S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/22/2020 - 22:49

‘‘నాన్న మాకెమన్నా ఆస్తులు ఉన్నాయా? అని పదేళ్లు దాటిన ఆ కొడుకు అడిగిన ప్రశ్నకు పుస్తకం చదువుకుంటున్న జమిందారైన తండ్రి తలెత్తి ఒక్కసారి చూశాడు. ‘వెళ్లి అద్దంలో చూసుకో’అని అనగానే ఆ కొడుకు నిలువుటద్దం ముందు నిలుచుకున్నాడు. అణువణువునా ఆత్మవిశ్వాసం తొణికసలాడే ఆ తేజోమయ రూపం.. కరుణామృతాన్ని కురిపించే విశాలమైన నేత్రాలు, ఆ నేత్రాలలో కనిపించే నిర్భయత్వం.. ఇది చాలు.

01/22/2020 - 06:32

ఈ రోజుల్లో సెల్‌ఫోన్ లేని ఇల్లే లేదు. మారుమూల గ్రామాలలో కూడా సెల్‌ఫోన్ల వినియోగం ఎక్కువైపోయింది. ప్రపంచీకరణ నేపధ్యంలో అర చేతిలోనే విశ్వమంతా మనకు కనబడుతోంది. మంచిదే దీనిలో కొన్ని దుష్ఫరిణామాలు, మంచి పరిణామాలు ఉన్నాయి. ముందు సెల్ సంభాషణ బాగుండాలి. చాలావరకు సెల్ సంభాషణలు ‘‘చెప్పండి, మాట్లాడుకోండి’’అని మర్యాద మన్నన లేకుండా మాట్లాడుతున్నారు.

01/19/2020 - 23:54

కొంతమంది పిల్లలకు చిన్నప్పటి నుంచీ మంకుపట్టు, పేచీతత్త్వం, మొండితనం వంటివి ఉంటాయి. ఇవన్నీ తల్లిదండ్రుల గారాబం వల్లో.. లేదా అమ్మమ్మ తాతయ్యల ముద్దు వల్ల వచ్చింది అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కావచ్చని చెబుతారు డాక్టర్లు.. ఈ తరం చిన్నారుల్లో ఎక్కువశాతం మందిలో ఈ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది అంటున్నారు వారు.

01/16/2020 - 23:06

పరిమళాల నుండి వచ్చే సువాసన కేవలం కొన్ని నిముషాల వరకే వెదజల్లుతుంది. ఎలాంటి పరిమళం అయినా సుదీర్ఘకాలం సువాసన ఉండదు. అయితే ఇలాంటివి మనం అస్సలు ఇష్టపడం. నిరంతరం సువాసన వెదజల్లే పరిమళాల కోసం ఎంతగానో ఖర్చు చేస్తాం. కానీ ఎలాంటి పరిమళమైనా కొన్ని గంటల్లోనే పూర్తిగా ఆవిరైపోతుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని పరిమళాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రశాంతతనిచ్చే పరిమళాలే మనసుకు హాయినిస్తాయి.

01/13/2020 - 22:34

భోగి రోజు సాయంత్రం చిన్నపిల్లలున్నవారు వారికి భోగిపళ్లు పోస్తారు. బాలారిష్టాల నివారణకు గుర్తుగా ఈ వేడుక చేస్తారు. అంతేగాక రేగిపండును సంస్కృతంలో బదరీ అంటారు. రేగి చెట్టు అంటే విష్ణువుకు ఇష్టం. అందువల్లే ఆయనను బదరీ నారాయణ అని కూడా అంటారు. విష్ణుప్రీతికరమైన ఈ పండ్లు పోయడంవల్ల వారికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. అంతేగాక రేగుపళ్లు సూర్యభగవానుడికి ప్రీతికరమైనవి.

01/13/2020 - 05:07

ఇలాంటి ప్రశ్నలకీ, చర్చలకీ కాలం చెల్లి చానాళ్లయింది. స్ర్తి ఉద్యోగాలు చేయాలా వద్దా? ఈ రకమైన ప్రస్తావనలకి సైతం ఇప్పుడు తావులేదు. ‘ఉద్యోగం పురుష లక్షణం’ అన్న నానుడి పాతబడిపోయింది. ఇవాళ్టి మహిళ జీవితంలో ఉద్యోగం ఒక భాగమైంది. ఉద్యోగం చేయటం స్ర్తిల లక్షణం, లక్ష్యంగా మారింది. కానీ ప్రేమ వివాహం మంచిదా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా? అన్న చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

01/11/2020 - 22:11

ముగ్గు లేదా రంగవల్లి అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలంనుండి వస్తున్న భారతీయ సంప్రదాయం. ఇవి ముగ్గుపిండితో వేస్తారు. ఇంటిముందు పేడ నీటితో కళ్లాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాల్లో ముగ్గురాళ్ళతో గాని సుద్ద ముక్కలతోగాని తడి చేసిన తర్వాత వేస్తారు.

01/09/2020 - 22:10

చలి తీవ్రత చోటు చేసుకుంది. మెల్లగా సాయం త్రం మొదలై రాత్రులు బాగా పెరిగి మరుసటి రోజు పొద్దెక్కినా చలి విడవనంటుంది. పొగమంచు స్వైర విహారం చేస్తుంది. ఈ చలికాలంలో ఎన్నో సమస్యలు. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో అస్సలు అశ్రద్ధ చెయ్యొద్దు. శరీరానికి వెచ్చగా ఉంచే ఆహారంతో పాటు.. శరీరంలో వ్యాధి కారకాలను నియంత్రించి అత్యుత్తమ ఆహారం తీసుకోవడం కూడా ఎంతో అవసరం.

01/08/2020 - 22:39

‘మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్ద’ అన్నారు భౌతిక, తత్త్వ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ‘మార్పుకు అనుగుణంగా ఎవరైతే మారగలిగారో వారే తెలివైనవారు’ అన్నది నగ్న సత్యం. జీవితం చాలా గొప్పది. అది ఎంతో నేర్పిస్తుంది. ఎన్నో మార్పులు తెస్తుంది. అయితే ఆ మార్పునకు అనుగుణంగా మనలో మార్పులు అవసరం. పుట్టినప్పటినుంచి చివరిదాకా మనిషి నేర్చుకొంటూనే ఉంటాడు.

01/07/2020 - 22:44

ధనుర్మాస వేళల్లో మన భారతీయ వనితామణులందరూ తమ తమ గృహ ప్రాంగణాలలో ముగ్గు వేయడానికి రంగంలోకి దిగారంటే చాలు- ఇక తమ కళానైపుణ్యంతో చూపరులను తప్పనిసరిగా ‘ముగ్గులోనికి దించేశార’న్నమాటే. ఈ ‘ముగ్గులోనికి దించేయడం’ అన్నది గొప్ప తెలుగు పలుకుబడి.

Pages