S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డైలీ సీరియల్
‘‘మేము అర్జునుని విషయంలో కపటంగా ప్రవర్తించాము. కాబట్టి మరో ఉపాయంతో వారిని చంపగలిగితే మాకు హితం చేకూరుతుంది’’ అని దుర్యోధనుడు అనగా
‘‘పాండవులకు ఒక స్ర్తి గతి అయింది’’ అని భీముడు మనస్సులో వ్యధతో అనుకొన్నాడు.
ద్రౌపది మాటలు విన్న ధృతరాష్ట్రుడు ద్రౌపది గుణాలకు, ధర్మ పరిజ్ఞానానికి సంతోషించాడు. యుధిష్ఠిరుని, అతని తమ్ములతో కూడా రప్పించి
‘‘యాజ్ఞసేనీ! నేను భీమార్జుననకుల సహదేవుల మాటను మన్నించాలనుకొంటున్నాను. వీరంతా నిన్ను పణంగా పెట్టడానికి ధర్మరాజుకు అధికారం లేదని చెపితే దాస్యం నుండి నీకు విముక్తి కలిగిస్తాను’’ అని అనగా అర్జునుడు
‘‘కౌంతేయుడు, మహాత్ముడైన ధర్మరాజు మమ్ము పణంగా పెట్టినప్పుడు తాను స్వతంత్రుడేగానీ, తాను ఓడిపోయిన తరువాత మరెవరిమీదా తనకు అధికారముండదు. కౌరవులందరూ అది గ్రహించాలి’’ అని అన్నాడు.
రాజులెవ్వరూ ఏమీ అనలేదు. అప్పుడు కర్ణుడు కలుగజేసుకొని ‘‘ఈ ద్రౌపది దాసి. ఇంటికి నడిపించు’’ అని దుశ్శాసనునితో అనగా
ద్రౌపది సిగ్గుపడుచూ, వణికిపోతూ పాండవుల గూర్చి విలపిస్తుండగా దుశ్శాసనుడు ఆ తపస్విని సభామధ్యంలోనికి ఈడ్చాడు. ద్రౌపది నేలపై పడింది. అప్పుడు ద్రౌపది
హే గోవిందా! హే ద్వారకావాసా! హే కృష్ణా! గోపీజనప్రియా! కేశవా! రమానాథా! వ్రజనాథా! ఆర్తినాశనా! ఈ కౌరవసాగరంలో మునిగిపోతున్న నన్ను ఉద్దరించవా! గోవింద! కృష్ణా! మహా యోగా! విశ్వాత్మా! విశ్వభావనా! గోవిందా! కౌరవుల మధ్య కలతపుడూ నిన్ను శరణు కోరిన నన్ను రక్షించుము! రక్షించుము! రక్షించుము! రక్షించుము! రక్షించుము!
హే కృష్ణ! గోవింద! గోపాల!
ధృతరాష్ట్రుడి నూర్గురు కొడుకులలో ధర్మపక్షపాతి ‘వికర్ణుడు’ ఒక్కడే. నిండు సభలో ద్రౌపదిని లాగి తెచ్చి అవమాన పరచినప్పుడు ‘‘ఇది అధర్మం’’ అని ఎలుగెత్తి చాటిన ధర్మపక్షపాతి. పదునాల్గవనాటి మహాభారత యుద్ధంలో భీమసేనుడు వికర్ణుని చంపబోయే ముందు బోరున ఏడుస్తాడు.
ఇవన్నీ ఆలోచించకుండా ఏమీ చెప్పలేను. ధర్మరాజు సమృద్దమైన భూమినంతా వదులుకొంటాడు గానీ ధర్మాన్ని విడువడు. అటువంటి ధర్మరాజే ‘‘ఓడిపోయాను’’ అని అంగీకరించాడు. కాబట్టి నీ ప్రశ్నను గూర్చి విచారించలేదు. మానవులలో ద్యూతవిద్యలో ‘శకుని’. ఆ శకుని యుధిష్ఠిరుడిని రెచ్చగొట్టి నిన్ను పణంగా పెట్టాడు. శకుని మోసాన్ని ధర్మరాజు గ్రహించలేదు. కాబట్టి నేను నీ ప్రశ్నను గూర్చి చెప్పలేను’’ అని అన్నాడు.
ఆ దూత ద్రౌపది వద్దకు వచ్చి
‘‘పాంచాలీ! నీవు ఏకవస్తవ్రు. రజస్వలవు. నీవు క్రింది వస్త్రాన్ని ధరించి ఉన్నదానవు. అయిననూ ఏడుస్తూ సభలోనికి వచ్చి మామగారి ఎదుట నిలు. నీవు వస్తే ఆ రీతిగా సభలోనికి రావలసి వచ్చిన రాజకుమారిని నిన్ను చూచి సభ్యులందరూ దుర్యోధనుని గట్టిగా నిందిస్తారు.’’ అని ధర్మరాజు చెప్పపంపిన మాటలను వినిపించాడు. ధర్మరాజు నిర్ణయాన్ని తెలిపాడు.
బాహ్లికుడు, సోమదత్తుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, దృతరాష్ట్రుని పుత్రుడైన యుయుత్సుడు బసకొట్టే సర్పాల వలె తలలు వాల్చి చేతులు నలుపుకొన్నారు. ఇతర సభ్యుల కళ్లవెంట నీళ్లుకారాయి.
ధర్మరాజు మరలా అన్నాడు. ‘‘ఈ సహదేవుడు ధర్మాన్ని ఉపదేశించగలవాడు. పండితుడని ఈ లోకంలో పేరు పొందినవాడు. నాకు ప్రియుడైన ఈ రాజకుమారుడు పందెంగా పెట్టదగినవాడు అయినా ఇష్టంలేని వస్తువుగా భావించి పందెంగా పెడుతున్నాను’’ అని అన్నాడు.
శకుని పాచికలను విసరి ‘‘నేనే గెలిచాను రాజా! నీకు ఇష్టమైన నకుల సహదేవులను నేనే గెలిచికొన్నాను’’ అని అన్నాడు.