప్రసాదించు’’ అని సాష్టాంగ దండప్రణామాలు చేస్తూ విమల మహేశ్వరుని ధ్యానంలో మునిగిపోయారు. అప్పుడు వారిరువురికి ఇహలోకపు బుద్ధి కలుగనీయకుండ శివుడు అనంతమైన ఆత్మరూపంలో వారిని విలీనం చేసుకొన్నాడు. ఓహో! ఏమి వీరు తమ భక్తి మహిమచేత వీరు పొందిన మోక్షభాగ్యం. ఆహా! హాలాహల భోక్త అయిన శివుని భక్తులలో అగ్రగణ్యంగా వీరు పొందిన కారుణ్యం (దయ) ఏమి!! అని వినాయకుడు- విష్ణువు- బ్రహ్మ-దిక్పాలకులు - యోగీశ్వరులు- హాహా హూహూ మొదలయిన దేవతలు స్తుతిస్తుండగా శివుడు అంతర్ధానమయ్యాడు.
నత్కీరుని కద
మధురాపురవర్ణన
తిన్నడు, శివ బ్రాహ్మణు డు శివ సాయుజ్య మందిన కద వినగానే యాదవ భూపతి శివుడికి నమస్కరించి శ్రీకాళ హస్తీశుని దయ వలన ఇంకా ఎవరెవరు మోక్షాన్ని పొందారో వివరించుమని అడిగాడు. దానికి సమాధానంగా ఈశ్వరు డు నత్కీరుని కదనిలా చెప్పసాగాడు.
దక్షిణాపథాన మధుర అనే పుణ్యక్షేత్రముంది. అది అరువది నాల్గు మాయాశంబరాది తాంత్రిక కళావిలాసాల చేత నిత్యవిహారం చేసే వాలవాయి చొక్కేశ్వరుని (సుందరేశ్వరుడు) నిత్యనివాస భూమి. అది ఆయన పట్టదేవియయిన మీనాక్షీదేవికి ప్రధాన గృహం కూడ. ద్రవిడ భాషా పీఠస్థానమైన శంఖ ఫలకమున్న బంగారు పద్మాల పుష్కరిణికి (కొలను) నిలయం. దక్షిణ సముద్రపత్నియైన తామ్రపర్ణీ నదికి సవతియైన వైఘానది ప్రవహించే పుణ్యభూమి. తన కన్ను తామరలచే శివుని పూజించిన కూడలళఘయ విష్ణుదేవులు పూజించుట చేత నశింపచేయబడిన పాపపంకిలం కలది. సకల సంపత్ సమృద్ధిచే లోభిజనులకు పశ్చాత్తాపాన్ని లేకుండ చేసే సౌభాగ్యప్రదాయిని అయిన భాగ్యభూమి. ప్రజలందరికి మనోల్లాసం కలిగే విధంగా చంద్రశేఖరుడు ఏ పట్టణంలో పాండ్యభూపాలుడి కల్లుడై విరాజిల్లుతున్నాడో ఆ పట్టణానికి సాటియైన పట్టణం ఈ లోకంలో ఎక్కడుంది? గంగాధరుని త్రినేత్రాగ్ని రతీదేవిని విధవరాలిగా చేసింది. వెనువెంటనే అంగయకన్యాంబ (మీనాక్షీదేవి) తన కృపావీక్షణం చేత ఆమెను ముతె్తైదువుగా చేసివేసింది. ఆ నగరంలో తన సౌందర్యానికి తగినట్లుగా మాణిక్యవల్లి- మరకతవల్లి- ఆనంద వల్లి- అమృతవల్లి- కర్పూరవల్లి అంగయకన్యాంబ అనే వివిధ నామాలతో మీనాక్షీదేవి వెలసియుంది. కనక పద్మతీర్థమనే కొలను పడమటి ఒడ్డు ఆమె స్థిరనివాసం. పాండ్య భూపాలుని పుత్రికయైన ఆమె లోకజనని. సంపూర్ణవనవతి. పరిపూర్ణ చంద్రమఖి. ఆ జనని సంరక్షిస్తున్న అఖిల సంపదలతో తులతూగే ఆ మధురాపట్టణానికి ఏ పట్టణం సరిరాగలదు? ఇట్టి మాహాత్మ్యంతో దర్శనమిచ్చే జగజ్జనని కల అచటి ప్రజల భాగ్యం ఏ పట్టణాలకుంది? ఇతర పట్టణాల్ని ఈ మధురాప ట్టణంతో సాటియని ఎట్లు కొనియాడగలం? తన పేర్లను- తన సేవయు- తన ప్రసాదం అన్నింటిని ఇచ్చిన సాక్షాత్తు పార్వతియే మీనాక్షిదేవియై సంరక్షించే ఆ మధురానగర స్ర్తిలవైభవాన్ని ఇలలో ఎవరు స్తుతించగలరు? శివుని పూజాసమయంలో ఆ నగరంలోని స్ర్తిలంతా తమలో తాము ఏమే కల్పకవల్లి! అమృతవల్లీ రా! కర్పూరవల్లీ! వెళ్లవా? ఇదిగో మాణిక్యలతా! మరకతం ఎక్కడుంది? ఆనందవల్లీ! మీనాక్షీ! ఇటురండి అంటూ మధురంగా పలికే మాటల సందడి అచ్చట అధికంగానే ఉంటుంది. ఆ మధురానగరాన్ని పాండ్యమహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు అనంతమైన పరాక్రమం కలవాడు. రాజ్యపాలనా విషయంలో పేరెన్నిక గన్న ఊహింపరాని బుద్ధివైభవం కలవాడు. శత్రురాజుల ప్రతాపానికి సూర్యప్రతాపం వంటివాడు.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512