డైలీ సీరియల్

నిర్మలభక్తితో శివానుగ్రహం( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శౌనకాదులారా! మొట్టమొదటి వ్యాసుడు పరమేశ్వరుడే! మిగిలిన వ్యాసావతారాలు ఆయన ఆదేశించగా ప్రకటితమైన వివిధ మునులు, ఇరువై ఎనిమిదవ వ్యాసుడు పురుషోత్తముడైన శ్రీహరి అంశతో కృష్ణద్వైపాయనుడు. వ్యాసులందరూ ద్వాపరానా, యోగేశ్వరావతారులందరూ కలియుగానా ఉద్భవిస్తారు. ఒక్కొక్క యోగేశ్వరుడికీ రుద్ర సమానులైన శిష్యులూ పరమేశ్వరాంశులు నలుగురు ఉంటారు.’’ అని వివరించిన సూతుల వారు నందీశ్వరుడు తెలిపిన మిగిలిన శివావతారాలను శౌనకాదులకిలా వివరించ సాగారు.
‘‘మహామునులారా!
పరమేశ్వరుడు మార్గశిర మాసంలో కృష్ణపక్ష అష్టమినాడు కాల భైరవ రూపంలో అవతరించాడు. కాశీలో క్షేత్ర పాలకుడైన ఆయన దర్శనం చేసుకున్న వారి పాపాలు ఇట్టే నశిస్తాయి. కాలభైరవుడే కాక వీరభద్రుడూ, శరభుడూ కూడా ఆయన అవతారాలే!
ఈశ్వరుడే మరో కాలాన విశ్వానరుడు, శుచిష్మతి అనే దంపతుల కోరికపై తానే వారి పుత్రుడై గృహపతి అనే నామధేయంతో వర్ధిల్లాడు. గృహపతికి పనె్నండవ సంవత్సరం జరుగుతూ ఉండగా ఆ బాలుడిని చూడవచ్చిన నారదుడు అతనికి పదిహేనవ సంవత్సరంలో ఘోర అగ్ని ప్రమాదమూ మృత్యుభయమూ ఉందని తెలుపగా తల్లితండ్రులు భయభీతులయారు. గృహపతి వారి అనుమతితో కాశీకి వెళ్ళి విశ్వనాథుడిని గిరిజా సమేతంగా ఆరాధించాడు. కాశీ విశే్వశ్వర లింగాన్ని దర్శించి సేవిస్తూ తానూ ఒక లింగాన్ని స్థాపించి పూజించాడు. పరమేశ్వరుడు ఆ బాలుడిని పరీక్షించటానికి ఇంద్రుని రూపంలో అరుదెంచి తాను వరాలిస్తానంటే బాలుడు పరమేశ్వరుడి కృప తప్ప తనకెవరి కృపా అవసరం లేదని ఇంద్రుడిని ఆరాధించటానికి నిరాకరించాడు. ఇంద్రుడి రూపంలో వజ్రాయుధం ఝళిపించగా భయపడ్డ గృహపతి ప శుపతిని ఎలుగెత్తి ప్రార్థించాడు.ఈశ్వరుడు వేషం చాలించి నిజరూపంలో అతనికి దర్శనమిచ్చాడు. అతడు జఠరాగ్ని రూపంతో అగ్ని పదంలో భాగస్వామి అవుతాడనీ, ఆ ఫలితంగా అగ్ని అతడినేమీ చేయలేడనీ వరమిచ్చి ఆ బాలుడు ప్రతిష్ఠించిన లింగంలో ప్రవేశించాడు. ఆ లింగమే ‘అగ్నీశ్వర’ లింగమై ప్రసిద్ధి చెందింది. గృహపతి పరమ శివుని అంశావతారము.
మరో సందర్భంలో తన భక్తులైన భిల్ల దంపతులని అనుగ్రహించటానికి యతీశ్వరుడిగా యతి రూపం ధరించి, ఆపై జన్మలో వారిరువురూ నలదమయంతులుగా జన్మించగా వారిని కలపటానికి హంసావతారం దాల్చి రాయబారం జరిపి వారికి వివాహం జరిపించాడు పరమశివుడు. భిల్లుడు స్థాపించిన లింగము ‘అచలేశ్వర’ లింగమని ప్రఖ్యాతి గాంచింది.
