డైలీ సీరియల్

ఓమ్‌కార రూపుడు( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ పూజకు చక్కటి పీఠాన్ని ఏర్పరుచుకుని దానిపై సాకార విగ్రహాన్ని (అష్టదళ కమలములతో రూపొందించిన పీఠం ఉత్తమం) మధ్యన ఉంచి, ముందుగా గణేశుడిని, దిక్పాలకులనూ, పూజించి మూడు మార్లు ఆచమనము చేసి శివుని రూపాన్ని భక్తి పూర్వకంగా ధ్యానించుకోవాలి. అయిదు ముఖాలూ, పది భుజాలూ, పదహైదు కన్నులూ కల ఆ స్వామి శుద్ధ స్ఫటిక కాంతితో శోభిల్లుతున్నట్లు భావించుకుని, ‘సద్యోజాత ప్రపద్యాయ’ ఇత్యాది మంత్రాలతో పరమేశ్వరుడిని ఆవాహనము చేయాలి,
‘‘ఓం వామదేవాయ నమః’’ అంటూ ఆసనమూ, ఉపచారాలూ సమర్పించి, ‘‘ఓం తుత్పురుషాయ విద్మహే’’ అన్న రుద్ర గాయత్రీ మంత్రం జపించి, ‘‘అఘోరేభ్యో’’ ‘‘ఈశానః సర్వ విద్యానామ్’ అన్న మంత్రాలతో ఆయనను పూజించాలి. అభిషేకము చేసి సుగంధ ద్రవ్యాలతోనూ, పుష్పాలతోనూ అలంకరించి నైవేద్య, ధూప, దీప, హారతుల నొసగి అపరాధములను క్షమించమని ప్రార్థించాలి. చివరగా,
‘‘॥ భక్తిః శివే భక్తిః శివే భక్తిర్భవే భవే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ॥
అనగా ‘ప్రతి జన్మలోనూ నాయందు శివ భక్తి నిలుచును గాక! శివుడు తప్ప నాకు శరణమొసగే వారు మరి లేరు.’ అని మనస్ఫూర్తిగా ప్రతినిత్యం ప్రార్థించే వారి కష్టాలు తొలగి, భక్తి పెంపొంది, అంత్యాన శివసాన్నిధ్యం పొందుతారని సూత పౌరాణికులు వివరించారు.
13
శివతత్వ విశే్లషణ
‘సూతమహర్షి, ఇలా వివరించారు.
‘‘శౌనకాది మహామునులారా!
‘‘యస్య నిశ్వాసతం వేదః...’’ ఎవరి నిశ్వాసం వేదాలను వెలికి తెచ్చిందో ఆ పరబ్రహ్మమే పరమేశ్వరుడు. శివ సహస్ర నామావళి పారాయణం ఆయన కెంతో ఆనందదాయకం. ఆయనపై విష్ణువు స్తుతే, శివ సహస్రనామస్తోత్రము, వాటిలో ‘శివ’ ‘హర’ ‘రుద్ర’ ‘శర్వ’ ‘శంభు’ ‘మహేశ్వర’ ఇత్యాది నామాలు ఆయనకి ప్రీతిదాయకమైనవి. శివ సహస్ర నామాలు పఠించే భక్తులకు ఇహ పర సుఖాలనివ్వటమే కాక కైవల్యాన్ని కూడా ప్రసాదిస్తాడాయన.
ఉపవాస వ్రతం ఆచరించే భక్తులు అష్టమి, బహుళ ఏకాదశి, శుద్ధ ఏకాదశీ, శుద్ధ బహుళ త్రయోదశీ దినాలు, సోమవారాలూ సహస్ర నామ పఠనం చేసి ఆ రోజులలో పగలు కానీ, లేక పగలూ రాత్రీ కానీ, శక్త్యాను సారం ఆహారం మాని వేయాలి. ఆ పుణ్యం అనంతం.
ఒకప్పుడు శ్రీకృష్ణుడు పుత్రుల కోసం తపస్సు చేయదలచి ఉపమన్యుడనే శివభక్తుడి వద్ద ఉపదేశాన్ని పొందాడు. ఉపమన్యుడు తాను చూసిన అస్తశ్రస్త్ర ధారి అయిన పరమ శివుని రూపాన్ని ఆయనకు వర్ణించి చెప్పి ‘ఓం నమశ్శివాయ’ మంత్రోపదేశమూ, శివ సహస్ర నమ కీర్తనమూ చేసాడు. తనకు వైవస్వత మన్వంతరాంతం వరకూ శివుడు ఆయుష్షును ప్రసాదించినట్లు ఉపమన్యుడు కృష్ణునికి తెలిపాడు’’ అని మహర్షులకు తెలిపిన సూతుడు పాపులు భూమికి ఎనభై ఆరు వేల యోజనాల దూరంలో ఉన్న యమలోకానికి వెళ్ళి తమ పాపాల అనుసారం శిక్షలు పొంది ఆ తరువాత చేసిన పుణ్యానుసారంగా స్వర్గంలో వసించి, తిరిగి తమ కర్మ ఫలానుసారం వివిధ జన్మలు పొందుతారని తెలిపి, ఉత్తమ జన్మలు లభ్య మయ్యేంత వరకు దానధర్మాలు విరివిగా తమ శక్తికి తగిన రీతిలో చేసుకోవాలని తెలిపారు. ఆ తరువాత భూలోకానున్న సప్త దీపాలైన జంబూద్వీప, ప్లక్ష ద్వీప, శాల్మలీ, క్రౌంచ, శాక, పుష్కర, కుశ ద్వీపాల గురించీ నవగ్రహాల స్థితి గతుల గురించీ ఆయన మహర్షులకి తెలిపారు. సప్తలోకాలూ దాటిన రువాత వైకుంఠ, కుమార, ఉమా లోకాల తరువాత అన్నింటికన్నా పైనున్న శివలోకమూ, దానికి మరో ప్రక్కనున్న గోలోకమూ మాత్రమేశాశ్వత లోకాలని తెలియ పరిచారాయన. జనన మరణాల గురించీ, మోక్షాన్ని పొందే సాధనాల గురించీ తెలిపిన తరువాత సన్యాసులు పాటించవలసిన నియమాల గురించీ, వారు చేయవలసిన శివ యంత్ర పూజ గురించీ వివరించారు సూతులవారు.
కార్తికేయ-వామదేవ సంభాషణం (కైలాస సంహిత)
- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె