సబ్ ఫీచర్

మహిళలకు సౌభాగ్యం కార్తీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకమాసం మహిళలకు అత్యంత ప్రాముఖ్యత వహించినది. భక్తిప్రపత్తులతో ప్రతి సోమవారం శివారాధన చేయడం వలన వారికి సకల పాపములు హరించగలవు. నదీ ప్రవాహంలో కార్తీకదీపాలు వదలడం మహిళలకు ఆనవాయితీ. కార్తీకమాసంలో దీపారాధన చేసే స్ర్తిలకు శివానుగ్రహం లభించగలదు. తెలుగింట కార్తీకమాసంలో దేవాలయాలు శివపూజలతో కళకళలాడుతుంటాయి. మహాశివుని మారేడు దళాలతో ఈ మాసంలో పూజిస్తారు. స్ర్తిలకు కార్తీకమాసం అంటే మహా ఇష్టం. కార్తీకంలో ప్రతీ సోమవారాలు ఉపవాసంతో శివపూజలు చేస్తారు. పరమ పవిత్రమైన కార్తీకమాసం అంటే శివునికి ప్రీతిపాత్రము. తెల్లవారు జామున నదీ స్నానం, దీపారాధన చేయడం, ఉన్నంతలో కొంత నిరుపేదలకు దానం చేయడంవలన ఈ మాసంలో పుణ్యఫలం లభిస్తుంది.
దీపావళి పండుగ మాదిరిగానే ఇంటి ముంగిట ప్రమిదలతో దీపాలు పెట్టడం ఆనవాయితీ. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ పండుగ చేస్తారు. కార్తీకమాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అత్యంత విశిష్టం. కార్తీకమాసంలో స్ర్తిలు అధిక సంఖ్యలో ఇళ్ల ముందు సాయం, సంధ్యా సమయాలలో దీపాలు పెట్టి దీపారాధన చేస్తారు. ఈ మాసంలోనే నదీ స్నానాలు అత్యధికంగా చేస్తారు. భక్తిశ్రద్ధలతో తులసి మాతను పూజిస్తారు. ఈ మాసంలో విశేషంగా శివార్చనలు, శివపూజలు అభిషేకాలు అధికంగా నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఈ మాసంలో ప్రత్యేకంగా పరమ శివుని పూజిస్తారు. కార్తీకమాసం శివభక్తులకు శివపూజార్చనలు చేయడంవలన సకల సౌభాగ్యాలు సంప్రాప్తిస్తాయి. పరమశివుడు, విష్ణ్భుక్తులకు కార్తీకమాసం బహుళ ప్రజాదరణ పొందింది. ఆలయాలలో ఆకాశదీపం కార్తీకమాసంలోనే ప్రారంభిస్తారు. కోటి దీపారాధన ఈ మాసంలో జరపడం విశేషం. కార్తీకమాసం సంధ్యా సమయాలలో దీపాలు వెలిగించడం స్ర్తిల సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. కార్తీకమాసంలో ముఖ్యంగా సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతి కనుక ఆ రోజు ప్రతీ శివాలయంలో శివలింగానికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. శివాలయం, విష్ణువు ఆలయాలలో సైతం దీపారాధన గావిస్తారు.
‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే’’
దీపంకు గల ప్రాముఖ్యత పలు పండుగలలో సంతరించుకుంది. కార్తీకమాసం రాత్రివేళల్లో పూజానంతరం స్ర్తిలు కార్తీకదీపాలు నదీ ప్రవాహంలో వదులుతారు. కార్తీకదీపం శివునికి ప్రీతికరం. మహిళలకు సౌభాగ్యసిద్ధిని, ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించే కార్తీకమాసం పరమ పవిత్రం అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది. తెలుగింట కళకళలాడే కార్తీకమాసం మహిళలకు చాలా ఇష్టం. సకల భక్తకోటికి పాపహరణం ఈ కార్తీకమాసం.

-ఎల్.ప్రపుల్లచంద్ర 8886574370