S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/26/2019 - 18:55

మహిళలపై నిత్యం పెరుగుతున్న అత్యాచారాలపై సభ్య సమాజం భీతిల్లుతోంది. ఆడపిల్లలుగల తల్లిదండ్రులతే నిత్యం సంఘర్షణకు లోనై బయటికి వెళ్ళిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు వారి ఆలోచనలు పరిపరివిధాలుగా పోతోంది. సామాజికపరంగా మానవత్వం మటుమాయమై అవకాశాలకోసం ఆతృతగా ఎదురుచూస్తున్న మగ మృగోన్మాదుల అరాచకాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్న విష సంస్కృతి వారిది.

09/25/2019 - 18:40

ప్రస్తుతం యాంత్రికమైన దినచర్య, పనుల ఒత్తిడి, సొంత పనులకు సమయం చాలకపోడం, ముఖ్యంగా ఉద్యోగినులు ఇంటా, బయటా అధిక శ్రమకు గురికావడం, తాము చేపట్టిన పనిలో పరాజయం, ఆప్తుల మరణం, భగ్నమైన ప్రేమ, సన్నిహితుల ఎడబాటు, ప్రేమరాహిత్యం, అభద్రతా భావం, ఒంటరితనం, తాము కోరుకున్నది వారికి లభించకపోవటం, అనారోగ్యాలు, అవమానం లాంటివి ఎనె్నన్నో కారణాలు డిప్రెషన్‌కు గురిచేస్తాయి.

09/24/2019 - 18:55

ఏమీ లేని విషయాన్ని గురించి ఎవర్నయినా అడిగితే... ఏముందీ! ‘సూదిలో...’ అంటుంటారు చాలామంది వ్యంగ్యంగా.. కానీ మేలురకం పట్టువస్తమ్రయినా సూదీ దారానికి లోకువే. దాని కుట్టుబడికి కట్టుబడి ఉండాల్సిందే. ఆ సూదీ దారాలే ఫ్యాషన్ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అదెలా అంటారా?

09/23/2019 - 18:46

జ్యూస్ థెరపీ గురించి విన్నారా..?

,
09/22/2019 - 22:40

లబ్ది సురానా వయస్సు కేవలం ఆరు సంవత్సరాలు. ఈ ఆరు సంవత్సరాల్లోనే ఈ బుడత 64 పతకాలను సంపాదించేసింది. ఎలాగంటారా.. లబ్ది సురానాకు స్కేటింగ్ అంటే మహా ఇష్టం. మూడు సంవత్సరాల వయస్సు నుంచే స్కేటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన లబ్ది ఎనిమిది అంతర్జాతీయ పతకాలను సైతం గెలుచుకుంది. ఇటీవల రాష్టప్రతి నుంచి అవార్డు అందుకుంది లబ్ది. రోజూ ఉదయానే్న ఐదు గంటలకు నిద్ర లేవడంతో లబ్ది దినచర్య మొదలవుతుంది.

09/20/2019 - 19:16

నేటి ఆధునిక సమాజంలో ఓవైపు మహిళలు అన్ని రగాల్లో రాణిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు. మరోవైపు ప్రగతికి దూరంగా అక్షర ఫలాలు నోచుకుండా వెనుకబడిన ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు తొలగిపోవడంలేదు. చిట్టితల్లుల భవిత అగమ్యగోచరంగా మారుతోంది. తల్లిదండ్రుల్లో అవగాహనలేమి, బాధ్యత కాకుండా బరువుగా భావిస్తుండటం, ఆడపిల్లల పాలిట శాపంగా మారింది. అమ్మాయే అమ్మగా సృష్టికి మూలమని తెలుసుకోవాలి. అందుకే ఆడపిల్లలను కాపాడుకోవాలి.

09/19/2019 - 18:48

నేటి ఉరుకుల, పరుగుల యుగంలో కాలంతో పరుగెట్టడం ప్రతి ఒక్కరికీ తప్పట్లేదు. ఇక భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైతే.. అంతేసంగతులు! మామూలు డే షిఫ్ట్ ఉద్యోగాలైతే ఫర్వాలేదు.. కనీసం రాత్రివేళ ఓ గంట సమయమైనా దొరుకుతుంది మాట్లాడుకోవడానికి.. అదే ఇద్దరికీ వేరు వేరు షిఫ్ట్‌లైతే.. ఇక అంతే.. కనీసం వారి మధ్య పలకరింపులు కూడా ఉండటం లేదు. బంధాల్లో యాంత్రికత, ఒత్తిడీ పెరిగిపోతోంది. ఫలితంగా అపార్థాలు, అభద్రతా, అపోహలూ..

09/18/2019 - 18:48

కాలంతో పాటు యువతరం ఆలోచనల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. పాతికేళ్లకే ఆర్థిక స్వాతంత్య్రం వచ్చేస్తుంది. ఫలితంగా విందులు, వినోదాలు అంటూ యువతరం డబ్బును వృథాగా ఖర్చు చేస్తోంది. చెబితే.. జీవితంలో వినోదం కూడా అవసరం అంటారు. కానీ ఇప్పుడు మనం చేసే పొదుపే.. భవిష్యత్తులో మన ఆర్థిక స్థిరత్వాన్ని నిర్దేశిస్తుంది.

09/17/2019 - 18:39

ఆడపిల్ల అని తెలియగానే చాలు కడుపులో వున్న పిండాన్ని చిదిమేస్తున్నారు. ఎక్కువగా మన దేశంలోనే అందులోను బాగా చదువుకొని, ఆర్థికంగా వున్న కుటుంబాల్లోనే భ్రూణహత్యలు జరగడం శోచనీయం. బాలికలపై వివక్షతోనే భ్రూణహత్యలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టడానికి పసిపిన్‌డిటి చట్టం కూడా వుంది. అయినా కూడా ప్రయోజనం లేదు. ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసే సంస్కృతి ఇంకా కొనసాగుతుండడం విచారకరం.

09/16/2019 - 18:54

ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి నిత్యం ఒత్తిడికి గురవుతున్నాడు. కొన్ని సందర్భాలతో ఒత్తిడివల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని తట్టుకొని ధైర్యంగా నిలబడిన వ్యక్తులు ఉన్నత స్థానాలకు చేరుతారు. వాస్తవానికి స్ట్రెస్ అనేది తరతరాల నుంచి వారసత్వంగా వస్తోంది. ఒక స్థాయి వరకూ ఒత్తిడి మంచిదే అయినా అది నిత్య జీవితంలో భాగం అయిపోతే పరిస్థితి చేయిదాటిపోతుంది.

Pages