సబ్ ఫీచర్

భోగిపళ్లు ఎందుకు పోస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగి రోజు సాయంత్రం చిన్నపిల్లలున్నవారు వారికి భోగిపళ్లు పోస్తారు. బాలారిష్టాల నివారణకు గుర్తుగా ఈ వేడుక చేస్తారు. అంతేగాక రేగిపండును సంస్కృతంలో బదరీ అంటారు. రేగి చెట్టు అంటే విష్ణువుకు ఇష్టం. అందువల్లే ఆయనను బదరీ నారాయణ అని కూడా అంటారు. విష్ణుప్రీతికరమైన ఈ పండ్లు పోయడంవల్ల వారికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. అంతేగాక రేగుపళ్లు సూర్యభగవానుడికి ప్రీతికరమైనవి. ఈ పండ్లను పిల్లల తలపై పోస్తే ప్రత్యక్ష నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. అంతేగాక బదరీవనం (రేగుపండ్లతోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా వుంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషం రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్య్తాన్ని దృష్టిలో పెట్టుకునే పండగపూట పిల్లలకు చిల్లర నాణాలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తలమీద చిల్లర నిలబడితే ‘్భగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం. అంతేగాక తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగిపండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణుడు బదిరకావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలలమీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి ఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. సంక్రాంతి సూర్యుడి పండగ. కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్క్ఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు. బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృజించబడి సాక్షాత్తు ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్లను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగభాగ్యాలతో తులతూగుతుంటారు. రేగుపళ్లనే ఈ రోజు ‘్భగిపళ్లు’గా పిలుస్తారు. ఈ భోగి పళ్ల వేడుకను పేరంటాళ్లు, బంధువులు, ఇరుగుపొరుగు పిల్లలను ఆహ్వానించి కార్యక్రమం చివర వారికి కొన్ని భోగిపళ్లతోబాటు తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ. రేగుపళ్లనే అర్క్ఫలాలు అంటారు. పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయటమని పెద్దల విశ్వాసం. ఈ సంప్రదాయం ద్వారా ప్రకృతిలో లభించే అనేక రకాల పండ్లు, పూల గురించి పిల్లలకు అవగాహన, ప్రకృతి పట్ల గౌరవం పెరుగుతాయి. ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపండుగ రోజు భోగిపళ్లు పోస్తారు. భోగినాడు తలపై పోసే భోగిపళ్లు, చెరకు ముక్కలు, రూపాయి నాణేలు అన్నీ వారి తలపైనుంచి పోయటంవల్ల పెద్దల ఆశీర్వాదంతోపాటు పిల్లల దృష్టి దోషాలు, గ్రహదోషాలు తొలగిపోయి. తర్వాత పిల్లలకి హారతి యిస్తారు. మనం కూడా ఈ ఆచారాన్ని పాటిద్దాం.

- కె. రామ్మోహన్‌రావు