S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/13/2019 - 03:26

కొంతమంది బాగా వ్యాయామం చేస్తారు. ఆరోగ్యవంతమైన భోజనం చేస్తుంటారు. చక్కగా నిద్రపోతారు. కానీ బరువు మాత్రం తగ్గట్లేదని బాధపడుతూ ఉంటారు. కారణం వారికే అర్థం కాదు. డాక్టర్లకు కూడా కొన్నిసార్లు ఈ విషయం అర్థం కాదు. అయితే బరువు తగ్గడం కేవలం తిండి, నిద్రపైన ఆధారపడి ఉండదనీ, దానికి అనేక ఇతర అంశాలూ కారణం కావచ్చని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.

12/11/2019 - 23:27

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదొక సమయంలో దిగులు తప్పదు. కష్టాలు, కన్నీళ్ళనుంచి బయటకొచ్చేందుకు అదో మార్గం. ఆ సమయంలో ఆత్మీయుల ఓదార్పు స్వాంతననందిస్తుంది. కానీ కొందరు చిన్న విషయాలను భూతద్దంలో చూసి జీవితాన్ని కష్టాల కొలిమిగా భావిస్తారు. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయే ఈ స్థితే డిప్రెషన్. దేశ జనాభాలో దాదాపు పదిశాతం ఇలాంటి డిప్రెషన్‌తోనే బాధపడుతున్నారని పరిశోధనలు తేల్చి చెపుతున్నాయి.

12/04/2019 - 22:57

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మహిళాలోకం బిక్కుబిక్కుమంటోంది. ఎప్పుడు, ఎటువైపు నుంచి ఆపద పొంచి ఉందో, ఎవరు దాడి చేస్తారో, ... ఇలా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు, ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించేందుకు ఈ ఏడాది జనవరి 19న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘112’ ఫోన్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దానితో పాటు ‘112 ఇండియా’ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.

12/03/2019 - 23:18

చిన్నారుల ఆహారపు అలవాట్లకు సంబంధించి ముందుగా చేయాల్సింది, వారు ఆరోగ్యవంతమైన ఆహారం తినేవిధంగా చూడడం, రెండోది వారంతటవారే తినే పరిస్థితిని కల్పించడం. మూడోది టేబులు ముందు కూర్చొని, వారు ఏ విధంగా తింటున్నారో గమనిస్తూ పద్ధతులు నేర్పడం. టేబులు దగ్గర ఏవిధమైన గందరగోళం సృష్టించకుండా చక్కగా మంచి పద్ధతులు పాటించేలా చూడాలి.

12/01/2019 - 22:41

అన్నం తినడం లేదా? ఇట్లా మాట్లాడుతున్నావు? గడ్డి ఏదైనా తింటున్నావా ఈవిధంగా చేస్తున్నావు? అనటం మనం వింటూనే ఉంటాం! మన నడవడి, మన మాటతీరు ఇవన్నీ మనం ఏం తింటున్నామో లోకానికి చెబుతాయి. ఓ సన్యాసి భిక్షార్థం వచ్చినవి తినేవాడట. కానీ ఓ సారి ఓ భూకామందు ఆ సన్యాసిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాడట. సన్యాని భోజనం తర్వాత కాస్త విశ్రమించాడట. ఆ సమయంలో ఆయనకు ఈ భూకామందు సంపాదనను ఎట్లా కొట్టేయాలా అన్న ఆలోచన వచ్చిందట.

11/28/2019 - 22:16

అలంకరణే మీ ఇంటికి వనె్న తెస్తుంది. డ్రాయింగ్‌రూమ్, లివింగ్‌రూం, డ్రస్సింగ్‌రూం, డైనింగ్‌రూం, కిచెన్, పిల్లల గది అన్నింటినీ కళాత్మకంగా సర్దినపుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. ఇంట్లోని హాల్ అందం పెరగడానికి దివాన్ సెట్లని అందంగా తీర్చిదిద్దుతుంటారు. ఇంటికి వచ్చిన అథిథులు కూర్చోడానికి, కాస్త నడుం వాల్చడానికైనా ఇవి సౌకర్యంగా ఉంటాయి.

11/27/2019 - 22:38

నెమలికి నేర్పిన నడకలివీ.... నిజమే మనిషి పుట్టిన ప్పటినుంచీ అనుకరణతోనే ముందుకు వెళ్తుంటాడు. పెరిగి పెద్దవుతూ ఉన్నపుడే ప్రకృతి ప్రేమికుడుగా మారుతాడు. పక్షిని చూసి పక్షిలాగా ఎగరాలనుకొన్నాడు. విమానాన్ని కనిపెట్టాడు. నెమలిలాగా నృత్యం చేయాలనుకొన్నాడు. నృత్యం నేర్చుకున్నాడు. దీనికి ఉదాహరణే ధింసా నృత్యం. ఇప్పటికీ నెమలీకలు కట్టుకుని అద్భుతమైన నృత్యం చేస్తుంటారు. కోయిలను చూసి గొంతు సవరించుకున్నాడు.

11/26/2019 - 22:28

నమ్మకం తక్కువ మనిషికి సుఖం తక్కువ. ఎవరిని నమ్మాలో ఎందుకు నమ్మాలో తెలియక గందరగోళంలో పడిపోయే వారి సంఖ్య సభ్య సమాజంలో ఎక్కువే! సహజంగానే ఈ తరహావారికి అనుమానం పెనుభూతంగా తోచడాన్ని ఆశ్చర్యపోయే విషయంగా కాని ఎవరినో తప్పుపట్టే తీరుగాను భావించనవసరంలేదు.

11/24/2019 - 22:30

సమాజం నాగరికంగా, వైజ్ఞానికంగా, అక్షరాస్యత పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా కొందరు కలియుగ కీచకులు, దుశ్శాసనులు కిరాతకంగా, పైశాచికంగా మహిళలపై అత్యాచారాలకు తెగబడుతుండటం బాధాకరం. జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక ప్రకారం గత రెండేళ్ళలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలలో 12.4 శాతం వృద్ధి అయిందన్న గణాంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.

11/21/2019 - 22:42

నాన్న లాప్‌టాప్‌లో పనిచేసుకుంటూ ‘విసిగించకు’ అంటూ కసిరే కసురులు.. అమ్మ వంటింట్లో పనిచేసుకుంటూ ‘డిస్ట్రబ్ చేయొద్దు నాన్నా.. పనిలో ఉన్నా.. ఆఫీసుకు లేటయిపోతుంది..’ అంటూ అమ్మ విసుగ్గా చెప్పే విన్నపాలు.. ఇక అమ్మమ్మ, తాతయ్యల ఊసే లేదు. ఆ చిన్నారికి ఏం చేయాలో తోచదు.. ఏ స్మార్ట్ఫోన్‌ముందో, టీవీ ముందో కాలం గడిపేస్తాడు.. ఇదీ ఇప్పటి తరం పరిస్థితి. దీనికి మనలాంటి పెద్దవాళ్లు..

Pages