డైలీ సీరియల్

వికృతీ శివమాయేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రుని కంటె అధికమైన కీర్తికలవాడు. నిరంతర దానం గుణంలో రెండవ కర్ణుడు. సముద్రం వలె చాల గంభీర స్వభావుడు. స్వస్వరూపమైన హిమమయ (మంచు) కాంతివలె యశోవంతుడైన హిమవంతునిలా మనోజ్ఞమైన సుందర స్వరూపం చేత చల్లని శాంతస్వభావుడనే ఘనకీర్తిని వహిం చాడు. ధైర్య-శౌర్య-్భభరణ లక్షణలక్షితుడైన ఆ రాజు హిమగిరి వలె కులగోత్రపాలుడై (స్వకుల- గోత్రాలకు రక్షకుడు రాజు, క్ఱుగోత్రాలకు (కులపర్వతాలు) అధిపతి హిమవంతుడు) అసమాన తేజోవిరాజమానుడై మధురానగరాన్ని పాలి స్తున్నాడు.
కొంతకాలం తరువాత మలయపర్వతం మీద అగస్త్యుడు ద్రావిడభాషా వ్యాకరణాన్ని, నిఘంటువును, అలంకారశాస్త్రాన్ని రచించాడు. అందులో కవిత్వలక్షణాన్ని సృష్టింపదలంచి పద్దెనిమిది అక్షరాలు వ్రాసిన శంఖఫలకాన్ని నిర్మించాడు. దానిని తెచ్చి పాండ్యభూపతికిస్తూ ‘ఇది ద్రవిడ కవితా రీతిలో సరస్వతీ దేవితో సమానమైన కవులెందరికైనా దీనిపై కూర్చోవడానికి స్థలమీయగలదు. ఒక్కడే అయినచో అతడికి చాలినంత స్థలాన్ని మాత్రమే ఈయగలదు. ఈ శంఖఫలకాన్ని పూజిస్తూ మీ వంశపు రాజులందరు వర్ధిల్లండి’ అని చెప్పాడు.
ఆ రీతిగా ఆగస్త్యుడు శంఖఫలకాన్ని ఇచ్చిన తరువాత అనేక పాండ్యరాజులు గతించారు. ఆ తరువాత ఆ వంశంలో కలియుగాన జనరంజకుడయిన మహారాజొకడు జన్మించాడు. ఆ పాండ్యరాజు రాజ్యపరిపాలనాభారాన్ని వహించినంతనే కులపర్వతాలు- దిగ్గజాలు- ఆదిశేషుడు - ఆదివరాహం- ఆదికూర్మం చాల సంతోషం పొందిన మహాకీర్తివంతుడ య్యాడు. అతడు తమిళభాషా సరస్వతికి కంఠాభరణాలుగా చెప్పదగిన కీర్తివంతులా శంఖఫలకాన్ని అధిష్టింపగల బుద్ధివైభవం గలిగి అమృతాయ- మానమైన కవిత్వరచనా వాగ్వైఖరి కల నత్కీరాది శైవ విజ్ఞాన సారహంసమతులైన పండ్రెండు మంది మహాకవుల్ని సంపదలతో సంతృప్తి పరుస్తూ ఆ శంఖఫలకం మీదుంచి ఆ మహారాజు సత్కవితాలోలుడై వారిని సత్కరిస్తూ ఉన్నాడు. ఆ కవిపండితసభ మెచ్చుకొనే విధంగా కవిత్వం చెప్పగల ఏ సరసకవికైనా వేయేసి మాడల్ని దానం చేసే వానిగా ఆ మహారాజు లోకమంతట కీర్తి వహించాడు. అంతేకాదు యాచకులకు అడిగిన దానాన్ని, ఆప్తులకు మనస్సును, భార్యలకు సంయోగసుఖాన్ని, బంధువులకు ధనాన్ని, రాజ్యంలోని సమస్తజాతుల వారికి సత్యవాక్యనిష్ఠను, శత్రువులకు గర్వభంగాన్ని, సాధు జనులకు ఆనందాన్ని కలిగిస్తూ ఆ మహారాజు ఘనకీర్తివంతుడై లోకంలో వెలుగొందుతున్నాడు.
