డైలీ సీరియల్

యాజ్ఞసేని - 67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధృతరాష్ట్రుడి నూర్గురు కొడుకులలో ధర్మపక్షపాతి ‘వికర్ణుడు’ ఒక్కడే. నిండు సభలో ద్రౌపదిని లాగి తెచ్చి అవమాన పరచినప్పుడు ‘‘ఇది అధర్మం’’ అని ఎలుగెత్తి చాటిన ధర్మపక్షపాతి. పదునాల్గవనాటి మహాభారత యుద్ధంలో భీమసేనుడు వికర్ణుని చంపబోయే ముందు బోరున ఏడుస్తాడు.
‘‘తమ్ముడివి, ధర్మపక్షపాతివి. నిండు సభలో అధర్మాన్ని ఎదిరించిన నీ బోటివాడిని వధించటానికి చేతులు రావడం లేదు. బాధపడుచున్నాను. నిండు సభలో నేను చేసిన ప్రతిజ్ఞననుసరించి నిన్ను చంపకుండా మానలేను’’ అని వికర్ణుని చంపి తమ్ముడూ అని విలపిస్తాడు. భీముడిలాంటి వాని చేతగూడా పొగిడించుకొని కంట తడి పెట్టించిన గొప్ప ధర్మశీలి.
అలా ధర్మ సూక్ష్మాన్ని విశదీకరించిన వికర్ణుని జూసి కర్ణుడు
‘‘్ధర్మరాజు తన సర్వస్వాన్ని ఒడ్డి ఓడిపోయాడు. ద్రౌపది అతడికి పరాయి మనిషి కాదు. అందువల్ల ధర్మంగా జయింపబడ్డదే. పాండవులంతా ఆమె జయింపబడిందని ఎందుకు అంగీకరిస్తారు. నీవు ఒకే వస్త్రాన్ని ధరించి ఉన్నదానిని సభకు తోడ్కొని రావడం ధర్మం కాదన్నావు. భార్యకు భగవంతుడు విధించిన భర్త ఒక్కడే. ఇది పెక్కు భర్తలు కలది. అందుచేత ‘బంధకి’. ఇలాంటి దాన్ని బట్టలు లేకుండా నగ్నంగా తెచ్చినా తప్పులేదు’’ అని అన్నాడు.
***
ద్రౌపది స్వయంవర సమయంలో ‘కర్ణుడు’ మత్స్య యంత్రాన్ని పడగొట్ట ప్రయత్నించి ధనుస్సు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి వదలబోగా చూచిన ద్రౌపది ‘‘నేను ఈ సూత పుత్రుని వరించను’’ అని పెద్దగా అంటుంది. కర్ణుడు ధనుస్సును వదిలి, సిగ్గుతో పైకి చూచి వెళ్లి తన ఆసనంలో కూర్చుంటాడు. దానిని మనస్సులో పెట్టుకొన్న కర్ణుడు తన అక్కసును అధర్మమూర్తియై, కేవలం దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి వెళ్ళబుచ్చుకొన్నాడు. ఇది అధర్మం అని కర్ణుడికి తెలిసి కూడా అలా అన్నాడు’’.
***
అంత దుర్యోధనుడు దుశ్శాసనుని పిలిచి ‘‘ఈ పాండవులవి, ద్రౌపదివి వస్త్రాలు లాగి తీసికో’’ అని ఆజ్ఞాపించాడు.
దానిని తెలిసికొని పాండవులు తమ పైబట్టలను తీసిపెట్టి సభలో నిలిచారు.
ద్రౌపది వస్త్రాపహరణము
పిమ్మట అందరిచేత నిందింపబడిన దుశ్శాసనుడు ఇది చేయకూడని పని అని విచారించక అడ్డులేనివాడై ‘‘ద్రౌపది’’ కట్టుకొన్న వస్త్రాన్ని నిస్సంకోచంగా నిండు సభలో విప్పాడు సభామధ్యంలో ద్రౌపది వస్త్రాలను లాగి తొలిగింప ఆరంభించాడు.
అప్పుడు ‘‘ద్రౌపది’’ మరొకదారిలేక, రక్షించేవాడు లేక, ఇది తప్పనేవారు లేక, తనకు దిక్కైన శ్రీకృష్ణవాసుదేవుని స్మరించింది.
దీనావస్థలో ఉన్న ద్రౌపది ‘లోకరక్షకుడైన’ శ్రీకృష్ణుని మనసారా స్మరించింది.
శ్లో!! గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజనప్రియ
కౌరవైః పరిభూతాం మాం కిం మజునాసి కేశవ!
హే నాథ! హే రామనాథ! వ్రజనాథార్తినాశన
కౌరవార్ణవమగ్నాం మామ్ ఉద్దరస్వ జనార్ధన
కృష్ణ! కృష్ణ మహాయోగిన్! విశ్వాత్మన్! విశ్వభావన
ప్రసన్నాం పాహి గోవింద కురుమధ్యే వ సదతమ్!

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము