సబ్ ఫీచర్

నిజమైన స్నేహాన్ని ఎంచుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంధువుల్ని విధి ఎంపిక చేస్తే, స్నేహితుల్ని మనమే ఎన్నుకోవాలి! అని ఓ మహాశయుడు సెలవిచ్చాడు. స్నేహం విలువ తెలిసి మిత్రత్వ ధర్మం పాటించి, కష్టాల్లో వున్న స్నేహితునికి సాయం చేసేవారున్నట్లే, నమ్మించి మోసం చేసేవారు కూడా తారసపడతారు. కాబట్టి స్నేహితుల ఎంపికలో జాగ్రత్త వహించాల్సిందే.
స్నేహం బాల్యంనుండే మొదలుకావచ్చు. ఇరుగుపొరుగునాటిది కావచ్చు. లేదా స్కూలు, కాలేజీల్లో మొదలు కావచ్చు. కొందరి స్నేహాలు ఆఫీసుల్లో ప్రారంభమవుతాయి. ప్రయాణాల్లో పరిచయాలు స్నేహాలుగా రూపాంతరం చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే స్నేహం ఎప్పుడు, ఎలా ఏర్పడినా అందులో నిజాయితీ అనేది ముఖ్యం.
‘‘నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎటువంటివాడో చెబుతా’’ అని మన పెద్దలు అంటుంటారు. స్నేహంలో నిజాయితీ లేకపోతే అది అపాత్రదానంలా మారుతుంది. స్నేహమనేది గాజుబొమ్మలాంటిది. దానిని జాగ్రత్తగా చూసుకోవడమనేది స్నేహితులిద్దరిమీదా ఆధారపడి ఉంటుంది. నిజమైన స్నేహితుడంటే, మంచి చెడు విచక్షణను ఎప్పటికప్పుడు మనసుకు తెలిపేవాడు.
‘కోట్ల డబ్బు వున్నవారికంటే, స్నేహితుడు వున్నవాడే నిజమైన కోటీశ్వరుడు’ అంటారు. డబ్బే ప్రధాన ధ్యేయంగా కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కూడా లేకుండా ఫోన్ల పలకరింపులతో బిజీగా వుండే జీవితాలతో మానసికంగా ఒంటరిగా మిగిలిపోతుంటారు. విధేయత, విశ్వసనీయత, ఆసక్తి, పంచుకోవడం, సహాయత, ఆశ్చర్యం, నిదానం లాంటి లక్షణాలన్నీ స్నేహంలో ఉండాలని, అప్పుడే ఆ స్నేహం కలకాలం వుంటుందని అంటారు. ఇవి లోపిస్తే ఆ స్నేహానికి విలువ ఉండదు. నిజమైన, నిజాయితీ కలిగిన స్నేహంలో ఇవి వాటంతటవే ఏర్పడతాయి. కేవలం హ్నేహంలోనే కాదు సమాజంలోని అందరూ ఒకే కుటుంబం అన్నట్లుగా ఉండాలంటే ఇవి తప్పనిసరి.
విలువలతో కూడిన స్నేహం వ్యక్తి ఉన్నతికి తోడ్పడుతుంది. అప్పుడే ఆ స్నేహాలు కలకాలం మనగలుగుతాయి. అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. పుస్తకాలు, స్నేహాలు తక్కువగా మంచిగా ఉండాలంటారు. స్నేహంలో అరమరికలు ఉండకూడదు. అలాగని పూర్తి వ్యక్తిగతం లేకుండా ఉండకూడదు. కుటుంబాలకు దూరంగా ఉన్నవారు తమ కుటుంబాలతో వున్న అనుబంధాలు గుర్తురావడం సహజం. దానివల్ల వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అలా ఎవరూ లేనిచోట తామున్నామని చేయూతనిచ్చే స్నేహితులు వుంటే ఒంటరివారమన్న భావన పోతుంది. అటువంటివారికి ఈ స్నేహాలే ఊరటనిస్తాయి. ఆ స్నేహాలవల్ల వృత్తిపరంగా, వ్యక్తిగతంగా వృద్ధి జరుగుతుంది. అదేసమయంలో కొన్ని స్నేహాలవల్ల అనుకోని ప్రమాదాలు ఎదురవుతుంటాయి.
జీవిత ప్రయాణంలో ఓ మంచి నేస్తం తోడుంటే ఆ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. స్థాయిభేదం, స్థానభేదం వంటి భేదాలు లేనిదే నిజమైన స్నేహం. ప్రస్తుతం కావలసింది అటువంటి స్నేహాలే. సామాజిక పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇరుగుపొరుగువారు లేదా ఉద్యోగంలో సహచరులే స్నేహితులుగా, ఆత్మీయులుగా మారిపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులతో సైతం చెప్పుకోని సమస్యలను స్నేహితులతో చెప్పుకుంటుంది నేటి యువత. అయితే మంచి చెడూ అన్నిటా వున్నట్లే, స్నేహంలోనూ, స్నేహితుల్లోనూ వున్నాయి. దానివల్ల దుష్ఫలితాలు వుంటాయి. అందుకే స్నేహితుల ఎంపికలో జాగ్రత్త అవసరం.
‘వివేకంగల శత్రువుకంటే వివేకశూన్యుడైన స్నేహితుడే ఎక్కువ ప్రమాదకరం’ అనే మాటలు ఒక హెచ్చరికలాంటివి. ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే కాని ఎక్కువకాలం నిలుపుకోగలగటమే కష్టం అన్నాడు కార్డినల్ న్యూమాన్. వీటిని బట్టి స్నేహమనేది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో అర్థం చేసుకోవచ్చు. మారుతున్న కాలంలో మార్పునకు అనుగుణంగా మారే మనసులను అర్థం చేసుకుంటూ నిజమైన స్నేహం నిలవాలని కోరుకుందాం.

-పి.ఎం.సుందరరావు