డైలీ సీరియల్
యాజ్ఞసేని - 72
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘మేము అర్జునుని విషయంలో కపటంగా ప్రవర్తించాము. కాబట్టి మరో ఉపాయంతో వారిని చంపగలిగితే మాకు హితం చేకూరుతుంది’’ అని దుర్యోధనుడు అనగా
‘‘దుర్యోధనా! పాండవుల విషయంలో ఎటువంటి ఉపాయాన్నీ ప్రయోగించకూడదు. ఇంతకు ముందు పాండవులపై నీవెన్నో ఉపయోగించావు. నీ ఉపాయాలన్నీ వారు అతిక్రమించారు. కాబట్టి మన వంశం, మన పరిజనం జీవించి ఉండాలంటే, నీవు నీ సోదరులు, మిత్రులు, బంధువులు నిత్య స్నేహంతో మెలగాలి’’ అని అన్నాడు ధృతరాష్ట్రుడు.
అయితే దుర్యోధనుడు విడువక ‘‘రాజా! పాండవులు కోపించి శస్త్రాలు ధరించి రథాలనెక్కి కుపిత సర్పాలవలె మనలను నిశే్శషంగా చంపివేస్తారు. అర్జునుడు కవచాన్ని ధరించి, రెండు అమ్ముల పాదులను ధరించి, మాటిమాటికీ గాండీవాన్ని ధరించి నిట్టూర్పులు విడుస్తూ, అటునిటూ చూస్తూ వెళ్లాడట. భీముడు పెద్ద గదను చేపట్టి వేగంగా తన రథాన్ని ఎక్కి గబగబా వెళ్లాడట. అలా మేము విన్నాం. నకులుడు అర్ధచంద్రాకారంలో ఉన్న డాలును, కత్తిని తీసికొని వెళ్లాడట. సహదేవుడు, యుధిష్ఠిరుడు కూడా వారు చేయదలచిన పనిని సూచిస్తూ వెళ్లారట. వారు సేనను సమకూర్చుకొనటానికి వెళ్లారట. మనం వారిని పరాభవించాం. దానిని వారిప్పుడు క్షమించరు. ద్రౌపది పడిన కష్టాలను సహించి వారిలో ఎవరు మిన్నకుంటారు.
నీకు మేలు జరుగుతుంది. వనవాసాన్ని పందెంగా పెట్టి మరలా జూదం ఆడుదాం. ఈ రీతిగా వారిని లొంగదీసుకోవాలి. జూదంలో ఓడిపోతే వారైనా, మేమైనా పండ్రెండేండ్లు మృగచర్మాలు ధరించి వనంలో నివసిస్తూ పదమూడవ సంవత్సరం అజ్ఞాతంగా గడపాలి. అజ్ఞాతవాసం భంగమైతే మరలా పండ్రెండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒకేడు అజ్ఞాతవాసం గడపాలి. వారైనా, మేమైనా పందెంతో జూదమాడుదాం. రాజా! ఇదే మనకు సర్వోత్తమమైన కర్తవ్యం. ఈ శకుని అక్షవిద్యలో ఆరితేరినవాడు. మనం రాజ్యాన్ని గట్టి చేసుకొందాం. పదమూడవ సంవత్సరాన్ని గడిపి పూర్తి చేసి వస్తే వారిని యుద్ధంలో ఓడిద్దాం’’ అని అనగా
‘‘పాండవులు ఎంత దూరం వెళ్లినా వారిని వెనుకకు పిలిపించు. వారు వచ్చి ఈ క్రొత్త పందెంతో జూదమాడాలి’’ అని అన్నాడు ధృతరాష్ట్రుడు.
అప్పుడు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, బాహ్లికుడు, సోమదత్తుడు, విదురుడు, అశ్వత్థామ, యుయుత్సుడు, వికర్ణుడు అందరూ
‘‘ఇప్పుడు జూదం వద్దు. ప్రశాంతంగా సాగనీ’’ అని పలికారు. అయినాసరే కుమారులపై ప్రేమతో ధృతరాష్ట్రుడు పాండవులను పిలవటానికే ఆదేశించాడు. ప్రాతికామిని పోయి పాండవులను పిల్చుకొని రమ్మన్నాడు.
గాంధారి హితబోధ
అప్పుడు రాబోయే అరిష్టాన్ని శంకించి ధర్మపరాయణ అయిన గాంధారి పుత్రస్నేహం వలన ఏర్పడిన శోకంతో భీతిల్లి ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి భర్తతో
‘‘మహారాజా! దుర్యోధనుడు పుట్టగానే మహామతి అయిన విదురుడు ‘ఈ బాలుడు వంశ నాశకుడు. ఇతనిని వదిలి పెట్టుట మంచిది’ అని చెప్పాడు గదా! నక్కలా అరిచాడు. వీడు తప్పక వంశనాశకుడే. కౌరవులారా మీరు దీన్ని గ్రహించండి. స్వదోషంతో మీరు ఈ వంశాన్ని సముద్రంలో కలపకండి. ప్రభూ! దుర్మార్గులైన ఈ బాలుకుల మాటలు మన్నించకండి. ఈ వంశనాశనానికి మీరు కారకులు కాకండి. ఆరిన నిప్పును ఎవరైనా రాజేస్తారా? శాంతించిన కౌంతేయులను మరలా రెచ్చగొట్టట మెందుకు. స్వామీ! మీకంతా తెలుసును. గుర్తున్నది కూడా! అయినా మరలా గుర్తు చేస్తున్నాను. దుర్భుద్దికి శాస్త్రం మంచిగానీ, చెడుగానీ నేర్పలేదు. మందమతి అయిన బాలుడు వృద్ధులవలె వివేకవంతుడు కాలేడు. తమ పుత్రులను తమరే నడిపించండి. లేకపోతే వారు హద్దులను అతిక్రమించి, భంగపడి చెదరిపోయి తమను వీడిపోతారు. నా మాటవిని వంశనాశకుడైన వీడిని వదలి వేయండి. పుత్ర స్నేహం వలన తమరు చేయవలసిన పనిని చేయలేరు. దాని ఫలితమే ఇది.
..........................ఇంకావుంది