సబ్ ఫీచర్

అందమైన పాపిడి‘బొట్టు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు అనాదిగా, భారత ప్రజల జీవన విధానంలో కలిసిపోయి ప్రయాణం చేస్తున్నాయి. కొన్ని రకాల నగలు కొన్ని రూపాల్లో ఉంటాయి. మనం ఇప్పటికీ ఎన్నిరకాల ఫ్యాషన్ మోడల్స్ మార్చినా పాత తరం నుంచి వస్తున్న నగలని పట్టుకుని వేలాడతాం. ఎందుకంటే వేడుకలకు, పెళ్లిళ్లకు ఇవి ఇచ్చినంత అందం మరే మోడ్రన్ నగలు ఇవ్వలేవు. పూర్వీకులు, జ్ఞానులు వీటన్నింటినీ శరీరంలోని కొన్ని ప్రాంతాలను తాకే విధంగా, ఆ ప్రాంతాలకు తాకిడి తగిలి, కొన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండే విధంగా నగల రూపాలను నిర్ణయించారు. ఉదాహరణకు జుట్టు మధ్య పాపిడి నుదురుకు తాకేలా రూపొందించిన పాపిడి బిళ్ళ నుదిటిపైన ఆనుతూ చూసేందుకు చాలా బాగుంటుంది. మధ్య యుగాల నాటి చిత్రాలు, శిల్పాల ఆధారంగా తరాల నుంచి తరానికి అందుతూ వస్తోంది ఈ పాపిడి బిళ్ళ. ఈ పాపిడి బిళ్ళను మానవ శరీరంలోని ఆరోచక్రమైన ఆజ్ఞాచక్రాన్ని తాకే విధంగా రూపొందించారు. ఈ ఆజ్ఞా చక్రమే మూడో కన్నుగానూ, ఆత్మశక్తి స్థానంగానూ శాస్త్రాల్లో చెప్పారు. అంతేకాకుండా మనిషిలోని భావోద్వేగాల నియంత్రణకు, ఏకాగ్రతా శక్తిని పెంపొందించేందుకు ఆజ్ఞా చక్రమే అనువైన స్థానం. దీన్ని నుదిటిపై బొట్టుగా ఉంచుతారు. సంప్రదాయాల్లో అత్యంత ముఖ్యమైనది మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం. ఇది కేవలం ఆచారం కాదు, దీని వెనుక కొన్ని శాస్ర్తియ కారణాలు కూడా ఉన్నాయి. కుంకుమ బొట్టు పెట్టుకోవడం కేవలం పెళ్లి జరిగింది అన్నదానికి చిహ్నం మాత్రమే కాదు.. కుంకుమను పాపిడిలో పెట్టుకున్నప్పుడు అది శరీరాన్ని చల్లబరుస్తుంది. స్ర్తి శక్తికి ప్రతీక కుంకుమ బొట్టు. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరంలో కోరికలు పెరుగుతాయట. అందుకనే భర్త చనిపోయినవారు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదని చెబుతారు. నుదుటిపై కుంకుమను పెట్టుకోవడం వల్ల మెదడులోని కణాలను ప్రేరేపితం చేస్తాయి. నొసటిపై వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. నొసటి ప్రాంతంలో అన్ని నాడులూ కేంద్రీకృతమై ఉంటాయి. అక్కడ పెట్టుకోవడం వల్ల చేసే పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. నుదిటి పైభాగాన ఆజ్ఞాచక్రం ఉంటుంది. అక్కడ హుక్ ఉండే విధంగా పాపిడి బిళ్ళను రూపొందిస్తారు. అలా ఆ హుక్ వల్ల ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా భావోద్వేగాల నియంత్రణ లభిస్తుంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ పెద్దవారు అయినా సరే తప్పనిసరిగా నుదుటిపై పెట్టుకున్న కుంకుమ అందరికీ కనిపించకుండా పాపిడిబిళ్ళను పెట్టుకుంటారు. ఇది వారి సాంప్రదాయంలో తప్పనిసరి. ఇంత చరిత్ర తెలుసుకోకపోయినా పాపిడి బిళ్ళ పెట్టుకుంటే చూడటానికి అందంగా ఉంటుంది. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా.. పాపిడిబిళ్ళల్లో వివిధ రకాలు వచ్చాయి. పూర్తిగా పాపిడి బిళ్ళల్లాగానో, నుదుటికి పెట్టుకునే హుక్‌లాగానో.. ఇలా ఎన్నో రకాలు.. అన్ని రకాల ఆభరణాల్లో నుదుటిపై ఆకర్షణీయంగా ఉండే పాపిడిబిళ్ళ ఎంతో అందమైనది. అందుకే నగల్లో దీనిదే ముందు స్థానం. తెలుసుకున్నారుగా పాపిడి బిళ్ళ చరిత్ర.. ఇక నుంచి ప్రతి వేడుకకి పాపిడి బిళ్ళ పెట్టుకోవడం మరిచిపోకండేం..