డైలీ సీరియల్

యాజ్ఞసేని-64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహ్లికుడు, సోమదత్తుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, దృతరాష్ట్రుని పుత్రుడైన యుయుత్సుడు బసకొట్టే సర్పాల వలె తలలు వాల్చి చేతులు నలుపుకొన్నారు. ఇతర సభ్యుల కళ్లవెంట నీళ్లుకారాయి.
(ఇది ధర్మరాజు తెలిసి చేసిన తప్పు. విధి నిర్ణయమని తప్పించుకొనరానిది. అంతేగాక పూర్వకాలంలో ‘‘స్ర్తిని’’ కూడా ఒక వస్తువుగా పరిగణించేవారు. వారి మీద సర్వాధికారాలు ఉండేవి. కారణం ‘‘న స్ర్తి స్వాతంత్య్ర మర్హతి’’ అనే నానుడి. అంతమాత్రం చేత ఒక స్ర్తిని ఆటవస్తువుగా పరిగణించి ఆటలాడటం అతిఘోరమైన సంగతి. ఇది పురుషాధిక్యం.
ధర్మరాజు తమ్ములను ధనంగా ఎలా పరిగణిస్తాడు. వారిని ఎలా పందెంగా పెట్టగలడు. పైగా ఉమ్మడి భార్య అయిన ద్రౌపదిని తక్కిన భర్తల అనుమతి లేకుండా ఎలా పందెమొడ్డుతాడు? రాజైనా ధర్మాన్ని అతిక్రమించ కూడదు గదా? అంత ధర్మవేత్తకు ధర్మసూత్రాలు తెలియవని అనుకోవలసిన పనిలేదు.
ధర్మరాజు ద్రౌపదిని పందెంగా ఒడ్డేటప్పుడు అంతమంది పెద్దలు, రాజులు, గురువులు ఉన్న గొప్ప సభలో ‘‘ద్రౌపది సౌందర్యాన్ని అంతగా వర్ణించవలసిన అవసరమేమిటి? భార్య అంగాంగాలను వర్ణిస్తారా? ఒకరకంగా దుర్యోధనాధులకన్నా ధర్మరాజే ఈ పరిస్థితికి బాధ్యత వహించవలసి ఉంటుంది
సభగూడా అంతే బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించింది. దుర్గార్గులలో దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు మనసులో పాండవుల సంపదను అపహరించాలని దుర్యోధనుని కంటే ధృతరాష్ట్రుడికే ఎక్కువ. కణికనీతిని తు.చ తప్పకుండా అనుసరించే మనిషి. కురుకులంలో అప్పటి పెద్దకోడలిని పణంగా పెడితే ఎలా సహించి ఊరుకున్నాడు. వెంటనే ఆపి ఉంటే ‘‘ద్రౌపది వస్త్రాపహరణ దృశ్యం తప్పి ఉండేది’’ పెద్ద ఈర్ష్యాపరుడు, పాండురాజు రాజ్యాలను జయించి ధనాన్ని తెచ్చి అన్నమీద అభిమానంతో వంద అశ్వమేధ యాగాలను చేయించాడు. అన్నీ అన్న పేరుమీదనే చేసి రాజ్యాన్ని కాపాడాడు.
తమ్ముని కొడుకులని ప్రేమ లేదు. ఇతరులు ఏమయినా అంటారనే భయంతో పైకి ప్రేమను ప్రదర్శించేవాడు.)
***
ధృతరాష్ట్రుడు ఆనందంతో ‘‘గెలిచామా? గెలిచామా? అని పదేపదే అడిగాడు. తన ఆకారాన్ని, ముఖకవళికలను దాచుకొన లేకపోయాడు.
అప్పుడు శకుని పాచికలను చేతబట్టి ‘‘ఇది కూడా గెలిచినట్లే’’ అని అన్నాడు.
(ఇలా ఆనందాన్ని వెలిబుచ్చిన ధృతరాష్ట్రుడి వంటి కనపడని దుష్టప్రవృత్తి గలవాడు మరొకడు లేడు)
వెంటనే దుర్యోధనుడు లేచి ‘‘విదురా! విదురా! పాండవుల మనస్సుకు నచ్చిన ప్రియసతి ద్రౌపదిని ఇక్కడకు తీసుకొని రా! ఆ పాపాత్మురాలు వెంటనే ఇక్కడికి రావాలి. అంతఃపురాన్ని శుభ్రం చేయాలి. ఆమె ఇక్కడ దాసీలతో పాటు ఉండాలి’’ అని అన్నాడు. ఆ మాటలకు కోపించిన విదురుడు
‘‘మూర్ఖుడా! నీవంటివాడే ఇటువంటి మాటలనగలడు. కాలపాశానికి చిక్కి, చావుకొని తెచ్చుకొని, ఎదురులేక ప్రవర్తిస్తున్నావు. బుద్ధిహీనుడా! నీ తలమీద మహా పవిషసర్పాలున్నాయి. యమ లోకానికే వెళ్లే ప్రయత్నాలు వద్దు. ద్రౌపది దాసి కాదగదు.
యుధిష్ఠిరుడు ముందు తనను ఓడి ఆపై అస్వతంత్రుడై ద్రౌపదిని పణంగా పెట్టాడని నేను భావిస్తున్నాను. ఈ దుర్యోధనుడు పోగాలాన్ని గ్రహించలేకున్నాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము