S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/04/2019 - 18:40

దసరా సెలవులు వచ్చాయ. అందరూ సరదాగా అలా అలా తిరిగొద్దా మను కుంటు న్నారా? విహారయాత్రకు వెళ్తున్నారా? అయితే లగేజీ సర్దుకునే విషయంలో కొన్ని మెలకువలు పాటించాలి. దీనివల్ల తెలియని ప్రాంతానికి వెళ్లినా కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. హాయిగా మనసుకు నచ్చిన ప్రాంతాల్లో విహరించి రావొచ్చు.

10/03/2019 - 18:39

అందమైన బొమ్మలను చూసేందుకు పిల్లలే కాదు పెద్దలు ఇష్టపడతారు. అటువంటి వివిధ రకాలైన బొమ్మలు వందల్లో ఒకేచోట దర్శనం ఇస్తే చూసేవారి ఆనందానికి అవధులే ఉండవు అనడం అతిశయోక్తి కాదు. వందలాది బొమ్మలను ఒకచోట చేర్చి చూపరులకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగుతుంది. దుర్గాదేవి వివిధ రూపాలను ధరించి దుష్టులైన రాక్షసులను అంతమొందించినందులకు నిదర్శనంగా ఆ చల్లని తల్లిని వివిధ అలంకారాలతో పూజిస్తూ దసరా పండుగను జరుపుకుంటాము.

10/01/2019 - 18:47

సత్య, అహింసలే మార్గాలు..
ధర్మక్షేత్రమే బతుకంతా..
కర్మయోగమే తలపంతా..
స్వదేశీ సూత్రమే జీవనంగా..
శాంతిమార్గమే నడవడిగా నడిచిన అసలు సిసలు జగజ్జేత..
తరతరాల యాతన తీర్చిన వరదాదరుడు..
భరతమాత తలరాతను మార్చిన విధాత..
నవశకానికే నాంది పలికిన ఈ శతాబ్దపు సూర్ఫి ప్రదాత..
బోసినవ్వుల గాంధీ తాత..

09/30/2019 - 18:36

‘‘వృద్ధాప్యం ఓ శాపం కాదు, వ్యాధి కాదు, అది రెండో బాల్యం’’ అన్నారు తిరుపతి వేంకట కవులు. వయసు పెరిగేకొద్దీ పెద్దరికం పొందాలి కానీ ముసలితనాన్ని కాదు అనేవారు తత్త్వవేత్త జాన్సన్. యువతను శక్తికి మారుపేరంటారు కానీ వారి వద్ద అనుభవమనే శక్తి ఉండదు. జీవిత సత్యాల జ్ఞానం చాలా తక్కువ. ‘అపారమైన అనుభవశక్తి, అసంఖ్యాకమైన సత్యాల సమాహారమే వృద్ధాప్యం’. వార్థక్యం ఎప్పుడూ యవ్వనం పరిధిలోకి రాదు.

09/29/2019 - 22:46

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదోక సమయంలో దిగులు తప్పదు. కష్టాలు, కన్నీళ్ళనుంచి బయటకొచ్చేందుకు అదో మార్గం. ఆ సమయంలో ఆత్మీయుల ఓదార్పు స్వాంతననందిస్తుంది. కానీ కొందరు చిన్న విషయాలను భూతద్దంలో చూసి జీవితాన్ని కష్టాలకొలిమిగా భావిస్తారు. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయే ఈ స్థితే డిప్రెషన్. దేశ జనాభాలో దాదాపు పది శాతం ఇలాంటి డిప్రెషన్‌తోనే బాధపడుతున్నారని పరిశోధనలు తేల్చి చెపుతున్నాయి.

09/27/2019 - 20:14

మనిషి మనిషిగా పుట్టటం ఒక వరం, అదృష్టం. ఎనె్నన్నో జన్మలెత్తి యిప్పుడే నరజన్మ లభించింది. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, అగాథాలు, ఉన్నతులు, సుఖాలు, దుఃఖాలు- వీటన్నిటిని అనుభవించటానికి ఎదుర్కోవటానికి మనం, మన జీవిత పరమార్థమేమిటో తెలిసికోవాలి. ఈ లభించిన నరజన్మ ఉన్నతమయింది. సూర్యాస్తమయ సూర్యోదయాల మధ్యలో మనిషి ఆయుర్దాయం తగ్గిపోతుంది. వయస్సు పెరుగుతుంది.

09/26/2019 - 18:55

మహిళలపై నిత్యం పెరుగుతున్న అత్యాచారాలపై సభ్య సమాజం భీతిల్లుతోంది. ఆడపిల్లలుగల తల్లిదండ్రులతే నిత్యం సంఘర్షణకు లోనై బయటికి వెళ్ళిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు వారి ఆలోచనలు పరిపరివిధాలుగా పోతోంది. సామాజికపరంగా మానవత్వం మటుమాయమై అవకాశాలకోసం ఆతృతగా ఎదురుచూస్తున్న మగ మృగోన్మాదుల అరాచకాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్న విష సంస్కృతి వారిది.

09/25/2019 - 18:40

ప్రస్తుతం యాంత్రికమైన దినచర్య, పనుల ఒత్తిడి, సొంత పనులకు సమయం చాలకపోడం, ముఖ్యంగా ఉద్యోగినులు ఇంటా, బయటా అధిక శ్రమకు గురికావడం, తాము చేపట్టిన పనిలో పరాజయం, ఆప్తుల మరణం, భగ్నమైన ప్రేమ, సన్నిహితుల ఎడబాటు, ప్రేమరాహిత్యం, అభద్రతా భావం, ఒంటరితనం, తాము కోరుకున్నది వారికి లభించకపోవటం, అనారోగ్యాలు, అవమానం లాంటివి ఎనె్నన్నో కారణాలు డిప్రెషన్‌కు గురిచేస్తాయి.

09/24/2019 - 18:55

ఏమీ లేని విషయాన్ని గురించి ఎవర్నయినా అడిగితే... ఏముందీ! ‘సూదిలో...’ అంటుంటారు చాలామంది వ్యంగ్యంగా.. కానీ మేలురకం పట్టువస్తమ్రయినా సూదీ దారానికి లోకువే. దాని కుట్టుబడికి కట్టుబడి ఉండాల్సిందే. ఆ సూదీ దారాలే ఫ్యాషన్ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అదెలా అంటారా?

09/23/2019 - 18:46

జ్యూస్ థెరపీ గురించి విన్నారా..?

Pages