సబ్ ఫీచర్

నిర్ణయాలు-అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఏడాది సందర్భాన్ని ఆరోగ్యానికో, డబ్బుకో, అలవాట్లకో సంబంధించి తీర్మానాలు చేసుకోవడం అమెరికా దేశస్థుల్లో ఎక్కువ. దాదాపు యాభైశాతం మంది ఇలా తీర్మానాలు చేసుకుంటే అందులో సుమారు సగం మంది జనవరి రెండో వారంలోనే వదిలేస్తారట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్ఫై శాతం మంది నూతన సంవత్సరం సందర్భంగా తమ జీవితంలో మార్పును ఆహ్వానించాలని తాపత్రయపడుతూ న్యూ ఇయర్ రెజల్యూషన్‌ను పెట్టుకొంటున్నారట. ఇలాంటివారిలో ఎక్కువమందికి ‘బరువు తగ్గడం’ అనేదే లక్ష్యం. డబ్బును పొదుపుచేయాలి.. పొగత్రాగడం మానేయాలి.. జిమ్‌కు వెళ్లాలి.. అనేవి రెజల్యూషన్స్‌లో ప్రధాన అంశాలు. ఇలాంటివి మన దేశంలో కూడా మొదలయ్యాయి.
* కొత్త సంవత్సరం వచ్చిందంటే జిమ్‌లకు పండగే పండగ. మరోపక్క వైన్‌షాపులు, పాన్‌షాపులూ వెలవెలబోతాయి. ఆరోగ్యానికి మేలుచేసే ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. తెల్లారి ఎనిమిదైనా నిద్రలేవని కుర్రాళ్లు, వణికించే చలిని కూడా లెక్కచేయకుండా జనవరి ఒకటిన ఉదయానే్న టంచనుగా జిమ్‌లో వాలిపోతుంటారు. అందుకే మొదటిరోజు ఇలాంటి కేంద్రాలన్నీ సామర్థ్యానికి మించి కిటకిటలాడతాయి. పదిహేను రోజులయ్యేసరికి జనాల సంఖ్య పలచపడుతుంది. ఇక నలభై ఐదు రోజులు గడిచేసరికి ఒకటో తారీఖున జిమ్‌లలో చేరిన వాళ్లలో అరవై శాతం రావడం మానేస్తుంటారని సర్వే చెబుతోంది. మరో నలభై ఐదు రోజులకు ఆ సంఖ్య ఎనభై శాతానికి పడిపోతుంది. ఈ పరిణామానికి అన్నిచోట్లా ప్రధానంగా కనిపించే ఒకే ఒక్క కారణం.. బద్ధకం.
* ‘ఇదే నా జీవితంలో ఆఖరి సిగరెట్టు..’ డిసెంబరు 31 అర్ధరాత్రి చాలామంది పొగరాయుళ్ల నుంచి వినిపించే మాట ఇదే.. ఎక్కువమంది ఒట్టేసి, గట్టున పెట్టేసే జాబితాలో దీనిది రెండో స్థానం. సంవత్సరం మధ్యలోకి వచ్చేసరికి ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండేది పదిహేను శాతం మందే.. ఈ కోవలోకే వస్తుంది మద్యం మానేయాలి అనే నిర్ణయం కూడా..
* ఆరోగ్యానికి విలువిచ్చే వాళ్లంతా జంక్ ఫుడ్‌కీ, నూనె పదార్థాలకూ దూరంగా ఉండాలనీ ఈ రోజే ఒట్టు పెట్టుకుంటారు. నాలుగు రోజులు కాగానే అప్పుడప్పుడూ ఫర్వాలేదని నియమాలను సవరించుకుంటారు. ఇక సెలవులు, పండుగలూ వచ్చినప్పుడు కష్టపడేదే తినడానికైనప్పుడు రాజీపడటం ఎందుకని ఆహార సూత్రాలను పక్కన పెడతారట. దాంతో ఏడాది చివరికి కనీసం పదిశాతం మంది కూడా లక్ష్యాన్ని చేరుకోవట్లేదు. మిగిలిన తొంభై శాతం మంది.. మళ్లీ కొత్తసంవత్సరం వస్తుందిగా అని సర్దిచెప్పుకుంటున్నారు.
* కేలండర్ మారగానే ఖర్చులు తగ్గించుకుని, పొదుపు మొదలుపెట్టాలన్నది భారతదేశం వంటి దేశాల్లో ఎక్కువమంది తీసుకునే నిర్ణయాల్లో ఒకటి. ఏడాది చివరికల్లా ఇల్లో, కారో కొనాలని ఏడాది మొదట్లోనే లెక్కలు వేసుకుంటారు. కానీ ఏడాది ముగిసేసరికి అనుకున్న లక్ష్యాన్ని అందుకునేవాళ్ల సంఖ్య ఐదు శాతంలోపే ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.
సర్వేలన్నీ ఏం చెప్పినా, మారాలనుకునేవాళ్లకు జీవనశైలి నిపుణులు రెండే విషయాలను సూచిస్తున్నారు.
ఒకటి.. మంచిపని చేయడానికి సరైన సమయం అంటూ ఏదీ ఉండదని..
రెండు.. అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోవడానికి సాకులు కాదు, చేరుకోవడానికి కారణాలూ, దారులూ వెతుక్కోవాలని..
*