డైలీ సీరియల్

యాజ్ఞసేని 44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడుగడుగునా మాకు అండగా నిలిచి మమ్ములను వేయికళ్ళతో కాపాడుచున్నవాడివి నీవే కదా! ధర్మవేత్తవి. ఇప్పుడు పాండు సుతులు సతీసమేతంగా హస్తినాపురానికి రెండవసారి వచ్చారు. కౌరవులు నా పుత్రులపట్ల ద్వేషభావంగలవారని నాకు తెలుసు. కానీ మేమందరమూ రాజు ధృతరాష్ట్రునికి విధేయులమై వుండవలసినదే గదా! రాజుకు ధర్మబద్ధమైన హితోపదేశం చేసి నా పుత్రులకు ధర్మబద్ధంగా రావలసిన పాలు వచ్చే విధంగా చేయవలసిన బాధ్యత నీదే. నీ అండతోనే మేము కాలం గడుపుచున్నాము. ఇకముందు ఏమి జరుగనున్నదో నీవూ వూహించి పాండు పుత్రులను కాపాడగలవని ఆశించుచున్నాము’’ అని అన్నది.
విదురుడు కుంతీదేవి ఆజ్ఞను తీసుకొని వెళ్ళేముందు ద్రౌపదిని చూచి-
అమ్మా! పాంచాల రాకుమారీ! నీవు కారణ జన్మురాలవి. పాండు సుతులకు పట్టపురాణివయ్యావు. కౌరవులు బహు దుర్మార్గులు. నీతి బాహ్యులు. జాగ్రత్తగా మసలుట నీ విధి. సుపుత్రులను కని వంశమును ఉద్ధరింపుము. సుఖశాంతులతో వర్థిల్లుము’’ అని అన్నాడు.

24
పాండవులు ద్రౌపదితో కలిసి హస్తినాపురంలో ఐదు సంవత్సరాలు కాలం గడిపినారు.
ఒకనాడు ధృతరాష్ట్రుడు భీష్మపితామహుని, పాండవులను తనవద్దకు పిలిపించుకున్నాడు. పాండవులు తండ్రి ఆజ్ఞ ప్రకారం వచ్చారు. తాను భీష్మునికి, పెద తండ్రి ధృతరాష్ట్రునికి పాదాభివందనం చేశారు. ఆశీస్సులను పొందారు. ఆసీనులయ్యారు. అప్పుడు ధృతరాష్ట్రుడు-
‘‘యుధిష్ఠిరా! శ్రద్ధగా వినుము. నీతో చెప్పే మాటలను నీ సోదరులు కూడా శ్రద్ధగా వినాలి. పాండురాజు ఈ రాజ్యాన్ని వృద్ధిజేశాడు. నా సోదరుడు పాండురాజు బలవంతుడు. నా చేత అనేక యజ్ఞాలు చేయించాడు. అతడు నా ఆజ్ఞలపై అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. నీవు కూడా నా ఆజ్ఞలను పాటించాలి. నా పుత్రులు గర్వం, అహంకారంగల చెడ్డవాళ్ళు. దుర్మార్గులు. వారు నా ఆజ్ఞలను ఎప్పుడూ పాలింపరు. స్వార్థపరులై మీతో యుద్ధానికి దిగకుండా వుండాలంటే మీరు వెంటనే ‘ఖాండవప్రస్థానికి’ వెళ్లాలి. మీరు అక్కడ నివసిస్తే మిమ్ములను ఎవరూ బాధించరు. దేవతల రక్షించునట్లు అర్జునుడు సదా మిమ్ములను రక్షిస్తుంటాడు. నీవు అర్థరాజ్యంగా ఖాండవప్రస్థాన్ని పొంది అక్కడ సోదరులతో సుఖంగా జీవించుము’’ అని తదుపరి విదురుని పిలిపించి-
‘‘విదురా! యుధిష్ఠిరుని రాజ్యాభిషేకానికి అన్నింటినీ సిద్ధంగావింపుము. ఆలస్యం వలదు. నేను ఈ రోజే కురుకుల నందనుడైన యుధిష్ఠిరుడిని అభిషేక్తిను. వేదవేత్తలయిన బ్రాహ్మణులను, బంధువులను, వ్యాపారులను, హితులను విశేషంగా రప్పింపుము. పుణ్యాహవాచనం చేయించి బ్రాహ్మణులకు భూరి దక్షిణలను యిమ్ము. గోవులను, గ్రామములను దానం చేయుము. ముత్యాల హారాలు, కోటిసూత్రం, ఉదరబంధం తెప్పించుము. కావలసిన ఏనుగులను సిద్ధము చేయుము. ఏనుగులు పోయి గంగాజలాన్ని తేవాలి. యుధిష్ఠిరుడిని సర్వాభరణాలతో అలంకరింపుము. అంబారి ఏనుగు, సువర్ణ్భారణాలు, శే్వతఛత్రం, చామురాలను సిద్ధం చేయింపుము. రాజులు జయ జయ శబ్దాలు పలకాలి. ప్రజలు ప్రసన్నులై అజమీఢ వంశజుడైన యుధిష్ఠిరుడిని ప్రశంసించాలి. పాండురాజు చేసిన ఉపకారానికి ఈ రాజ్యాభిషేకం చేయాలి’’ అని ఆజ్ఞాపించాడు.
భీష్మద్రోణాదులు విదురుడు బాగు! బాగు! అని ప్రశంసించారు. శ్రీకృష్ణుడు ‘‘మహారాజా! నీ ఆలోచన ఉత్తమం కౌరవులకు అభివృద్ధికరం. వెంటనే నీవన్నమాటను నేడే ఆచరించి చూపించుము’’ అని అన్నాడు. తొందరపెట్టాడు.
విదురుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. అదే సమయంలో శ్రీకృష్ణద్వైపాయన మహర్షి అక్కడకు వచ్చాడు. కౌరవులందరూ బంధు సమేతంగా వేదవ్యాసుని పూజించారు. శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము వేదపండితుల సహాయంతో మహర్షి పట్ట్భాషేకం పూర్తిగావించాడు.

- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము