డైలీ సీరియల్
యాజ్ఞసేని-65
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆ దూత ద్రౌపది వద్దకు వచ్చి
‘‘పాంచాలీ! నీవు ఏకవస్తవ్రు. రజస్వలవు. నీవు క్రింది వస్త్రాన్ని ధరించి ఉన్నదానవు. అయిననూ ఏడుస్తూ సభలోనికి వచ్చి మామగారి ఎదుట నిలు. నీవు వస్తే ఆ రీతిగా సభలోనికి రావలసి వచ్చిన రాజకుమారిని నిన్ను చూచి సభ్యులందరూ దుర్యోధనుని గట్టిగా నిందిస్తారు.’’ అని ధర్మరాజు చెప్పపంపిన మాటలను వినిపించాడు. ధర్మరాజు నిర్ణయాన్ని తెలిపాడు.
దుర్యోధనుడు మరలా ప్రాతికామితో ‘‘నీవు పోయి ద్రౌపదిని తీసుకొనిరా. ఆమె ఎదుట కౌరవులు సమాధానం చెప్తారు’’ అని అన్నాడు. కానీ ప్రాతికామి ద్రౌపది కోపానికి భయపడి
‘‘ద్రౌపదితో ఏమి చెప్పమంటారు’’ అని మరలా సభికులను అడిగాడు. అది విని దుర్యోధనుడు ‘‘దుశ్శాసనా నా సేవకుడైన సూతపుత్రుడు భీముని చూసి భయపడుతున్నాడు. నీవు వెళ్లి ద్రౌపదిని తీసికొనిరా! పరాధీనులైన పాండవులు నినే్నం చేయగలరు’’ అని అనగా దుశ్శాసనుడు వెంటనే పాండవుల భవనంలో ప్రవేశించి
‘‘పాంచాలీ! రా! రా! జూదంలో నిన్ను గెలిచికొన్నాం. ద్రౌపదీ! సిగ్గువిడిచి దుర్యోధనుని చూడుము. కౌరవులను సేవించుము. ధర్మబుద్ధితో నిన్ను పొందాం. సభలోనికి రా!’’ అని అన్నాడు.
ఆ మాటలను విని దుఃఖించి ద్రౌపది లేచి వివర్ణయై ముఖాన్ని చేతితో తుడుచుకుకొని ఆర్తయై ధృతరాష్ట్రుని అంతఃపురకాంతలు ఉన్నవైపు పరువెత్తింది. దుశ్శాసనుడు కూడా రోషంతో గర్జిస్తూ వేగంగా ఆమెను వెంబడించాడు. నల్లగా ఉంగరాలు తిరిగి ఉన్న ఆ ద్రౌపది దీర్ఘకేశాలను పట్టుకొన్నాడు. రాజసూయ యాగ క్రతువులో అవభృధస్నానంతో మంత్ర పవిత్రమైన నీటితో తడిసిన ఆమె కురులు పాండవ పరాక్రమాన్ని పరిహసించి దుశ్శాసనునిచే బలాత్కారంగా లాగబడ్డాయి. అంత మంది భర్తలున్నా అనాధవలె దుశ్శాసనుని చేత లాగబడింది. అప్పుడు ద్రౌపది
‘‘బుద్ధిహీనుడా! పాపాత్ముడా! నీచుడా! నేను రజస్వలను. ఏక వస్తన్రు. దుర్మార్గుడా!
నన్ను సభలోనికి కొనిపోగూడదు’’ అని అనగా దుశ్శానుడు
‘‘యాజ్ఞసేనీ! నీవు రజస్వలవు కావచ్చు. ఏక వస్తవ్రు కావచ్చు. వివస్తవ్రు కావచ్చు. జూదంలో నిన్ను గెలిచికొన్నాం. దాసివయ్యావు. కాబట్టి ఇష్టం ప్రకారం దాసుల మధ్యనే నివసించాలి’’ అని అనగా ద్రౌపది
‘‘క్రూరాత్ముడా! దురాచారుడా! నన్ను లాగవద్దు. వివస్తన్రు చేయవద్దు. ఇంద్రునితో పాటు దేవతలందరూ నీకు సహాయంగా వచ్చి నిలిచినా సరే పాండవులు నిన్ను సహించరు. ఇంతమంది సభికుల మధ్య నన్ను నిలపటం నాకు తగినది కాదు. మహాత్ముడైన ధర్మరాజు ధర్మమందే నిలిచేవాడు. ఛీ! ఛీ! భరతవంశ రాజుల ధర్మం,క్షత్రిధర్మవేత్తలైన ఈ మహానుభావుల నడవడీ రెండూ చెడ్డాయి. అందుకే కౌరవులు ధర్మాన్ని అతిక్రమిస్తున్న సభలో కురువంశస్థు లంతా ప్రేక్షకులయ్యారు’’ అని అనగా దుశ్శాసనుడు ఆమెను కోపంగా లాగి
‘‘దాసీ! దాసీ!’’ అని పెద్దగా నవ్వుతూ అరిచాడు. ద్రౌపది అచేతనమైంది. కర్ణుడు బిగ్గరగా నవ్వాడు. కర్ణ శకుని దుర్యోధనులు తప్ప సభలోని వారంతా దుఃఖితులయ్యారు. అప్పుడు భీష్మ పితామహుడు కలుగజేసుకొని ద్రౌపదిని చూచి
‘‘సౌభాగ్యవతీ! ధర్మం సూక్ష్మమైనది. కాబట్టి నీ ప్రశ్నను స్పష్టంగా విచారించలేదు. తనది కాని దానిని పందెంగా ఎవడూ పెట్టలేడు. స్ర్తి ఎప్పుడూ భర్త తోడిదే. ..........................ఇంకావుంది