సబ్ ఫీచర్

అత్యవసర విచారణ అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజం నాగరికంగా, వైజ్ఞానికంగా, అక్షరాస్యత పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా కొందరు కలియుగ కీచకులు, దుశ్శాసనులు కిరాతకంగా, పైశాచికంగా మహిళలపై అత్యాచారాలకు తెగబడుతుండటం బాధాకరం. జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక ప్రకారం గత రెండేళ్ళలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలలో 12.4 శాతం వృద్ధి అయిందన్న గణాంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. గత సంవత్సరంలో పదేళ్ళ లోపు చిన్నారులపై అత్యాచారాలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 24 శాతం పెరిగిందన్న సదరు నివేదిక మహిళలపై అత్యాచారాల విషయంలో ముద్దాయిలకు చట్టం పట్ల ఏమాత్రం భయభక్తులు లేవని తేటతెల్లమవుతోంది. నిర్భయ, పోక్సోవంటి కఠిన చట్టాలు అమల్లోకి తెచ్చినా మహిళలపై నేరాలు ఏమాత్రం తగ్గకపోగా అవి ఏటికేడు పెరుగుతూ పోతున్నాయి. దీనిపై ఇటీవల జాతీయ మహిళా సాధికారిక సంస్థ, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు కలిసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అత్యాచార కేసుల్లో ఉత్తరప్రదేశ్, హరియాణా, బీహార్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఎప్పటిలానే తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలు రెండూ 10, 11 స్థానాల్లో నిలబడి కావలసినంత అప్రదిష్టను మూటకట్టుకున్నాయి. మహిళలు, చిన్నారులకు మెరుగైన రక్షణ కల్పిస్తున్నామన్న ప్రభుత్వ వాగ్దానాలు నీటిపై రాతలుగా మిగిలిపోయాయి. దళితులపై జరిగే నేరాల్లోనూ బాధితులు ఎక్కువగా మహిళలేనని ఎన్‌సీఆర్పీ నివేదిక తేల్చి చెప్పింది. నేరగాళ్ళపై ఉక్కుపాదం మోపడంతో పాటు నేరాలకు మూలాలైన సామాజిక పరిస్థితుల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కృషిచేయాలి. దర్యాప్తు సంస్థల పనితీరుపై సరైన పర్యవేక్షణ, కేసుల విచారణ వేగవంతం చేసేలా చూడటం, కేసుల నుంచి నిందితులు బయటపడిన సందర్భాల్లో .., అలా ఎందుకు జరిగిందో లోతుగా ఆరాతీసి జవాబుదారీతనాన్ని నిర్ధారించి చర్యలు తీసుకోవడం అవసరం. జిల్లాకో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసి నేరం జరిగిన నెలరోజుల లోపే అభియోగాలను దాఖలు చేయడం, విదేశాల్లో జరిపించినట్లు మూడు నెలలలోపు అత్యవసర విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు ఖరారు చేయడం జరిగితే భవిష్యత్తులో ఇటువంటి హీనమైన దుశ్చర్యలకు ఒడిగట్టేందుకు నిందితులు వెనకాడతారు.