సబ్ ఫీచర్

చేతి మహిమ చెప్పతగునా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబింబంలాంటి ముఖం.. తామర తూడుల్లాంటి చేతులు.. పద్మాలవంటి పాదాలు.. కలువల వంటి కళ్ళు.. సంపెంగలాంటి నాసిక.. ఇలా ఎన్నో రకాలుగా స్ర్తిలను కవులు వర్ణిస్తూ వుంటారు. నేటి ఆధునిక స్ర్తిలు బ్యూటీపార్లర్లపై ఎక్కువ మోజు చూపిస్తున్నారు. ఇదివరకటిరోజుల్లో కేవలం ముఖం, జుట్టువరకే శ్రద్ధ వహించేవారు. కాని ఇపుడు అంతే ప్రాముఖ్యం చేతులకి, పాదాలకి కూడా ఇస్తున్నారు. చేతులకి వాక్సింగ్ లాంటివి చేయించుకొని క్రీమ్స్ మసాజ్ చేసి, గోళ్ళు శుభ్రం చేసకొని నెయిల్ పాలిష్ చేసుకుంటున్నారు. అరచేతికి అందంగా గోరింటాకు రకరకాలుగా డిజైన్లు పెట్టుకుకంటున్నారు. భగవంతుడు స్ర్తిలకి చేతులు అందాల అలంకరణకు ఇచ్చాడా అన్నంతగా వ్రేళ్లని, ముంజేతిని బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటున్నారు.
కానీ, ఈ చేతుల ప్రత్యేకత ఇంతవరకే కాదు.. ఇంకా ఎంతో ప్రతిభాన్వితమైన మహత్తులుగలవి ఈ చేతుల చేతులు. అనేక వందల మాటలు కలిగించనటువంటి ఒక మంచి భావాన్ని ఒక్కసారి ఆ బంగారు గాజుల చేతుల్తో తాకితే కలిగించవచ్చు. అంతటి మహత్తరమైన శక్తి గాజుల చేతికుంది.
తల్లి బిడ్డ తలపై చేయి వుంచి కొంతసేపు తలనిమిరితే అది పిల్లలకిచ్చే ఆనందం అనేక మాటలతో ప్రేమ ఒలకపోస్తూ చెప్పినా ఇవ్వదు.
భార్యాభర్తలుగాని, స్నేహితులుగాని, ప్రేమికులు గాని ఎవరైనా సరే మాటలో అభిమానం కురిపించే కన్నా ఒక్కసారి వారి భుజం మీద చేయి వేస్తే చాలు.. మాటలు బయటపెట్టలేని ఎన్నో అనుభూతులను కలిగిస్తుంది. ప్రేమాభిమానాలు మానవులకి మానసిక సంతోషాన్ని, శక్తిని ఇస్తుంది. అమితమైన ప్రేమ ఉన్నంతలో లాభం లేదు. అది ఎవరికి ఉద్దేశించబడిందో వారికి తెలిసేలా చేసినపుడే సార్థకత లభిస్తుంది. అందుకు ఈ బంగారు చేయి ఎంతో సాయపడుతుంది.
మెడిసిన్‌లా చేతి స్పర్శ.. చాలామంది తల్లులు పిల్లల్ని ఊరికే కొడుతు ఉంటారు. పిల్లలు చేసిన తప్పులు సరిదిద్దుకోవటానికి కోపాన్ని ప్రదర్శించటం లేక దండించటం జరిగిన తరువాత వారితో ప్రేమగా మాట్లాడినంతలో సరిపోదు, క్షమించినట్లు వారికి తెలిసేలా వారిని మన చేతుల్లోకి తీసుకొన్నపుడు, తలను నిమిరినపుడు దండన సత్ఫలితాలు కనబడతాయి. వారిలోని భేదాభిప్రాయాలు కూడా తొలగిపోతాయి.
ఒక్క దండన మాత్రమే చూపే పెద్దల యందు భయం తప్ప చిన్నారికి ప్రేమాభిమానాలు ఏ మాత్రం ఉండవు. కాబట్టి దండనతో పాటు ప్రేమగా చేతులతో దగ్గరకు తీసుకోవడం అవసరం. మానవ సంబంధాలకు చేతలను ఉపయోగించుకోవడం తెలుసుకుంటే వాటికున్న శక్తి ఇట్టే అర్థమవుతుంది. సులభంగా పని సార్థకం కావాలంటే చేయి స్పర్శ అద్భుతంగా మెడిసిన్‌లా పనిచేస్తుంది.
‘చేతికి గాజులందము, చెంపలకు సిగ్గులందము’ అని స్ర్తిని ఓ కవి వర్ణించాడు. అయితే ఆ గాజుల చేయి పురుషునికి ఆనందం అయితే బిడ్డకి ఆత్మీయత. స్ర్తిలు రకరకాల ఇంటి పనులు చేతులతోనే చేయాల్సి వుంటుంది. కనుక ఆ చేతులు వాటి నాజూకుతనాన్ని కోల్పోతాయి. తిరిగి అవి అందాన్ని సంతరించుకొనేందుకు అలంకరణ సామగ్రి ఉపయోగిస్తున్నారు. అలా పిల్లల్ని దండించే చేతులతోనే వారిని లాలించటం కూడా స్ర్తికి వెన్నతోపెట్టిన విద్య.
