S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

02/22/2018 - 22:54

అడుగడుగునా మాకు అండగా నిలిచి మమ్ములను వేయికళ్ళతో కాపాడుచున్నవాడివి నీవే కదా! ధర్మవేత్తవి. ఇప్పుడు పాండు సుతులు సతీసమేతంగా హస్తినాపురానికి రెండవసారి వచ్చారు. కౌరవులు నా పుత్రులపట్ల ద్వేషభావంగలవారని నాకు తెలుసు. కానీ మేమందరమూ రాజు ధృతరాష్ట్రునికి విధేయులమై వుండవలసినదే గదా! రాజుకు ధర్మబద్ధమైన హితోపదేశం చేసి నా పుత్రులకు ధర్మబద్ధంగా రావలసిన పాలు వచ్చే విధంగా చేయవలసిన బాధ్యత నీదే.

02/22/2018 - 22:54

కాంపిల్యం దుఃఖసాగరంలో మునిగింది. పురవీధులలో రెండుప్రక్కలా నిలిచిన ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. కొందరు జయజయ ద్వానాలు చేశారు.
పాండవుల రథాలు ముందు నడువగా వెనుక ద్రౌపది రథం దానిని అనుసరిస్తున్నది. వీరికి ముందు వెనుకలా భటులు శస్తధ్రారులై నడుస్తున్నారు. అశ్వికులు, గజారోహులు వారిని అనుసరిస్తూ నడుస్తున్నాయి. రథాలన్నీ కాంపిల్య నగర ప్రాకారాలన్నిటినీ దాటాయి.

02/22/2018 - 22:56

అలాగే పాండవులు నీ ఆలోచనతోనే పెరిగి మంచివారయ్యారు. నీవే వారికి రక్షకుడవు. కోకిల పుత్రులను కాకి సంరక్షించినట్లు నీ పుత్రులను నేను పెంచాను. ప్రాణాంతకమైన కష్టాలను అనుభవించాను. ఇకపై కర్తవ్య నిర్ణయం నీవే చేయాలి’’ అని అన్నది.
‘‘యాదవ వంశ నందినీ! నీ పుత్రులు అతిబలవంతులు. ఇతరులచే నాశనం పొందరు. అచిరకాలంలో వారు బంధు ఇత్రులతో కలిసి రాజ్యాధికారాన్ని పొందుతారు’’ విదురుడు అన్నాడు.

02/22/2018 - 22:58

కానీ దృతరాష్ట్రుడు భీష్మద్రోణ విదురులతో సంప్రదించిన తరువాత నిర్ణయాన్ని చెబుతానన్నాడు.
దృతరాష్ట్రుడు భీష్మద్రోణ విదురులను పిలిపించాడు. వారితో సంప్రదించాడు.
భీష్మ ద్రోణ విదురులతో సంప్రదించిన ధృతరాష్ట్రుడు తదుపరి కర్తవ్యమేమిటో ఆలోచించసాగాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడి మనోగతాన్ని భీష్ముడు తెలిసికొన్నాడు. దుర్యోధనుడు కూడా వచ్చాడు. అప్పుడు భీష్మ పితామహుడు ధృతరాష్ట్ర దుర్యోధనులను చూచి-

02/22/2018 - 23:02

వివాహ తతంగమంతా యథావిధిగా ముగిసింది. ద్రుపదుడు, పాండవులు, ద్రౌపది సంతోషించారు.
ద్రుపదుడు మహారథులైన పాండవులకు కానుకలను ఇచ్చాడు.
వివిధ వస్తు సామగ్రిని, సువర్ణమాలలుగల నూరు రథాలను ఇచ్చాడు.
పద్మమూ, శంఖమూ గల వంద ఉత్తమ గజాలను ఇచ్చాడు.
బంగారు తొడిగిన వంద ఏనుగులను ఇచ్చాడు.
వనవతలైన వందమంది దాసీజనాన్ని, విలువైన వస్త్రాలను, ఆభరణాలను కానుకగా ఇచ్చాడు.

Pages