డైలీ సీరియల్

యాజ్ఞసేని-63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మరాజు మరలా అన్నాడు. ‘‘ఈ సహదేవుడు ధర్మాన్ని ఉపదేశించగలవాడు. పండితుడని ఈ లోకంలో పేరు పొందినవాడు. నాకు ప్రియుడైన ఈ రాజకుమారుడు పందెంగా పెట్టదగినవాడు అయినా ఇష్టంలేని వస్తువుగా భావించి పందెంగా పెడుతున్నాను’’ అని అన్నాడు.
శకుని పాచికలను విసరి ‘‘నేనే గెలిచాను రాజా! నీకు ఇష్టమైన నకుల సహదేవులను నేనే గెలిచికొన్నాను’’ అని అన్నాడు.
‘‘శకునీ! ఈ అర్జునుడు నావలె మమ్ము యుద్ధంలో తరింపజేయగలవాడు. శత్రువులను జయింపగలవాడు. లోకైక వీరుడైన అతనిని పందెంగా పెట్టటం తగని పనే. అయినా సరే ఈ అర్జునుని పందెంగా ఒడ్డి ఆడుచున్నాను’’ అని అన్నాడు.
శకుని పాచికలను విసరి ‘‘నేనే గెలిచాను. పాండవులలో మేటి విలుకాడైన సవ్యసాచిని కూడ నేనే గెలిచికొన్నాను. రాజా! ఇప్పుడు నీ దగ్గర నీ కిష్టమైన భీమసేనుడే పందెం బెట్టడానికి మిగిలి వున్నాడు. అతనిని పందెంగా పెట్టుము’’ అని అన్నాడు.
భీమసేనుడు యుద్ధంలో మా సేనాపతి. రణరంగంలో వజ్రధారి అయిన ఇంద్రునివలె ఒంటరిగా మమ్ము నడిపింపదలిచాడు. అడ్డంగా కూడా చూడగలడు. సింహస్కంధుడు, శత్రుసంహారి. అటువంటివానిని పందెంగా పెట్టరాదు. అయినా ఆ భీముని పందెంగా ఆడుతున్నాను’’ అని అనగానే శకుని పాచికలను విసరి
‘‘్ధర్మరాజా! నేనే గెలిచాను. రాజా సమస్తం ఓడిపోయావు. నీకు పోగొట్టుకొనక మిగిలిన ధనమేమయినా వుంటే చెప్పుము’’ అని అనగా
‘‘నేనే సోదరులందరిలో విశిష్ఠుడను. అందరికీ ఇష్టమైన వాడిని. నన్ను నేను పందెంగా ఒడ్డుచున్నాను.ఓడిపోతే దాసునివలె సర్వకార్యాలు చేస్తాను’’ అని అన్నాడు.
శకుని పాచికలను విసిరాడు. ‘‘నేనే గెలిచాను. రాజా నిన్ను నీవే పందెంగా పెట్టి ఓడిపోయి పెద్ద పాపం చేశావు. నీ దగ్గర ఇంకా డబ్బున్నప్పటికీ నినే్న నీవు ఓడిపోవడం పాపం’’ అని సభికులకు పాండవులు ఓడిపోయిన విషయాన్ని చెప్పి మరలా ధర్మరాజు వైపు తిరిగి
‘‘యుధిష్ఠిరా! ఇంతవరకు నీవు పోగొట్టుకొనని పందెపు వస్తువు ఒకటి ఉన్నది. నీ ప్రియ సతి ద్రౌపదియే. ఆ ద్రౌపదిని పందెంగా పెట్టి నిన్ను మళ్లీ గెలుచుకో’’ అని అనగా ధర్మరాజు
‘‘ఈ ద్రౌపది మరీ పొట్టిగాదు. మరీ పొడుగు గాదు. మరీ నల్లనిది గాదు. మరీ తెల్లనిది గాదు. ఉంగరాలు తిరిగిన నీలవేణి. ఈమెను పందెంగా పెట్టి నీతో ఆడుచున్నాను. ఈమె శరత్కాలపు కలువరేకుల వంటి కన్నులు గలది. శరత్కాలపు కలువల పరిమళం వంటి పరిమళం గలదిదు. శరత్కాలపు కలువలను సేవించెడిది. రూపంలో లక్ష్మిని పోలినది. పురుషులలో ఆశించే దయాగుణం, రూప సంపత్తి, శీలసంపత్తి కలదు. సర్వగుణ సంపన్న, అనుకూలవతి, ప్రియభాషిణి. సర్వాంగ సుందరి అయిన పాంచాల రాకుమారిని, ద్రౌపదిని పందెంగా పెట్టి నాకిది కష్టమయినా ఆడుతున్నాను’’ అని అట్లా ధర్మరాజు అనగా
‘‘అక్కడున్న వారంతా అయ్యో! అయ్యో! అన్నారు. సభ సంక్షోభానికి గురి అయింది. రాజులంతా బాధపడ్డారు. భీష్మద్రోణ కృపాచార్యులకు చెమట పట్టింది విదురుడు శక్తి కోల్పోయి తల పట్టుకొని కూర్చున్నాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము