సబ్ ఫీచర్

చలిని తట్టుకోవడానికి ఉల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు వినింది నిజమే.. చలిని తట్టుకోవాలంటే ఉల్లిని ఎక్కువగా తినాలట.. అసలే ఉల్లి రేటు విపరీతంగా పెరిగింది. ఎలా తినాలి? అనుకుంటున్నారు కదూ.. కానీ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా పెద్దలు.. అది నూటికి నూరుపాళ్ళు నిజమే.. ఈ విషయం వింటే మీరు కూడా ఇదే మాట చెబుతారు. అసలే చలి పులి తన పంజా విసురుతోంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే రకరకాల స్వెటర్లు వాడుతుంటారు. దీనితో పాటు మనం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలను కూడా తీసుకుంటే ఎంతటి చలిలోనైనా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చునని పలువురు ఆహార నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ లేనిదే దాదాపు సగం కూరల వరకు వంటలు చేయలేము. అందుకనే ప్రతి ఇంట్లో ఉల్లిపాయ కచ్చితంగా ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే ఎంజైములు, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇది శరీరాన్ని ఎప్పటికప్పుడు వెచ్చగా ఉంచుతుందట. అందుకే చలికాలంలో రోజూ ఒక ఉల్లిపాయ తింటే ఎంత చలికి తట్టుకొనైనా ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
* ఉల్లిపాయలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్స్, రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.
* ఉల్లిపాయ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో వెచ్చదనాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు అప్పటికప్పుడు తగినంత శక్తిని అందిస్తుందట.
* ఉల్లిలో సహజంగా ఉండే అల్లైల్ డై సల్ఫేట్, యాంటీసెప్టిక్, యాంటీ బాక్టీరియల్ వంటి లక్షణాలు ఉంటాయి. వీటివల్ల జ్వరం, దగ్గు, జలుబు, ఉబ్బసం, చెవి, చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
* చలికాలంలో సాధారణంగానే వ్యాయామం చేయడానికి ఎక్కువమంది ఇష్టపడరు. కాబట్టి రోజూ ఒక ఉల్లి తింటే బరువు పెరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఉల్లిలో ఉండే కాల్షియం, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు, ఎక్కువ మోతాదులో ఫైబర్ కూడా ఉండటం వల్ల శరీర బరువు పెరగదు.
* ఉల్లిపాయ తినడం వల్ల పిప్పి పళ్లు రాకుండా చేయడంతో పాటు చిగుళ్లను మరింత బలంగా తయారుచేస్తుంది.
*