సబ్ ఫీచర్

సానుకూల ఆలోచనలు విజయాన్నిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాలలో పరీక్షల సందడి మొదలైంది. ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతుండగా, పదవ తరగతి పరీక్షలు రెండు, మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు చదివిన చదువుకు పూర్తి స్థాయిలో సార్థకత వచ్చేది, విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసేవి, ఏడాదిపాటు పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాలు, అభ్యసించిన జ్ఞానానికి కొలమానం ఈ బోర్డు పరీక్షలే. బోర్డు పరీక్షలనగానే సహజంగానే వి ద్యార్థులు ఒత్తిడికి లోనవుతూ వుం టారు. తరగతి గదిలో బాగా చదివిన విద్యార్థులు కూడా ఒత్తిడికి లోనై పరీక్షలలో తక్కువ మా ర్కులు వచ్చినవాళ్లు ఎం దరో ఉన్నారు. ఇప్పటినుండి సరైన ప్రణాళిక తయారుచేసుకోవాలి. గతంలో ఎన్నో పరీక్షలు రాశాను, మంచి మా ర్కులు సాధించాను, ఈ పరీక్షలు అంతకంటే బాగా రాస్తాను, మంచి మార్కులు సాధిస్తాను అనే దృఢమైన సంకల్పాన్ని మన మనసులో అనుకోవాలి. నా మనసు నా మాట వింటుంది అనే ఆత్మవిశ్వాసాన్ని కలిగివుండాలి.
మంచి ఫలితాలను పొందాలంటే..
సమయపాలన: రోజుకు వున్న 24 గంటల సమయాన్ని ఒక ప్రణాళిక ప్రకారంగా ఉపయోగించుకుని ప్రిపేర్ అయినవారికి మంచి మార్కులు వాటంతటవే వస్తాయి. పరీక్షలు సమీపిస్తుంటాయి. ఇదే సమయంలోనే ప్రీ ఫైనల్ పరీక్షలు, నమూనా పరీక్షలు నిర్వహిస్తూ వుంటారు. చాలామంది విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో కొన్ని చాప్టర్‌లు చదువుకునేవాడిని కదా అని బాధుపడుతూ ఉంటారు. ఒకవైపు ప్రీ ఫైనల్, నమూనా పరీక్షలు, బోర్డు పరీక్షలు ఏం చదవాలో, ఎలా చదవాలా అని ఆలోచించడానికి కూడా సమయం దొరకదు. పుస్తకాలు అన్ని చదివినా ఇంకా చదవాల్సిన చాప్టర్‌లు మిగిలి ఉన్నాయనే ఆందోళన పెరుగుతూ వుంటుంది. ప్రతి పరీక్ష కూడా శాశ్వతంగా గుర్తుండడానికి దోహదం చేస్తాయనే విషయాన్ని గ్రహించాలి. చదవాల్సిన చాప్టర్‌లను ఎట్టి పరిస్థితులలోనూ వాయిదా వేయకూడదు. ఏ సమయంలో ఏది, ఎలా పూర్తిచేయాలో ఆ సమయంలోనే పూర్తిచేయాలి. ఒత్తిడి దరి చేరకుండా సమయాన్ని సద్వినియోగపర్చుకోవాలి. ప్రతి అంశాన్ని కేటాయించిన నిర్దేశిత సమయంలో పూర్తిచేసుకోవాలి. పరీక్షల సమయంలోని విద్యార్థుల విలువైన కాలాన్ని పాడుచేసే సోషల్ మీడియా (వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్), టీవీ కార్యక్రమాలు, కంప్యూటర్ గేమ్స్‌కు దూరంగా ఉండాలి.
***
సానుకూల ఆలోచనలతోటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. పరీక్షల భయాన్ని జయించవచ్చు. ‘నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నాలో పరీక్షల భయాందోళనలు దరిచేరకుండా మనసెంతో హాయిగా ఉంది. రోజూ పూర్తి ఉత్సాహంతో యాక్టివ్‌గా ఉంటున్నాను’ అనే సూచనలను మనసుకు ఇచ్చుకోవాలి. ఇలా సూచనల ద్వారా శరీరానికి, మనసుకు చాలా విశ్రాంతి లభిస్తుంది. ఈ పరీక్షలు చాలా బ్రహ్మాండంగా రాస్తాను, నామీద నాకు గట్టి నమ్మకం ఉంది. పరీక్షలకు చదవడంలోనే నాకు పూర్తి సంతోషం దొరుకుతుందని అనుకోవాలి. సానుకూల ఆలోచనలను పూర్తి విశ్వాసంతో నెమరువేసుకున్నట్లయితే పరీక్షలకు సంబంధించిన ఆందోళన దూరం అవుతుంది.
పరీక్ష హాల్లో ఉత్సాహం
పరీక్ష హాల్లో ఉత్సాహంగా పరీక్షలు రాస్తేనే మంచి మార్కులు సాధిస్తారు. ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలను శ్రద్ధగా వినాలి. పరీక్షా ప్రశ్నాపత్రం కఠినంగా ఉన్నట్లు అన్పిస్తే కృంగిపోవాల్సిన పనే్లదు. అందరికీ కఠినంగానే ఉంటుందని గుర్తించాలి. ప్రశ్నాపత్రంలో సులభంగా వున్న ప్రశ్నలను మొదట రాయడం ప్రారంభించాలి. సులభమైన ప్రశ్నలు రాసినకొద్దీ మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆటోమెటిక్‌గా కఠినంగా వున్న ప్రశ్నలకు సంబంధించిన జవాబులు కూడా గుర్తుకు రావడానికి లాజిక్ దొరుకుతుంది. ఇంతకాలం చదివినదానికి ప్రతిఫలం పొందేది పరీక్ష హాల్లో మూడు గంటల పాటు సమాధానాలు రాసే సమయం చాలా విలువైనది. ఏ సందర్భంలో కొంత టెన్షన్ అనిపిస్తే, బ్రీత్ ఎక్సర్‌సైజ్ 2, 3 నిమిషాలపాటు చేయండి. మంచి ఫలితం లభిస్తుంది.

-డా అట్ల శ్రీనివాస్‌రెడ్డి