డైలీ సీరియల్

ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిద్యానిధియై మహామహిమచే జెన్నై వసిష్ఠాజ లూ
తావాతాశన సామజాటవిక గోత్రాదేవ నత్కీర రా
జీవాక్షీ యుగయాదవాధిపులకున్ శ్రేయస్కరంబైన యా
ర్యావామాంగము దివ్యలింగము మదీయాభీష్టముల్ సల్పెడున్.
(శ్రీ.కా.హ.మా.1.1.)
ధూర్జటి ప్రణీతమైన శ్రీకాళహస్తి మాహాత్మ్యము లోని ప్రథమాశ్వాసమునందలి ఈ పద్యములోని ఆర్యా వామాంగపదాన్ని ఇంచుక పరిశీలిద్దాము. ఆర్య అనగా పార్వతి. వామాంగమనగా ఎడమనున్న అంగము. ఆర్యావామాం గమనగా ఎడమభాగమున పార్వతి కల శరీరాంగం కలవాడని అర్థం. ఎడమభాగములో పార్వతి ఉంటే కుడిభాగం పురుషరూపమైన శివుడున్నట్లే కదా? మరి ఇట్టి లింగము దివ్యలింగమవుతుంది గాని అన్యం గాజాలదు. భగవంతుని ఈ స్వరూపమే జగత్సృష్టికి బీజము. ఈ భగవద్రూపాన్ని ఋగ్వేదం ఇలా వర్ణించింది.
స్ర్తీయః సతీస్తాం ఉ మే పుంస ఆహుః
పశ్యదక్షణ్వాన్న వి చేత దన్ధః
కవిర్యః పుత్రః స ఈమా చికేత
యస్తావిజానాత్ స పితుష్పితాసత్ ॥ (ఋగ్వేదం.1.164.16)
తా॥ అది స్ర్తి మరియు పురుష సమష్టిరూపము. కన్నులు కలవారు మాత్రమే చూడగలరు. అంధులు చూడజాలరు. మహర్షులు మాత్రమే ఆ రూపాన్ని పితామహునిగా గ్రహించ గలరు అని మహర్షులు నాకు చెప్పినారు.
సృష్టికే మూలమయినది మరియు స్ర్తిపుంసాత్మకమైన ఈ భగవద్రూపాన్ని పురాణాలు ఇలా వర్ణించాయి.
కృత-త్రేతా-ద్వాపర-కలియుగాలు ఒక ఆవృత్తి జరిగిన కాలాన్ని చతుర్యుగమంటారు. అట్టి చతుర్యుగాలు 71 సార్లు జరిగితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 జరిగితే బ్రహ్మకు ఒక పగలు. ఈ కాలానే్న ఉదయకల్పము అంటారు. మరల ఇంతే కాలం జరిగితే అది బ్రహ్మకు ఒక రాత్రి. దీనిని క్షయకల్పమంటారు. ఈ రెండు కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇట్టి రోజులు 360 అయితే బ్రహ్మకు ఒక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు 100 అయితే బ్రహ్మకు నూరేండ్లు నిండుతాయి. అంటే బ్రహ్మకు జీవితకాలం అయిపోతుంది. అప్పుడు మహా ప్రళయం సంభవిస్తుంది. ఈ ప్రళయానే్న ప్రాకృతప్రళయమంటారు. ఆ సమయంలో భగవంతుడు సృష్టికి సంబంధించిన సమస్తబీజాలను తనయందు సంగ్రహించుకొని ఏకాకియై అవ్యక్తమూర్తియై ఉంటాడు.
అట్టి భగవంతుని యందు మరల సృష్టి చేయవలెనని కోరిక సంభవిస్తుంది. దీనినే మహా- కామమని పురాణాలు పేర్కొన్నాయి. దీనిని ఋగ్వేదం ఈ క్రింది మంత్రంలో ఇలా వర్ణించింది.
కామస్తదగ్రే సమ వర్తతాధి మనసోరేతః ప్రద మం యదాసీత్
(ఋగ్వేదం.10.129.4)
ఈ కామం జనించి నంతనే ఆ అవ్యక్తమై ఏకైకమైయున్న ఆ భగవానుని యందు వామ భాగంలో స్ర్తి తత్త్వము జనిస్తుంది. అదే స్ర్తి పుంసా త్మకమైన ఏకైక సమష్టి రూపం. దీనినే వెనుక వ్రాయబడిన ‘స్ర్తీయః సతీస్తాం ....’ అని ఋగ్వేదమంత్రము పేర్కొంది. ఈ స్ర్తి పుంసాత్మకమైన సమష్టిరూపాన్ని అధర్వణవేదం క్రింది విధంగా కీర్తించింది.
త్వం స్ర్తి త్వం పుమాన్ త్వం కుమార ఉతవా కుమారీ (అద.10.8.27)
అర్థం - పురుషుడవు స్ర్తివి నీవే కదా ! కుమారుడవు కుమారివి నీవే. అధర్వవేదమీవిధంగా వర్ణిస్తే పురాణాలు కూడా అదే విధంగా చెప్పాయి. స్ర్తి రూపం అర్థమకరోత్ అర్థం పురుషరూపవత్ (మత్స్య.3.31)అవ్యక్తము - ఏకైకము - స్ర్తిపుంసాత్మకమైన ఈ భగవద్రూపంలోని స్ర్తితత్త్వాన్ని మత్స్యపురాణం సావిత్రి- సరస్వతి - శతరూపగా ‘‘శతరూపాచ సా ఖ్యాతా సావిత్రీ చ నిగద్యతే’’ (మత్స్య.3.31) అని వర్ణించగా, శివ పురాణాదులు ఆ తత్త్వానే్న పార్వతిగా వర్ణించాయి. అట్టి పార్వతి వామభాగంలో కల దివ్యలింగాకారమైన అర్ధనారీశ్వరరూపానే్న ధూర్జటి ఆర్యావామాంగము అని వర్ణించాడు.
ఆర్యా శబ్దానికి ప్రథమమైన సృష్టి కారణ రూపమైన ఆ స్ర్తి పుంసాత్మక సమష్టిరూపం నిత్యవన వంతవైనదని భావం. అనగా సృష్టినిర్మాణంలో నిత్యక్రియాశీలమైన కారణతత్త్వమని అంతరార్థం. శ్రీకాళహస్తి యందు స్వయంభువుగా వెలసిన దివ్యలింగం అట్టి కారణ తత్త్వమైన స్ర్తి పుంసాత్మకసమష్టి, అర్ధనారీశ్వర స్వరూపమేనని ధూర్జటి ఆంతర్యం.
ప్రథమాశ్వాసం ఇష్టదేవతా స్తుతి
శ్రీకాళహస్తీశ్వర ప్రార్థన
శ్రీవిద్యకు నిలయమైనవాడూ, మహామహిమలచే ప్రకాశించుచున్నవాడూ, వసిష్ఠునకు - బ్రహ్మకు - సాలిపురుగునకు - పామునకు - ఏనుగునకు - ఆటవికుడయిన కన్నప్పకు - శివభక్తుడైన బ్రాహ్మణుడికి - నత్కీరమహాకవికి - వేశ్యకన్యలిరువురకు - యాదవరాజయిన వీరనృసింహరాయలకు మోక్షాన్ని అనుగ్రహించే ఆర్యామహాదేవి (పార్వతీదేవి) ఎడమభాగాన ప్రకాశించే దివ్యలింగస్వరూపుడైన శ్రీకాళహస్తీశ్వరుడు నా కోరికలను నెరవేర్చుగాక.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512