అలాగే ఒక రాజదంపతులు భక్తినీ, ధర్మనిరతినీ పరీక్షించటానికి ద్విజుడు అనగా బ్రాహ్మణ రూపం ధరించి ‘ద్విజేశ్వరావతారుడు’ అయ్యాడు శంకరుడు.
దధీచి, సువర్చలల పుత్రుడైన పిప్పిలాదుడగా శంకరుడవతరించి మానవులకు పదహారేళ్ళ వరకూ శని బాధలు కలుగకుండా అనుగ్రహించి లోక కల్యాణ కారకుడయాడు.
అనసూయా అత్రి దంపతులకు రుద్రుని అంశతో జన్మించిన దుర్వాసుడూ, అంజనా గర్భాన శివ తేజస్సు ప్రవేశించగా జన్మించిన హనుమంతుడూ కూడా శంకరాంశులే!
ఆ పరమేశ్వరుడు శ్రాద్ధ దేవుని చివరి కుమారు డూ, అమాయకుడూ అయిన నభగుడిని అనుగ్రహిం చటానికి చేసిన పరీక్షకై ‘కృష్ణ దర్శను’డనే పేరుతో అతనికి సాక్షాత్కరించాడు. నభగుడి సత్య సంధతకూ, భక్తికీ సంతోషించి అతడిని మోస గించిన అన్నలకన్నా ఎక్కువ ధనాన్నీ, అన్నింటికన్నా మిన్న అయిన సనాతన బ్రహ్మ జ్ఞానాన్నీ ప్రసాదించాడు ‘కృష్ణ దర్శన’ అవతారం లో పరమేశ్వరుడు.
ఇంకో పర్యాయం ఇంద్రుని అహంకారాన్ని నిర్మూలిం చటానికి అతని ఎదుట నగ్న ‘అవధూత’ వేషాన ప్రత్యక్షమయాడు ఈశ్వరుడు. ఆయనను గుర్తించ లేకపోయిన ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించబోగా ఆయుధంతో పాటుగా అతని బాహువులు కూడా స్తంభించిపోయాయి. ఇంద్రుడి ప్రక్కనున్న బృహస్పతి శంకరుణ్ణి గుర్తించి ఇంద్రుడి తప్పు కాయమని వేడుకోగా పరమేశ్వరుడు తన లలాటం నుండి వెలువడిన అగ్నిని సముద్రానికి మరలించాడు. ఆ అగ్ని నుండి ఉద్భవించిన బాలుడు జలంధరుడనే పేరుతో పెరిగి దేవతలనూ, మనుజులనూ హింసించే అసురడవటం వలన ప్రజా క్షేమానికై శివుడు తానే అతడిని సంహరించాడు.
పూర్వం ఒక బ్రాహ్మణి అరణ్యంలో ఒక అనాధ బాలుడిని చూసి జాలిపడి జాలిపడి ఆ బిడ్డను కూడా తన స్వంత బిడ్డతో పాటుగా పెంచదలచింది. కానీ అంతలోకే అతను ఎవరో ఏ కులమోనని ఆలోచిస్తూ తటపటాయిస్తూండగా శివుడు ‘్భక్షువు రూపాన్ని ధరించి ఆమెకి దర్శనమిచ్చాడు. ఆ బాలుడు ఒక రాజపుత్రుడనీ, అతని పుట్టుకకు పూర్వమే రాజూ, పుడుతూనే ఒక పులి బారిన బడి రాణి అయన అతని తల్లీ మరణించారని తెలిపి, ఆ బాలుడిని పెంచమనీ, అతడి వలన ఆమెకూ, ఆమె పుత్రుడికీ మేలు జరుగుతుందనీ తెలిపి తన నిజరూపాన సాక్షాత్కారమిచ్చి అదృశయుడయాడు శివుడు.

- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె