S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/13/2019 - 18:37

వయసేదైనా సరే.. రోజూ కాసేపు ఏదైనా ఆట ఆడితే ఆరోగ్యంగా ఉండొచ్చని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. ఇష్టమైన ఆటను దినచర్యలో భాగంగా చేసుకుంటే శారీరకంగానే కాదు మానసికంగానూ బలంగా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆటలతో వృత్తిగత సామర్థ్యం మెరుగుపడటమే గాక గెలుపోటములను ఒకేలా స్వీకరించే సానుకూల దృక్పథం అలవడుతుందని వారు సూచిస్తున్నారు.

08/12/2019 - 18:32

సాధారణంగా పసిపిల్లలు తరచుగా పక్కతడుపుతుంటారు. దీనిని నాక్టర్నల్ ఎన్యురెసిస్ అని వ్యవహరిస్తుంటారు. ఈ సమస్య పిల్లలు ఒక నిర్ధిష్టమైన వయస్సుకు వచ్చేవరకు కొనసాగుతుంది. అయితే కొందరు పిల్లలు ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ అలవాటును కొనసాగిస్తూ ఉంటే అది ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. తక్కువ గది ఉష్ణోగ్రతలు, నిద్రపోయే ముందు అధిక ద్రవాలను తీసుకోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.

08/11/2019 - 19:16

పండుగరోజుల్లో రవ్వంత బంగారం అయినా కొనుక్కోవాలనుకుంటారు మహిళలు. బంగారం కొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం డబ్బు నష్టపోవడం ఖాయం అంటూ కొన్ని సలహాలను ఇస్తున్నారు నిపుణులు.

08/09/2019 - 18:42

మన దేశంలో తల్లిపాలు అందక ప్రతిఏటా లక్షా ఇరవై వేలమంది నవజాత శిశువులు మరణిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది గంటల్లోనే ఆ తల్లి తన బిడ్డకు ‘ముర్రుపాలు’ పట్టడం ఎంతో అవసరం. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు మొదలెట్టాలి. ఈ సమయంలో వచ్చే ముర్రుపాలను ఒకరకంగా తొలి టీకా అనుకోవచ్చు. తల్లి యొక్క మొదటి పాలు బిడ్డకు జీర్ణవ్యవస్థకు సిద్ధం చేస్తాయి.

08/08/2019 - 20:28

‘లక్షయతీతి లక్ష్మీః’ అని లక్ష్మీశబ్దానికి వ్యుత్పత్యర్థం. లక్షింపచేసేదేదో అది లక్ష్మి. జగజ్జనని లక్ష్మీదేవి ఎంత దారి చూపేదైనా ఆ మూలతత్త్వాన్ని అందుకొందామనే దీక్ష మనకి ఉండాలి. ఐహికమైన కోరికలు ఉంటే వరలక్ష్మి వరమైన కాంక్షతో ముముక్షువులై సేవిస్తే ఈ వరలక్ష్మి దేవియే మోక్ష లక్ష్మిగా ఆశీస్సులందిస్తుంది. అందుకే సిద్ధి లక్ష్మి నుండి మోక్షలక్ష్మి వరకు-

08/07/2019 - 19:37

సుష్మాస్వరాజ్ రాజకీయ నాయకురాలు అయినప్పటికీ.. ఎక్కడికి వెళితే అక్కడ మాటలతో కాక మనసుతో బంధాలను పెనవేసుకుంటుంది. మానవత్వంతో, ప్రేమతో, దయతో మనుషులందరినీ దగ్గరికి తీసుకునే మహనీయమూర్తి ఆమె. అందుకే బళ్ళారి వాసులకు ఆమె ఆడబిడ్డ అయ్యింది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం బళ్ళారి ఎన్నికల్లో సోనియాగాంధీపై పోటీ చేసింది సుష్మాస్వరాజ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా ఊర్లు తిరిగింది. చాలా ఇళ్లకు వెళ్లింది.

08/06/2019 - 20:33

కంటికి కనిపించని వేల పోగులను ఒక్కటిచేసి రంగులతో అందాలు అద్ది, పోటీ ప్రపంచంలోనూ మేటి డిజైన్లు వేసి, చేతి నైపుణ్యంతో అందమైన చీరలను తయారుచేయడం నేతన్నకు ఎవ్వరూ చెప్పని విద్య. గ్రామీణ భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికులకు జీవనాధారమై నిలచిన అపురూప కళారంగం చేనేత. ‘్భరతావని ఆత్మకు ప్రతీకగా చేనేత రంగాన్ని అలనాడు బాపూజీ అభివర్ణించారు’.

08/04/2019 - 22:51

హరిప్రియ తమిళనాడుకు చెందిన బాలిక. వయస్సు పదకొండు సంవత్సరాలు. బ్రిటన్‌లో పుట్టి పెరిగింది. అయితే.. ఐక్యూలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి దిగ్గజ శాస్తవ్రేత్తల సరసన నిలిచిన బాలికగా గుర్తింపు పొంది.. పతాక శీర్షికలకు ఎక్కింది. చదువు, బహుభాషలు, నృత్యం, సంగీతం, పాటలు, ఆటలు.. ఇలా అనేక రంగాల్లో ఆమె అద్భుతంగా రాణిస్తోంది.

08/02/2019 - 18:53

శ్రావణమాసం వచ్చేసింది. పూజలతో పాటు పట్టుచీరల సందడి మొదలైంది. ఎన్ని రకాల ఫ్యాషన్లు వచ్చినా శుభకార్యాలు, పండుగలు అనగానే అందరికీ గుర్తొచ్చేది పట్టుచీరలే. మార్కండేయ మహర్షి కలువ పూల నారతో దేవతలకు వస్త్రాలు నేసి ఇచ్చారని చెబుతాయి పురాణాలు. అవి ఎలా ఉన్నాయో తెలీదు కానీ.. కంచిచీరలను చూసిపప్పుడు మాత్రం కంచి కామాక్షమ్మను చూసినంత దైవత్వం కనిపిస్తుంది. కంచి చీరలు బరువుగా ఉంటాయి.

08/01/2019 - 18:48

ఆఫీసులో విపరీతమైన పనిభారం. సాయంత్రానికి అలసి సొలసి ఇంటికి వస్తాం. ఇలాంటి సమయంలో ఆలుమగల అన్యోన్యత బాగుంటే సరాసరి. లేదంటే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో చుట్టుముడతాయి. తెల్లారితే మళ్లీ భుజాన బ్యాగు వేసుకుని బయలు దేరాల్సి వస్తుంది. ప్రతిరోజూ ఇలానే ఉంటే జీవితం నిరాశగా ఉంటూ బోర్ కొట్టేస్తుంది.

Pages