డైలీ సీరియల్

యాజ్ఞసేని - 66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవన్నీ ఆలోచించకుండా ఏమీ చెప్పలేను. ధర్మరాజు సమృద్దమైన భూమినంతా వదులుకొంటాడు గానీ ధర్మాన్ని విడువడు. అటువంటి ధర్మరాజే ‘‘ఓడిపోయాను’’ అని అంగీకరించాడు. కాబట్టి నీ ప్రశ్నను గూర్చి విచారించలేదు. మానవులలో ద్యూతవిద్యలో ‘శకుని’. ఆ శకుని యుధిష్ఠిరుడిని రెచ్చగొట్టి నిన్ను పణంగా పెట్టాడు. శకుని మోసాన్ని ధర్మరాజు గ్రహించలేదు. కాబట్టి నేను నీ ప్రశ్నను గూర్చి చెప్పలేను’’ అని అన్నాడు. భీష్ముని మాటలు విన్న ద్రౌపది
‘‘జూదంలో నిపుణులు, అనార్యులు, దుష్టాత్ములు, వంచకులు, ద్యూతప్రియులైనవారు యుధిష్ఠిరుడిని సభకు పిలిపించి జూదమాడారు. ధర్మరాజుకు జూదంగా పెద్దగా అభ్యాసం లేదు. అటువంటి ధర్మరాజు మదిలో జూదమాడాలన్న కోరికను ఎందుకు కలిగించాడు. అపవిత్ర మనస్కులైనవారు, వంచకులైన వారందరూ చేరి అమాయకుడైన ధర్మరాజునకు ముందుగా గెలుచుకున్నారు. ఆ తరువాత నిన్ను పందెంగా పెట్టటానికి అంగీకరింపజేశారు. సభలోనున్న కురు వంశస్థులందరూ కొడుకులూ, కోడళ్లు కలవారే. మీరంతా నా వాక్యాన్ని ఆలోచించి నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పండి.
పెద్దలు లేని సభ సభయే గాదు. ధర్మం చెప్పని పెద్దలు పెద్దలేగారు. సత్యహీనమైన ధర్మం ధర్మమేగాదు. కపటత్వంతో కూడిన సత్యం సత్యమేగాదు’’ అని పలికింది.
దీనావస్థలో ఉండి, దీనులైన భర్తలను చూస్తున్న ద్రౌపదిని దుశ్శాసనుడు అప్రియంగా, కఠినంగా ఎన్నో మాటలు అన్నాడు. ఆమెను ఈడుస్తుండగా చూచిన భీమసేనుడు నిస్సహాయుడై ఏమియూ చేయలేక ధర్మరాజును నిందిస్తాడు. ధర్మరాజు చేతులను ఖండిస్తానంటాడు. అప్పుడు అర్జునుడు కలుగజేసుకొని భీమసేనుని శాంతింప చేస్తాడు.
ఆ విధంగా దుఃఖిస్తున్న పాండవులను, లాగబడుచున్న ద్రౌపదిని చూసి ధృతరాష్ట్రుడి కొడుకైన ‘వికర్ణుడు’
‘‘రాజులారా! యాజ్ఞసేని అడిగిన ప్రశ్నకు బదులు చెప్పండి. సమాధానం ఇవ్వకపోతే మనమంతా నరకానికి పోతాము. కురువృద్ధులైన భీష్మధృతరాష్ట్రులు ఉండి కూడా నోరు మెదపటం లేదు. విదురుడు కూడా నోరెత్తటం లేదు. ద్రోణకృపాచార్యులవారు, బ్రాహ్మణోత్తములు వారు గూడా ఈ ప్రశ్నకు సమాధానమెందుకు చెప్పరు. సౌభాగ్యవతి అయిన ఈ ద్రౌపది పదేపదే వేసిన ప్రశ్నకు విచారించి సమాధానం చెప్పాలి. ఎవరు ఎవరి పక్షమో తెలియాలి’’ అని అనగా వికర్ణుని మాటలు విన్న సభాసదులు అతడిని ప్రశంసిస్తూ శకుని నిందించారు. ఎవరూ సమాధానం చెప్పక పోవడంతో మరలా వికర్ణుడు
‘‘నేనే ఇక్కడ ధర్మనిర్ణయం చేస్తాను. అందరూ వినండి. జూదం, వేట, మద్యపానం, అతిగా తినటం అనే నాలుగు చెడు వ్యవసనాలు. వీటిలో తగులుకున్న మానవుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తాడు. ఒక జూదగాని చేత ఆహ్మానింపబడి, జూదవ్యసనంలో తగులుకొని ఓడిపోయిన ధర్మరాజు పాండవులందరికీ ఉమ్మడి సొమ్మయిన ‘పాంచాలి’ని పణంగా చేశాడు. అందువల్ల ఆమె అధర్మం చేత జయింపబడింది. ఆ సుకుమారిని ఏకవస్త్రం ధరించి ఉన్నదానిని ఇక్కడికి లాగుకొని రావటం అన్యా యం’’ అని ఎలుగెత్తి చాటాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము