సబ్ ఫీచర్

స్వచ్ఛమైన గాలికి ఆక్సిజన్ బార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి జీవనశైలి మూలంగా పంచభూతాలు కలుషితమైపోతున్నాయి. ప్రకృతి ఫ్రీగా ప్రసాదించిన ఈ పంచభూతాలను కొనుక్కుంటామని మనిషి కల్లో కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పుడు నడిచే నేలకు, వెలుగిచ్చే నిప్పుకి, అందరికీ సొంతమైన ఆకాశానికి, దాహం తీర్చే నీటికి, బతకడానికి పీల్చే ఊపిరికి.. ఇలా ప్రతిదానికీ రేటు ఉంది. ముఖ్యంగా నేడు గాలి, నీరు తీవ్రంగా కలుషితమైపోయాయి. జీవనానికి కారణమైన ఆక్సిజన్, దాహం తీర్చుకునే నీటిని నిత్యం ఖరీదు కట్టి కొనుక్కునే స్థాయికి వచ్చేశాం. ఇవి మనకు ఎంతో అవసరమని తెలిసినా నిర్లక్ష్యంతో, విచ్చలవిడిగా వీటిని కాలుష్యబారిన పడేలా చేస్తున్నాం. అప్పటికప్పుడు విలాసాలనే చూసుకుంటున్నాం కానీ.. మునుముందు వచ్చే ఆపదలను పట్టించుకోవడం మానేసాం. అందుకు సాక్ష్యమే దిల్లీలోని వాతావరణ కాలుష్యం. వాతావరణ కాలుష్యంలో నెంబర్ వన్ అనిపించుకుంది దిల్లీ. బయటి వాతావరణంలో సరిగ్గా ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అక్కడి ప్రజలు. అందుకే బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ వేసుకుని వెళతారు. వెంటనే వ్యాపారవేత్తలు ఓ గొప్ప ఐడియా వచ్చింది. దాంతో ‘ఆక్సిజన్ బార్’ పేరిట ఓ బార్‌ను ఓపెన్ చేశారు.
దిల్లీలో ప్రజలకు ఎక్కడా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభ్యమవదు. బయటి వాతావరణంలో గాలి పీల్చుకోవాలి అనుకున్నవారు తప్పనిసరిగా మాస్క్‌ను వేసుకోవాల్సిందే.. ఇక ఇల్లులేకుండా రోడ్లపై ఉండేవారి పరిస్థితి చెప్పనక్కరలేదు. ఇలాంటి పరిస్థితిని తమకనుకూలంగా మలచుకుంది ఆక్సీప్యూర్ అనే సంస్థ. వీరు దిల్లీలో ఓ ఆక్సిజన్ బార్‌ను ఓపెన్ చేశారు. బార్ అంటే మద్యం దుకాణం కాదు. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించే బార్ అన్నమాట. ఇక్కడ స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది. ఈ ఆక్సిజన్ బార్‌లోకి వెళ్లగానే రెస్టారెంట్ తరహాలోనే అక్కడున్న వెయిటర్ ఓ మెనూ కార్డ్ ఇస్తాడు. వాటిలో స్వచ్ఛమైన గాలిని అందించే తులసి, నిమ్మ, ఆరెంజ్, జామాయిల్, పుదీనా, వేప, దాల్చిన చెక్క, మరువం, జాస్మిన్.. ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్‌ను బట్టి రేటు ఉంటుంది. అయితే ధర మాత్రం చాలానే ఉందండోయ్. కేవలం పదిహేను నిముషాలకు సహజ ఆక్సిజన్ రూ. 299 నుంచి మొదలయ్యింది. ఇక ఫ్లేవర్‌ను అనుసరించి రేటు పెరుగుతూ ఉంటుంది. నచ్చిన ఫ్లేవర్‌ను ఎంచుకోగానే ఒక దగ్గర కూర్చోబెట్టి రెండు పైపులను ముక్కుపుటాల్లో పెట్టుకోమంటారు. అలా పదిహేను నిముషాల పాటు ప్రశాంతంగా కూర్చుని ఆ గాలిని పీల్చుకోవాలి. దీనికి కూడా ముందే బుకింగ్స్, అపాయింట్‌మెంట్స్ ఉన్నాయి. రోజులో నిర్దేశించిన సమయంలో ఒక్కసారి మాత్రమే ఇలా గాలిని పీల్చుకోవచ్చు. అంతేకాదు ఇంటికి వెళ్లేటప్పుడు కూడా ఆక్సిజన్‌ను డబ్బులిచ్చి కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లవచ్చు. అందుకు అనువుగా ఆక్సీక్యాన్స్, ఆక్సిజన్ డ్రింక్స్ వంటి వాటిని అందుబాటులో ఉంచారు ఈ బార్ నిర్వాహకులు. ఇలాంటివి మునుపు ఎప్పుడో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఫ్రెష్ ఎయిర్ పేరుతో ఈ అమ్మకాలు జరిగేవి. మంచి సువాసనలు వెదజల్లే వివిధ రకాల అరోమాలతో పలు సంస్థలు ఆన్‌లైన్‌లో ఎప్పటినుంచో ఆక్సిజన్‌ను అమ్మేవి. అదేదో సామెత చెప్పినట్టు ‘వినాశకాలే.. విపరీత బుద్ధి’ అన్నట్లుగా ఉంది కదూ ఇది.. ఏదిఏమైనా చేజేతులారా స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నాశనం చేసి ఇప్పుడు మానవుడు ఆక్సిజన్‌ను కొనుక్కునే స్థాయికి వచ్చేశాడు. ఇక ముందుముందు ఇంకేం అమ్ముతారో.. పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయో చూడాలి.. అలా జరగకుండా భవిష్యత్తు తరాల కోసం ఇప్పటికైనా కళ్లు తెరచి చెట్లను నాటుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తే.. ఇలా పంచభూతాలను కొనుక్కునే పరిస్థితి తప్పుతుంది. భవిష్యత్తు తరాలు ఆనందంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జీవిస్తాయి.