S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/12/2019 - 18:30

నేటి జీవనశైలి మూలంగా పంచభూతాలు కలుషితమైపోతున్నాయి. ప్రకృతి ఫ్రీగా ప్రసాదించిన ఈ పంచభూతాలను కొనుక్కుంటామని మనిషి కల్లో కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పుడు నడిచే నేలకు, వెలుగిచ్చే నిప్పుకి, అందరికీ సొంతమైన ఆకాశానికి, దాహం తీర్చే నీటికి, బతకడానికి పీల్చే ఊపిరికి.. ఇలా ప్రతిదానికీ రేటు ఉంది. ముఖ్యంగా నేడు గాలి, నీరు తీవ్రంగా కలుషితమైపోయాయి.

11/10/2019 - 22:47

హినా మునావర్.. పాకిస్తాన్‌లోని తీవ్రవాద ప్రభావిత స్వాత్ జిల్లాలో ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ కమాండింగ్ అధికారిగా నియమితులైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. స్వాత్ సహా ఖైబర్ పంఖ్తూంఖ్వాలోని ఎక్కువ జిల్లాలపై గత కొంతకాలంగా మిలిటెంట్ ఘటనల ప్రభావం తీవ్రంగా ఉంది. మిలిటెంట్లకు, సైనికులకు మధ్య పోరాటం జరిగినప్పుడు పౌరులు, ఇతర సైనిక సిబ్బంది, అధికారులు టార్గెట్ అవుతున్నారు.

11/08/2019 - 18:31

మాట వీపుకి చేటు చేయగలదని ఒక సామెత. ఇరుగు పొరుగువారితో, బంధువులతో ఆఫీస్‌లో పనులు చక్కబెట్టాలి అన్నా, నలుగురితో మెప్పు పొందాలి అన్నా మాట ముఖ్యం. మాటలు ఎప్పుడు కోటలు దాటకూడదు. దానివలన మనల్ని కోతల రాయుడు(రాలు) అంటారు తప్ప సీరియస్‌గా మనల్ని పట్టించుకోరు. అలాగే చాలామంది ముక్కుసూటిగా మాట్లాడతాము అని అనుకొని ఎదుటివారి మొహంమీదనే కర్కశంగా చెప్పేస్తుంటారు. అలా కూడా మంచిది కాదు.

11/07/2019 - 18:49

భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు అనాదిగా, భారత ప్రజల జీవన విధానంలో కలిసిపోయి ప్రయాణం చేస్తున్నాయి. కొన్ని రకాల నగలు కొన్ని రూపాల్లో ఉంటాయి. మనం ఇప్పటికీ ఎన్నిరకాల ఫ్యాషన్ మోడల్స్ మార్చినా పాత తరం నుంచి వస్తున్న నగలని పట్టుకుని వేలాడతాం. ఎందుకంటే వేడుకలకు, పెళ్లిళ్లకు ఇవి ఇచ్చినంత అందం మరే మోడ్రన్ నగలు ఇవ్వలేవు.

11/06/2019 - 19:20

కన్నతల్లిపై, జన్మభూమిపై మమకారం మాటల్లో చెప్పలేనిది. ఒకవేళ ఎవరైనా చెప్పాలని ఎంతగా ప్రయత్నించినా చెప్పగలిగేది అణువంత! మిగిలి వుండేది ఆకాశమంత. ఇదే విషయం తెలుగుని ప్రేమించి, తెలుగుని ఆరాధించే భాషాప్రియులకూ వర్తిస్తుంది. ఎప్పటికప్పుడు మెరుగైన జీవితం కోసం కలలు కనడం, ఆ కలలు నిజం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తూ తగిన రీతిలో విజయాలు సాధించేవారు మరెందరికో స్ఫూర్తిప్రదాతలు కూడా!

11/05/2019 - 18:44

కార్తీకమాసం మహిళలకు అత్యంత ప్రాముఖ్యత వహించినది. భక్తిప్రపత్తులతో ప్రతి సోమవారం శివారాధన చేయడం వలన వారికి సకల పాపములు హరించగలవు. నదీ ప్రవాహంలో కార్తీకదీపాలు వదలడం మహిళలకు ఆనవాయితీ. కార్తీకమాసంలో దీపారాధన చేసే స్ర్తిలకు శివానుగ్రహం లభించగలదు. తెలుగింట కార్తీకమాసంలో దేవాలయాలు శివపూజలతో కళకళలాడుతుంటాయి. మహాశివుని మారేడు దళాలతో ఈ మాసంలో పూజిస్తారు. స్ర్తిలకు కార్తీకమాసం అంటే మహా ఇష్టం.

11/03/2019 - 22:16

నేటి స్పీడ్ యుగంలో, ఒత్తిడితో కూడా జీవనంలో చిన్నవయస్సులోనే రక్తపోటు రావడం మామూలైపోయింది. ఇలాంటి ఉరుకుల, పరుగుల జీవనంలో కూడా చిన్నచిన్న యోగాసనాలను వేస్తూ, దినచర్యను ప్రశాంతంగా మార్చుకుంటే రక్తపోటు అనేది దరిచేరదు. అలాగే ఈ యోగాసనాలను వేయడం వల్ల రక్తపోటు ఉన్నవారికి కూడా అదుపులో ఉంటుంది. అల్లోపతి మందుల కన్నా, యోగా భంగిమలు రక్తపీడనాన్ని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

11/01/2019 - 18:53

బంధువుల్ని విధి ఎంపిక చేస్తే, స్నేహితుల్ని మనమే ఎన్నుకోవాలి! అని ఓ మహాశయుడు సెలవిచ్చాడు. స్నేహం విలువ తెలిసి మిత్రత్వ ధర్మం పాటించి, కష్టాల్లో వున్న స్నేహితునికి సాయం చేసేవారున్నట్లే, నమ్మించి మోసం చేసేవారు కూడా తారసపడతారు. కాబట్టి స్నేహితుల ఎంపికలో జాగ్రత్త వహించాల్సిందే.

10/31/2019 - 18:41

పొద్దుపొద్దునే్న చాలా హడావుడి. పిల్లలకు క్యారేజీలు కట్టాలి.. వారిని స్కూలుకు పంపాలి. భర్తకు కూడా క్యారేజీలు సర్ది, మనమూ క్యారేజీలు కట్టుకుని ఆఫీసులకు బయల్దేరాలి. ఇంత హడావుడిలో వ్యాయామం సాధ్యమేనా? కుదరనుకాక కుదరదు.. అందుకని వ్యాయామం సాయంత్రం చేయడమే మేలని కొందరనుకుంటారు. మరికొందరేమో సాయంత్రమయ్యే సరికి రోజువారీ పనుల్లో బాగా అలసిపోయి ఉంటాం. అప్పుడిక ఓపిక ఎక్కడుంటుంది?

10/30/2019 - 18:52

ఇటు వ్యక్తులకైనా.. అటు సంస్థలకైనా.. మరోవైపు ప్రభుత్వాలకైనా వారి లక్ష్యసాధనలో గెలుపుల కొరకు ఆర్థిక పరిపుష్టి అవసరం. ఈ పరిపుష్టి పక్కదోవ పట్టకుండా వుండడానికి ప్రణాళికాబద్ధంగా పొదుపులను పాటిస్తూ.. ఖర్చులను మదుపుచేసుకుంటూ... ఆడంబరాలకు దూరంగా వుండాలి. ఇలా.. పయనిస్తే.. నేటి ఆర్థిక మాంద్య పరిస్థితులు ఎన్నివచ్చినా తట్టుకోడానికి అవకాశం వుంటుంది.

Pages