సబ్ ఫీచర్

ధైర్యానికి తరుణమిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నం తినడం లేదా? ఇట్లా మాట్లాడుతున్నావు? గడ్డి ఏదైనా తింటున్నావా ఈవిధంగా చేస్తున్నావు? అనటం మనం వింటూనే ఉంటాం! మన నడవడి, మన మాటతీరు ఇవన్నీ మనం ఏం తింటున్నామో లోకానికి చెబుతాయి. ఓ సన్యాసి భిక్షార్థం వచ్చినవి తినేవాడట. కానీ ఓ సారి ఓ భూకామందు ఆ సన్యాసిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాడట. సన్యాని భోజనం తర్వాత కాస్త విశ్రమించాడట. ఆ సమయంలో ఆయనకు ఈ భూకామందు సంపాదనను ఎట్లా కొట్టేయాలా అన్న ఆలోచన వచ్చిందట. ఆయన వెంటనే ఇది ఏమిటి ? ఈ కొట్టేసే ఆలోచనలు నాకెందుకు వస్తున్నాయి? దీనికి కారణమేమిటి? అని ఆలోచిస్తే అది ఆ రోజు భూకామందు ఇంట చేసిన భోజనం కారణంగా కనిపించిందట.
వెంటనే ఆ సన్యాసి భూకామందును పిలిచి ఎట్లా సంపాదిస్తున్నావు. నీ వ్యాపారాలేమిటి అంటూ ఆరాలు తీసేసరికి మాయమాటలు చెప్పకపోతే నా వ్యాపారం నడవదంటూ ఏమేమి వ్యాపార కిటుకులు చెప్పాడట. వెంటనే ఆ సన్యాసి ఆ ఇంటినుంచి బయటకు వచ్చేసి ఆ కామందుకు ఇట్లా చేయడం తప్పు. నీవు చేసి సంపాదించిన సొత్తుతోటి తిండి తిన్నందువల్ల నాలో ఇట్లాంటి ఆలోచనలు వచ్చాయి. నీవు ధర్మమార్గంలో నడవకపోతే నీకు నరకం తప్పదు అని చెప్పాడట.
అది పురాతన కాలం కనుక ఆ కామందు సన్యాసి మాట విన్నాడు. పరిస్థితులు మారాయి.
కానీ ఇది కలియుగం! పైగా ఏ రంగంలోనైనా స్ర్తిపురుషులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అవినీతి ఇద్దరూ చేస్తున్నారు. వారు వీరు అనే తేడాల్లేకుండా స్ర్తిలు కూడా అవినీతిని పాల్పడుతున్నారని పత్రికలు చెబుతున్నాయి.
ఎందుకు ఇంత అవినీతి. కడుపు నిండా తిండి, ఒంటికి బట్ట, ఉండడానికి ఇల్లు చాలవా? మనిషికి? ఒక్క సారి ఆలోచించండి.
అమాయకులు, స్ర్తిలను వీళ్లనే కాదు ఎవరు కాస్త మెత్తగా ఉంటే వారినందరినీ బెదరించి మరీ అవినీతికి పాల్పడుతున్నారంటే ఏమనుకోవాలి? జంతువులు కూడా వాటి ఆకలి మేర మాత్రమే ఎదుటి జంతువులపైన దాడి చేస్తాయి. అవి అన్నింటినీ చంపేసి తమ దగ్గర దాచుకోవు.
కానీ అన్నీ తెలిసిన మనిషి మాత్రం తరతరాలకు తరగని గనుల్లాంటి ఆస్తులను కూడబెట్టుకోవడానికి అవినీతి చక్రం తిప్పుతూనే ఉన్నారు. ఎంత ఆస్తి కూడబెట్టినవారైనా ఎంత పెద్ద పదవి చేతిలో ఉన్నవారైనా అవినీతి లేకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకిలా?
