డైలీ సీరియల్

సత్వగుణ సంపత్తి కలిగిన కరీంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిల మధురాధరాలే ఆకలి కొఱకు భుజించే ఫలాలు. చౌశీతిరతిబంధాలే యోగాసనాలు. ప్రణయకలహంలో వీడిపోవడమే తపస్సు. స్ర్తి సంభోగమే కైవల్యపదంలో అనుభవించే బ్రహ్మానందం. ఇట్టి విచిత్ర స్థితి లోకంలో ఎక్కడ ఏ మానవులకు లేదు.
ఆ కారణంగా అచట జీవించే వారందరు వివాహమాడింది సామాన్య స్ర్తిలను కాదు. ముక్తి- కాంతలనే వివాహమాడారు. అందుచేత అక్కడి వారిలో ఉత్తములు - మధ్యములు - అధములు అనే విభాగమే ఉండదు. ఆవిధంగా జీవసమైక్యభావంతో అలరారే ఆ శ్రీకాళహస్తిపట్టణాన్ని వేరొక పట్టణంతో పోల్చి చెప్పడం ఏనుగును దోమతో పోల్చి చెప్పినట్లే అవుతుంది.
చాతుర్వర్ణ ప్రజలు
నిజమే మరి. అచటి ప్రజలు సామాన్యులా? బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్ర తరగతులుగా ఉన్న అచటి వారందరు ఏకైకమైన రాజయోగ సామ్రాజ్య వైభవసంప్రాప్తి కోసం సదాసక్తులు, నిత్య శాంతచిత్తులు. నిరుపమానమయిన బ్రహ్మానందహృదయవిహారులు. అందుచేతనే ఆ పట్టణబ్రాహ్మణులు బ్రహ్మార్పణబుద్ధితో నిత్య-నైమిత్తిక కర్మల నాచరిస్తూ ఉంటారు. క్షత్రియులు శాంతనవుల వలె (్భష్ముని వలె) సంగరంలో (యుద్ధంలో) నిబద్ధబుద్ధి కలవారైనా సంగహిత బుద్ధితో అనగా అనాసక్తబుద్ధితో వైరివర్గాన్ని (కామ-క్రోధ-లోభ-మద- మాత్సర్యాలు) సంహారం చేస్తారు. వారివలెనే అచటి వైశ్యవరులు రాజయోగమార్గాన్ని వీడక పరిపూర్ణ మహార్థాలెన్నింటినో (మహార్థము - వైశ్యప్రవృత్తికి భిన్నమైన నివృత్తి ధనము) సాధింపతలంచి మహాకోశాల (్ధనాగారాలని ఒక అర్థం. మరొక అర్థం - అన్నమయ- ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ కోశాలని) ఘనతను గ్రహించి అసమానులై కీర్తివహిస్తున్నారు. వారినందరిని సేవించే సేవాధర్మ పరాయణులైన శూద్రవర్ణులు ఆ చాతుర్వర్ణ్యాల వారిని అనుసరిస్తూ వ్యవసాయాది సంబంధమైన ఆత్మప్రయత్నంలో (ఆత్మవిచార సంబంధమైన ప్రయత్నం) నిరంతర నిమగ్నులై శీత-వాత (వాయు) ఆతపాలను (ఎండలను) సమంగా భావించి (ద్వంద్వాతీతస్థితితో) విధి నిర్వహణాన్ని చేస్తూ ఉంటారు. ఈ రీతిగా శ్రీకాళహస్తియందలి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జనులు నిరంతరం ప్రశాంతమనస్కులై కేవలం రాజమార్గమందు ఆసక్తి కలవారై బ్రహ్మానందంలో ఓలలాడుతూ జీవనం గడుపుతూ ఉంటారు.
