డైలీ సీరియల్
యాజ్ఞసేని - 70
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘యాజ్ఞసేనీ! నేను భీమార్జుననకుల సహదేవుల మాటను మన్నించాలనుకొంటున్నాను. వీరంతా నిన్ను పణంగా పెట్టడానికి ధర్మరాజుకు అధికారం లేదని చెపితే దాస్యం నుండి నీకు విముక్తి కలిగిస్తాను’’ అని అనగా అర్జునుడు
‘‘కౌంతేయుడు, మహాత్ముడైన ధర్మరాజు మమ్ము పణంగా పెట్టినప్పుడు తాను స్వతంత్రుడేగానీ, తాను ఓడిపోయిన తరువాత మరెవరిమీదా తనకు అధికారముండదు. కౌరవులందరూ అది గ్రహించాలి’’ అని అన్నాడు.
అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు అగ్నిశాలలో నక్కలు పెద్దగా అరిచాయి. అగ్ని హోత్రంలోని వెలుగులు చల్లారాయి. గాడిదలు ఓండ్రు పెట్టాయి. భయంకరంగా పక్షులు రొదబెట్టసాగాయి. ఆ ఘోర శబ్దాలను తత్త్వవేత్తలైన విదురుడు, గాంధారి,్భష్ముడు, ద్రోణుడు, పండితుడైన కృపాచార్యుడు విన్నారు. వెంటనే ‘‘స్వస్తి, స్వస్తి’’ అని శుభకామన చేశారు. తదుపరి అప్పుడు జరిగినదంతా తెలిసికొని గాంధారి విదురుణ్ణి వెంట బెట్టుకొని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లింది. పాండవులు ఓడిపోవడాన్ని, ద్రౌపదికి జరిగిన అవమానాన్ని, అపశకునాలు పుట్టడాన్ని ఆయనకు చెప్పింది. అది విని ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి పిలిచింది.
‘‘పరమ పతివ్రత, తాపసురాలు, పాండవుల ఇల్లాలు, ధర్మం పట్ల ప్రీతికలది, మానవ గర్భంలో నుండి పుట్టనిది (అయోనిజ) అయిన ద్రౌపదిని సామాన్య మానవకాంతగా తలంచి ఓర్చుకొనడానికి సాధ్యంగాని మాటలు సభలో మాట్లాడటం తగునా? దుర్యోధనా నీవు మరణించినట్లే! దుర్వినీతా! నీవు చెడు తలంపుతోనే పెరిగావు. నీ కారణంగా పాండవులు ఎంతో దుఃఖాన్ని అనుభవించారు. వారిపట్ల నీవు కోపం మానుకొనుము’’ అని దుర్యోధనుని నిందించాడు. తరువాత కొడుకులను త్రోసిబుచ్చి, బంధువులకు మేలు చెయ్యాలనే తలంపుతో పరిస్థితిని ఆకళింపు చేసుకొని అనునయపూర్వకంగా పాంచాలితో
‘‘పాంచాలీ! ద్రౌపదీ! నా కోడళ్లలో నీవే గౌరవింప దగినదానివి. సర్వోన్నతవు. ధర్మపరాయణవు.నీకు ఇష్టమైన వరం కోరుకొనుము’’ అని అన్నాడు. అందుకు
‘‘ఓ భరతర్షభా! దయతో నాకు వరం ఇవ్వాలనిపిస్తే లోకంచేత పూజింపబడేవాడూ, మనువుతో సమానమైనవాడూ అయిన ధర్మరాజుకు దాస్యం నుండి విముక్తి కలగాలి. అలా అయితే గురువుచేత, పెద్దవారిచేత బుజ్జగింపబడిన మా ప్రతివింధ్యుని కౌరవులు సేవకుని కొడుకు అని అనకుండా ఉంటారు. ఇది నా కోరిక’’ అని ద్రౌపది అనగా ధృతరాష్ట్రుడు
‘‘కళ్యాణీ! నీ వడిగినట్లే జరుగుతుంది. ఇచ్చాను. నీకు మరొక వరమివ్వమంటుంది.
కోరుకో. నా మనస్సు మరొక వరమివ్వమంటుంది. ఒకే వరానికి నీవ తగినదానవు గావు’’ అని అన్నాడు. అందుకు ద్రౌపది
‘‘రాజా! నీ వశమై ఉన్న భీమార్జుననకుల సహదేవులకు రథధనుస్సులతోబాటు దాస్య విముక్తిని కోరుతున్నాను’’ అని అనగా ధృతరాష్ట్రుడు
‘‘నీవు కోరిన వరం ఇచ్చాను. ఇంకా మూడవ వరం కోరుకో. రెండు వరాలే ఇవ్వడం నీకు పూర్ణ సత్కారం కాదు’’ అని అన్నాడు.
‘‘ప్రభూ! లోభం ధర్మాన్ని నశింపజేస్తుంది. నాకిక వరాలపై ఆసక్తి లేదు. రాజశ్రేష్ఠా! మూడవ వరానికి నేను తగినదానిని కాదు. రాజేంద్రా! వైశ్య స్ర్తి ఒక్క వరం, క్షత్రియకాంత రెండు వరాలు, శూద్ర స్ర్తికి మూడు వరాలు, బ్రాహ్మణ స్ర్తికి వంద వరాలు కోరుకొనవచ్చును. అందువల్ల నేను ఇక వరాలు కోరుకొనగూడదు. రాజా! నా భర్తలు దాస్యాన్ని పొంది విపత్తిలో పడ్డారు. ఇపుడు దానినుండి బయటపడ్డారు. ఇకపై పుణ్యకర్మలతో శుభాలను పొందగలరు’’ అని అన్నది.
అప్పుడు కర్ణుడు ‘‘నేను మనుషులలో అందగత్తెలైన స్ర్తిలను గూర్చి విన్నాను. కానీ వారిలో ఎవ్వరూ ఈ విధంగా కార్యాన్ని సాధించినట్లు వినలేదు. పాండవులూ, ధార్తరాష్ట్రులూ ఒకరిపైనొకరు మండిపడేటప్పుడు ఈ ద్రౌపది పాండవులకు ప్రశాంతిని కలిగించింది. పాండవులు నావగానీ, మరే ఆధారంగానీ లేకుండా నీట మునిగిపోతుంటే ఈ ద్రౌపది వారు తరించడానికి నౌక అయింది’’ అని అన్న మాటలు విన్న భీముడు సహించలేక పోయాడు.
..........................ఇంకావుంది