అవినీతితో, అక్రమంగా, అన్యాయంగా సంపాదిస్తూ తిండి తింటూ ఉంటే ఎక్కడ చూసినా అమానుషాలు జరుగుతూనే ఉంటాయి. మనశ్శాంతి లేకుడా సమాజం అంతా అల్లకల్లోలం అవుతూనే ఉంటుంది. ఒకరిని ఒకరు చంపుకుని తినే రోజులు మళ్లీ వస్తాయి. ఆడపిల్లలు చంపడాలు, స్నేహితుల్లో చంపడాలు, భార్యభర్తల్లో చంపడాలు, పిల్లలను చంపడాలు, ఇక వృద్ధుల గురించి చెప్పడానికే వీలులేదు. బయట వారైనా, ఇంట్లో తన వారు అనుకొంటున్న సంతానమైనా వారికి యమభటులే అవుతున్నారు.
ఇటువంటి నేర ప్రవృత్తి మరీ మితిమీరడానికి కారణం అక్రమ సంపాదన కూడా కారణమవుతుందని మానసిక విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడైతే మనిషి సక్రమంగా, ధర్మంగా సంపాదించి తింటాడో అపుడు పక్కమనిషికి తోడుగా నిలుస్తాడు కానీ ఇతరులను కొట్టి సంపాదన పెంచుకుంటారో ఆ సంపాదన తిన్న వారంతా అవినీతిపరులుగానే ఎదుగుతారు.
ఇవేకాదు నేటి కాలంలో విశృంఖలంగా వ్యాప్తిచెందుదున్న మద్యపాన మహమ్మారి. మనిషిని మత్తులోకి దించి చేయరానికి పనులను చేయించే మద్యం మత్తుకు చిన్న పిల్లల నుంచి పెద్దవారిదాకా బానిసలౌతున్నారు. మద్యపాన నిషేధ చట్టాలున్నా మద్యపాన బానిసలు ఎక్కువ అవుతూనే ఉన్నారు. ప్రతి వీధిలో రెండోమూడో ఉండే మద్యపాన అంగళ్లు నేటి యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రభుత్వానికి సంపాదన వచ్చినా సమాజం తిరోగమనంలో నడవడానికి మద్యం కూడా ఒక కారణం అవుతోంది.
కనుక మద్యపాన మహమ్మారి గురించిన అవగాహనను ప్రజలందరికీ తెలియచేయడానికి స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు ముందుకు రావాలి. ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలి. మద్యపాన మత్తు వల్ల యువత చెడుదారిలో నడవడం కాదు ఎందరి అమాయకుల ప్రాణాలోమంట గలుస్తున్నాయి. వీటిగురించిన విషయాలను మద్యానికి బానిసలైన వారికి తెలియజెప్పాలి.
సమాజం లోని ప్రతివారు కార్యకర్తలై అటు మద్యపాన నిషేధానికి, ఇటు అవినీతి దురాచార నిర్మూలనకు నడుం కట్టితేనే సమాజం బతుకుతుంది. లేకపోతే రాక్షస సమాజం మాత్రమే మిగులుతుంది. ఈరోజు ఎక్కడో ఏదో జరుగుతోంది. మనకేం అనుకోవచ్చు. కానీ అది రేపు మీ దగ్గరకు రాకుండా ఉంటుందా? నీరు పారుతుంటే పల్లం అంతా మునిగిపోతే మెరక ప్రాంతానికి కూడా వచ్చి తీరుతాయి. కనుక ప్రతి ఒక్కరూ అవినీతికి, అన్యాయాలకు నోరు విప్పండి. అధర్మానికి కొమ్ముకాయకండి. మీకు తెలిసినా మనకెందుకులే అన్న నిర్లక్ష్య ధోరణిని అవలంబించకండి. వెంటనే మీకు చేతనైనంతలో సమస్యను పరిష్కరించడానికి పూనుకోండి.

- మాగంటి రాధిక