వేశ్యలు ఆ విధంగా చాతుర్వర్ణ్యాల వారే కాక అచట వేశ్యాంగనలు సహితం సాక్షాత్తు యోగిపుంగవుల వలె జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎట్లంటె యోగశాస్త్ర సంబంధమైన ఆధారబంధం - ఉడ్డీనబంధం మొ॥ యోగబంధాల్ని వేసే యోగుల వలె అచటి వేశ్యలు కామశాస్త్ర ప్రసిద్ధమైన భ్రమణబంధం మరియు చక్రబంధం మొ॥ బంధాలు వేస్తూ ఉంటారు. అనంతమైన సూర్యాగ్నిచంద్రకళానుభవంతో ఆనందించు యోగీశ్వరుల వలె వెలయాండ్రు వివిధ శృంగారకళాస్థానానుభవాలతో తేలియాడుతూ ఉంటారు. యోగశాస్త్ర ప్రసిద్ధమైన నాదబిందు శ్రవణభాగ్యం చేత యోగసమాధియందు నిలిచి తన్మయులైన యోగీశ్వరుల వలె వేశ్యలు నిరంతరం వీణాది వాద్యసంగీత మధురనాదానుభవం చేత మైమరచిపోతూ ఉంటారు. శుకయోగీంద్రునిచే ప్రబోధింపబడిన భాగవత కథామృతపానం చేత మహదానందానుభూతిని పొందే యోగీశుల వలె అచటి వేశ్యలు ప్రీతికరమైన పెంపుడు శుకముల (చిలుకలు) జిలిబిలి పలుకుల్ని వింటూ వినోదిస్తూ ఉంటారు. మోహరహితమైన (యథార్థ స్వరూపాన్ని గ్రహింపలేని అజ్ఞానమే మోహం) చిత్తవృత్తిచే ప్రవర్తించే యోగిశ్రేష్ఠుల వలె అచటి వేశ్యలు మోహరహితబుద్ధితో (అనగా కలవరపాటు లేనివారై) ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రసిద్ధమైన అనంగరహస్య విచారబుద్ధితో అనగా విదేహ ముక్తిరహస్య చింతనతో జీవనాన్ని గడిపే మహాయోగీంద్రుల వలె అచటి వ్యభిచారిణులు అనంగరహస్యబుద్ధితో (కేవలం మన్మద కళానుభవం మీద మాత్రమే లగ్నమైన బుద్ధి కలవారై) జీవిస్తూ ఉంటారు.
ఏనుగులు
శ్రీకాళహస్తిపురం లోని మానవులే కాదు ఏనుగులు సహితం అవధూతల వలె సంచారం చేస్తాయి. నిరంతరం భగవద్ధ్యానతత్పరులైన అవధూతల వలె అచటి ఏనుగులు కూడ అరగంటతో (సగంమూసిన కన్నులు) చూస్తూ ఉంటాయి. ధ్యాన వివశత్వం చేత మెల్లగా నడచు అవధూతల వలె అవి కూడ మెల్లగా నడుస్తూ ఉంటాయి. ప్రార్థనా పూర్వకంగా భక్తులు స్వహస్తాలతో సమర్పించే వానినే యోగులు చేతులు సాచి స్వీకరించే విధంగా అవి కూడ శ్రద్ధగా స్వహస్తాలతో తెచ్చియిచ్చే వారి నుండి మాత్రమే ఠీవిగా కరాలను (తొండాలను) చాచి స్వీకరిస్తాయి. లోకంలో భయసందేహాలను వీడి స్వేచ్ఛగా సంచరించే అవధూతల వలె ఏనుగులు సహితం స్వేచ్ఛాయుతంగా సంచరిస్తాయి. ఉన్మత్తులై (పిచ్చివారు) యుండి సంచరించడానికి నవ్యరతులైన (ప్రీతి కలవారయిన) వారి వలెనే అచటి ఏనుగులు సహితం ఉన్మత్త స్థితి చేత (అధికమైన మదగుణము చేత) నవ్యరతులై (అత్యుత్సాహం కలిగి) సంచారం చేస్తుంటాయి. సత్వగుణసంపదచేత వర్తించే మహావధూతల వలె అచటి కరీంద్రాలు కూడ సత్వగుణసంపత్తి కలిగి (మహాబల సంపద కలిగి) ప్రకాశిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికోన్నతిని కోరుకునే అవధూతలు ఎదురుగా ఉండే పద్మ-శంఖాది నిధులను కూడ తిరస్కారభావంతో చూచే విధంగా ఆ కాళహస్తిలోని మత్త్భాలు కూడ సరస్సులలో ఉండే పద్మాది వైభవాన్ని ధ్వంసం చేసే జలక్రీడలలో పరవశమైయుంటాయి.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512