S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/13/2020 - 22:34

భోగి రోజు సాయంత్రం చిన్నపిల్లలున్నవారు వారికి భోగిపళ్లు పోస్తారు. బాలారిష్టాల నివారణకు గుర్తుగా ఈ వేడుక చేస్తారు. అంతేగాక రేగిపండును సంస్కృతంలో బదరీ అంటారు. రేగి చెట్టు అంటే విష్ణువుకు ఇష్టం. అందువల్లే ఆయనను బదరీ నారాయణ అని కూడా అంటారు. విష్ణుప్రీతికరమైన ఈ పండ్లు పోయడంవల్ల వారికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. అంతేగాక రేగుపళ్లు సూర్యభగవానుడికి ప్రీతికరమైనవి.

01/13/2020 - 05:07

ఇలాంటి ప్రశ్నలకీ, చర్చలకీ కాలం చెల్లి చానాళ్లయింది. స్ర్తి ఉద్యోగాలు చేయాలా వద్దా? ఈ రకమైన ప్రస్తావనలకి సైతం ఇప్పుడు తావులేదు. ‘ఉద్యోగం పురుష లక్షణం’ అన్న నానుడి పాతబడిపోయింది. ఇవాళ్టి మహిళ జీవితంలో ఉద్యోగం ఒక భాగమైంది. ఉద్యోగం చేయటం స్ర్తిల లక్షణం, లక్ష్యంగా మారింది. కానీ ప్రేమ వివాహం మంచిదా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా? అన్న చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

01/11/2020 - 22:11

ముగ్గు లేదా రంగవల్లి అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలంనుండి వస్తున్న భారతీయ సంప్రదాయం. ఇవి ముగ్గుపిండితో వేస్తారు. ఇంటిముందు పేడ నీటితో కళ్లాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాల్లో ముగ్గురాళ్ళతో గాని సుద్ద ముక్కలతోగాని తడి చేసిన తర్వాత వేస్తారు.

01/09/2020 - 22:10

చలి తీవ్రత చోటు చేసుకుంది. మెల్లగా సాయం త్రం మొదలై రాత్రులు బాగా పెరిగి మరుసటి రోజు పొద్దెక్కినా చలి విడవనంటుంది. పొగమంచు స్వైర విహారం చేస్తుంది. ఈ చలికాలంలో ఎన్నో సమస్యలు. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో అస్సలు అశ్రద్ధ చెయ్యొద్దు. శరీరానికి వెచ్చగా ఉంచే ఆహారంతో పాటు.. శరీరంలో వ్యాధి కారకాలను నియంత్రించి అత్యుత్తమ ఆహారం తీసుకోవడం కూడా ఎంతో అవసరం.

01/08/2020 - 22:39

‘మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్ద’ అన్నారు భౌతిక, తత్త్వ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ‘మార్పుకు అనుగుణంగా ఎవరైతే మారగలిగారో వారే తెలివైనవారు’ అన్నది నగ్న సత్యం. జీవితం చాలా గొప్పది. అది ఎంతో నేర్పిస్తుంది. ఎన్నో మార్పులు తెస్తుంది. అయితే ఆ మార్పునకు అనుగుణంగా మనలో మార్పులు అవసరం. పుట్టినప్పటినుంచి చివరిదాకా మనిషి నేర్చుకొంటూనే ఉంటాడు.

01/07/2020 - 22:44

ధనుర్మాస వేళల్లో మన భారతీయ వనితామణులందరూ తమ తమ గృహ ప్రాంగణాలలో ముగ్గు వేయడానికి రంగంలోకి దిగారంటే చాలు- ఇక తమ కళానైపుణ్యంతో చూపరులను తప్పనిసరిగా ‘ముగ్గులోనికి దించేశార’న్నమాటే. ఈ ‘ముగ్గులోనికి దించేయడం’ అన్నది గొప్ప తెలుగు పలుకుబడి.

01/06/2020 - 23:20

ధనుర్మాసం అత్యంత పవిత్రమైనది. మార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ నెల్లోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని ఈ మాసంలోనే గోదాదేవి భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకు ఒక్క పాసురంతో స్వామిని స్తుతించిన గోదాదేవి శ్రీమహావిష్ణువును ప్రసన్నంగా చేసుకుంది.

01/01/2020 - 22:49

పిల్లల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల త్వరగా వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వ్యాధుల ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. గజగజా వణికించే ఈ చలికాలంలో పిల్లల్లో వచ్చే వ్యాధులు, ఈ వ్యాధులు రాకుండా తల్లిదండ్రులు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.
ఊపిరితిత్తుల్లో నెమ్ము

12/31/2019 - 22:52

కొత్త ఏడాది సందర్భాన్ని ఆరోగ్యానికో, డబ్బుకో, అలవాట్లకో సంబంధించి తీర్మానాలు చేసుకోవడం అమెరికా దేశస్థుల్లో ఎక్కువ. దాదాపు యాభైశాతం మంది ఇలా తీర్మానాలు చేసుకుంటే అందులో సుమారు సగం మంది జనవరి రెండో వారంలోనే వదిలేస్తారట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్ఫై శాతం మంది నూతన సంవత్సరం సందర్భంగా తమ జీవితంలో మార్పును ఆహ్వానించాలని తాపత్రయపడుతూ న్యూ ఇయర్ రెజల్యూషన్‌ను పెట్టుకొంటున్నారట.

12/29/2019 - 22:45

మీరు వినింది నిజమే.. చలిని తట్టుకోవాలంటే ఉల్లిని ఎక్కువగా తినాలట.. అసలే ఉల్లి రేటు విపరీతంగా పెరిగింది. ఎలా తినాలి? అనుకుంటున్నారు కదూ.. కానీ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా పెద్దలు.. అది నూటికి నూరుపాళ్ళు నిజమే.. ఈ విషయం వింటే మీరు కూడా ఇదే మాట చెబుతారు. అసలే చలి పులి తన పంజా విసురుతోంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే రకరకాల స్వెటర్లు వాడుతుంటారు.

Pages