S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డైలీ సీరియల్
ఘటోత్కచుడు తానెవరో తెలియపరచి, పాండవుల వివరాలను ధర్మరాజు గొప్పతనాన్ని విభీషణునికి వివరించగా సంతోషించిన విభీషణుడు ఘటోత్కచుని సత్కరిస్తాడు. ధర్మరాజు రాజసూయయాగానికై ఘటోత్కచుని పగడాలను, మణులను, రత్నాలను, బంగారుపాత్రలను, సువర్ణమయాలైన పల్లకీలను, అనేక ధనరాశులను కానుకగా ఇచ్చాడు.
ఉత్తర దిక్కును జయించి ధనరాశులను తెచ్చినందులకు అర్జునుడు ధనంజుయుడు అనే పేరును పొందాడు.
భీమసేనుడు
ఆ మాటలు వినిన భీమసేనుడు తదుపరి యుద్ధం మొదలుకాగానే జరాసంధుని ఆకాశంలోనికి ఎత్తి గిరగిరా త్రిప్పాడు. క్రింద పడవైచాడు. ఒక పాదాన్ని త్రొక్కిపట్టి మరొక పాదాన్ని పైకి లాగి జరాసంధుని శరీరాన్ని రెండుగా చీల్చి వ్యతిరేక (విపరీత) దిశలలో పడవేశాడు. అప్పుడు ఆ రెండు భాగాలు ‘జర’ అనే రాక్షసి సంధించినట్లుగా సంధింపబడక జరాసంధుడు మరణించాడు.
మహాభాగా! నీవు సమర్థుడవు. మేము నీ అధీనంలో వున్నాము. మహారాజా! త్వరలోనే రాజసూయయాగాన్ని పూర్తిచేయగలవు. ఇంక సంకోచించకుండా యాగంపై మనసు పెట్టండి’’’ అని అన్నారు.
ధర్మరాజు ధర్మబద్ధం, సాహపూర్ణం, అభీష్టం, శ్రేష్ఠం అయిన మంత్రుల మాటలను మనసారా స్వీకరించాడు. తదుపరి మహాత్ములైన ఋత్విక్కులతో, ధౌమ్యునితో, వేదవేదాంగ పారంగతుడైన వ్యాసమహర్షితో రాజసూయయాగాన్ని గురించి సంప్రదించి వారితో
ఏకాంతంలో ద్రౌపదితో కలిసి వున్న వానిని వేరొక సోదరుడు చూస్తే అతడు పండ్రెండు సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. పాండవులందరూ ఈ నిర్ణయం అంగీకరించాలి’’ అని చెప్పాడు.
పాండవులు తమ అంగీకారం తెలిపిన తదుపరి నారదుడు వెళ్లిపోయాడు.
28
అది ధర్మరాజు భవనము.
ధర్మరాజు ఆసనంపై ఆశీనుడై ఏవో రాచకార్యాల గురించి ఆలోచిస్తున్నాడు. ద్రౌపది మెల్లగా దర్మరాజు మందిరంలోనికి వచ్చింది.
తాను తిరిగి వెళ్లిపోతున్నానని విచారవదనుడై వున్న ధర్మరాజుతో శ్రీకృష్ణుడు-
మంచి ఏనుగులు, గోవులు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు, మేకలు మొదలైన పశుసంపదలతో నగరం సమృద్ధిగా నిండినది.
తియ్యమామిడి, కదంబం, అశోకం, చంపకం, పున్నాగం, నాగపుష్పం, లకుచం, మొదలగు పుష్ప జాతులతో నగరం సుగంధమయమైంది.
పనస, మద్ది, తాడి, చీకటి చెట్లు, పొగడ చెట్లు, మొగలి పొదలు, మొదలైన వృక్ష పుష్ప జాతులతో నగరము చూడముచ్చటగా చేయబడినది.
ద్రౌపదీ! నీవు మహాపతివ్రతల కోవకు చెందిన దానవు. ముందు ముందు నా కొడుకులు నీపట్ల అనుచితంగా ప్రవర్తించినా, బాధపెట్ట ప్రయత్నించినా నామీద గౌరవంతో వారిని ఎలాంటి శాపానికి గురి చేయవద్దని నిన్ను ప్రార్థించుచున్నాను. నా మాటపై గౌరవం వుంచుతావని నమ్ముచున్నాను’’ అని ఆవేదనతో నివేదించింది. ఆ మాటలు విన్న ద్రౌపది గాంధారితో-
భీష్ముడు, శ్రీకృష్ణుడు, ద్రోణుడు, కృపుడు, ధౌమ్యుడు, వ్యాసమహర్షి, బాహ్లికుడు, సోమదత్తుడు, చతుర్వేద విశారుదులైన బ్రాహ్మణులను ముందుంచి యధావిధిగా, శాస్త్రోక్తంగా భద్రపీఠంపై నిగ్రహంతో వున్న ధర్మరాజును అభిషేకించారు.
‘‘రాజా! నీవు ఈ సమస్త భూమినీ జయించి నీ అధీనం క్రింద వుంచి రాజసూయ యాగాలు భూరి దక్షణలిచ్చి నిర్వహించి అవభృధస్నానం చేసి బంధు మిత్రులతో సుఖంగా యుండుము అని ఆశీర్వదించారు.