సబ్ ఫీచర్

ఈ బామ్మ.. ఓ అన్నపూర్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసికి చెందిన ఈ బామ్మపేరు విమలా దివాన్. వయసు 82 సంవత్సరాలు. వయసులో ఉన్నప్పుడు అధ్యాపకురాలిగా చాలామంది జీవితాలను తీర్చిదిద్దింది. ఇప్పుడు విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ జీవిస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ బామ్మ కూడా నేను సైతం అంటూ ముందుకొచ్చారు. పని దొరక్క పస్తులతో రోజులు గడుపుతున్న కూలీల పాలిట కాశీ అన్నపూర్ణ మారారు ఈ బామ్మ. తన పెన్షన్ సొమ్ముతో ఈ బృహత్కార్యాన్ని చేస్తున్నారామె.. స్వయంగా వారి కోసం వండుతున్నారు కూడా.. తనకు తెలిసిన వారితో కలిసి ఒకరు కూరగాయలు తరుగుతుంటే.. మరొకరు అన్నం వండుతున్నారు. మరొకరు స్వీట్లు తయారుచేస్తున్నారు. ఆ పక్కనే బామ్మ.. కుర్చీలో కూర్చుని పూరీలు చేస్తున్నారు. అన్నీ తయారయ్యాక వీటన్నింటినీ డబ్బాల్లో సర్దేసి లాక్‌డౌన్‌వేళ.. అన్నార్తులకు అందిస్తున్నారు విమల. ఈ బామ్మ పెద్దమనసు.. ఆ కాలనీ వాసుల మనసులను కదిలించింది. వారంతా బామ్మకు సాయం చేయడం మొదలుపెట్టారు. ఈ బామ్మ క్యాన్సర్ బారిన పడి అయిదేళ్లు పోరాడి గెలిచారు. క్యాన్సర్‌నే గెలిచిన నేను కరోనాకు భయపడను. ఈ ఆపత్కాలంలో నా వల్ల అయింది చేస్తా.. అంటూ అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చిన ఈ బామ్మ ఎందరికో ఆదర్శనీయం.