దుర్భిక్ష (కరువు) వర్ణన
ఈ విధంగా పాండ్య భూపాలుడు రాజ్యాన్ని పరి పాలించే కాలంలో గ్రహాల వక్రగమనంతో ఏర్పడిన అశుభ ఫలితంగా పెద్ద కరువు బాధ వచ్చి పడింది. దాని వలన రాజ్యంలో వర్షాలే కురియలేదు. శని మీనరాశిలో ప్రవేశించాడు. తూర్పున తోకచుక్క పొడిచిం ది. మధ్యాహ్న సమయాలలో దట్టంగా మేఘాలు కమ్ముకోసాగాయి. ఉదయకాలంలో ప్రతిదినమూ మంచుకమ్మేది. రాత్రిళ్లు ఆకాశం నిర్మలంగా ఉండేది. తెల్లని యెండ కాసేది. గాలి స్తంభించింది. గాలి- మెరుపు- సూర్యచంద్రులు గుడులు మొదలగు వర్షసూచనలు కానరాలేదు. విదియ తిథులలో చంద్రుని కొమ్ములు (ప్రక్కకు వ్యాపించిన కొనలు) తరిగిపోయి ఉండేవి. (విదియ నాటి చంద్రుని కొమ్ములు సమంగా ఉంటె పంటలు పండి వస్తువుల ధరలు సమంగా ఉంటాయి. కుడిప్రక్కకు కొమ్ము తగ్గితే కొలువ దగిన వస్తువులు పండవు. ఎడమ ప్రక్క కొమ్ము తగ్గిచే తూచే వస్తువులు పండవు అని శాస్త్రం) సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినా చినుకు రాలలేదు. మఖకార్తి వచ్చినా మేఘాలు ఉరమనేలేదు. దక్షిణదిక్కున గర్జనలు వినిపిం చేవి. దీనితో జనుల మనసులు తల్లడిల్లాయి. అంతేకాదు ప్రజలు ఆకలి బాధకు తట్టుకోలేక గునుకులు, ఊదర్లు (పైర్లమధ్యలో మొలిచే గడ్డి మొక్కలకు కాసే గింజలు), పరపటలు (ఊదర్లవంటివి), గోళ్లగొండి (కేవలం గోళ్లతో గిల్లివేయగల గడ్డిమొక్కలకు కాసే గింజలు), అల్లిబియ్యం (నల్లకలువ దుంపలో ఉండే గింజలు - వీనిని అల్లిరాగులంటారు), వెదురుబొంగులలో ఉండే బియ్యం, గొట్టెచెట్లు (రేగు పండ్లు), ఇంజెట్లు (అడవిలో దొరికే కందదుంపలు), తుంగముస్తియలు (తుంగ గడ్డిక్రింద ఉండే చిన్న దుంపలు), ఈతగుంజు (ఈతచెట్లనుండి లభించే తియ్యని గింజలు) మొదలైన వాటిని తింటూ ఉండేవారు. అరవడు ధాన్యం కంటె తలిందయ (రాగి) ధాన్యం అరువది రోజుల్లో పండుతుంది కదా అని బ్రతుకాసతో రైతులు ఏతాలెత్తి నీరుపోసి పెంచితే అవికూడ తెగులు పట్టి నాశనమైపోయాయి. మీనరాశిలో శని ప్రవేశించిన కారణం చేత దేశంలో పంటలు పండక చర్మం-ఎముకలు మాత్రం మిగిలి త్రోసివేస్తే తొంభై చోట్ల పడిపోయే జనం భార్యబిడ్డల్ని విడిచి ఆకలి బాధతో వేరే చోటికి పోయారు. యజమాని -సేవకుడు అనే భేదం లేకుండ అంతా కృశించిపోయారు. ఈ విధంగా ప్రజలంతా బాధపడుతూ ఉన్ననాడు తిని లేనినాడు మాని క్రుంగి కృశిస్తూ కూర్చున్న చోటినుండి లేవలేక మరణించారు. క్రమంగా కరువు పెరిగిపోగా దిక్కుతోచని వారై తినడానికి బలుసాకు కూడ దొరకక జనులు చాల బాధల్ని భరించారు. మరికొందరు బ్రతుకాశతో పరదేశాలకు వెళ్లిపోయారు.
నత్కీరుడు శివబ్రాహ్మణుని దూషించుట
మనిషిని మనిషి తినే గొప్పకరువు ఆ విధంగా దేశంలో తాండవమాడగా ఆ ఊరు చివర నున్న శివాలయపూజారి శివబ్రాహ్మణుడు వేరొకచోటకు వలస పోవడానికి సంసిద్ధుడయ్యాడు.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512