పురుషుని చేతి స్పర్శకంటే స్ర్తి స్పర్శకి స్పందన ఎక్కువగా వుంటుందని పరిశోధకులు తేల్చి చెపుతున్నారు. పిల్లల్ని ఎక్కువగా లాలించేది స్ర్తియే. తల్లి పిల్లల్ని అక్కున చేర్చుకుంటే ఆ పసి హృదయాలు అన్నీ మరిచిపోతారు. పురుషుడు తన్మయం చెందుతాడు స్ర్తి చేతికి అంత శక్తి వుంది మరి.
చేతివేళ్ళనుంచి ప్రకృతి సిద్ధం అయిన దివ్యశక్తి బయటకు ప్రవహిస్తుందని మానసిక శాస్త్ర ఆధారాలు కూడా ఉన్నాయి. కెనల్‌వర్తు అనే మానసిక శాస్తవ్రేత్త ఇలా వ్రాశాడు- ‘‘మానవుని మించిన దివ్యశక్తి లేదు. ప్రకృతిలో మానవుడే ఒక దివ్యశక్తి పైకి కనబడే మానవుడుకాదు, అతని అంతఃకరణ. ఆ అంతఃకరణ అతని చేతల ద్వారా వ్యక్తం అవుతుంది. ప్రకృతిలో స్ర్తి పురుషుడి కంటే ప్రేమకి, త్యాగానికి, ఓర్పు, నేర్పు, కుటుంబ గౌరవ మర్యాదలు, సంప్రదాయాలు.. అన్నీ ఇమిడి వుంటాయి. ఆమె ప్రేమతో పిల్లల్ని చేరదీసి బుజ్జగింపుతో వారిని నేర్పులుగా, విద్యావంతులుగా మలుస్తుంది. మంచి నడవడి నేర్పిస్తుంది.
చేతివేళ్ల మొనలు, చాలా నాడీకొనలతో వుండి, స్పర్శకి ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి స్థానాన్ని తెలియజేయడంలో శరీర అంగాలలో ముఖ్యమైనవి. ఇతర జతగా వుండే శరీర భాగాలవలె, ప్రతి చేయి దాని వ్యతిరేక దిశలో మెదడుతో నియంత్రించబడుతుంది. చేతివాటం మెదడు పనిచేసే తీరుని తెలుపుతుంది.
మానవుని చేతిలో మణికట్టు, అరచేయి మరియు వేళ్ళు చేతిలోని ప్రధానమైన భాగాలు. మన రెండు చేతులు ఎముకలు, కీళ్ళు, కండరాలు, నాడులు, రక్తనాళాలు మొదలైన వాటితో చేయబడినవి. మానవుని చేతిలో 27 ఎముకలు, వాటిల్లో వేళ్ళకు 14 ఫలాంజిస్ ఎముకలు వుంటాయి. మెటాకార్పల్ ఎముకలు వేళ్ళని మణికట్టుకి కలుపుతుంది.
మనం భౌతికంగా ఏ విధమైన పని చేయడానికైనా చేతులు మీదుగానే చేయగలుగుగతున్నాము. ఇవి శక్తివంతమైన పనులే కాకుండా సున్నితమైన కళాత్మకమైన పనుల్ని కూడా సాధ్యపడేటట్లుచేస్తాయి. చేతి వేలి కొనలలో అతి సున్నితమైన నరాల మూలంగా స్పర్శ జ్ఞానం గురించిన సంకేతాల్ని మెదడుకు పంపేలా చేస్తాయి. ఇతర అవయవాల వలెనే చేతుల్నికూడా వ్యతిరేక దిశలోని మెదడు నియంత్రిస్తుంది.
కరచాలనం
కరచాలనం ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నపుడు వారి చేతులు కలిపి చేసుకొనే సంప్రదాయం. ఇందులో ఇద్దరూ చేతుల్ని కలిపిన తర్వాత కొద్దిగా పైకీ క్రిందకీ కదిపిస్తారు. ఇది పాశ్చాత్యుల సంప్రదాయమైనప్పటికీ ప్రపంచీకరణ ఫలితంగా విశ్వవ్యాప్తమైంది.
చేతివాటం
చేతివాటం అనేది మానవులలో సున్నితమైన పనులు చేయడంలో కుడి మరియు ఎడమ చేతులమధ్య వ్యత్యాసం ఉండడం. కుడి చేతితో పనులు సులువుగా చేసుకొనేవారిని కుడి చేతివాటం కలవాడు అంటారు. అలాగే ఎడమ చేతితో చేసుకొనేవారిని ఎడమ చేతివాటంవారు అంటారు. చాలా తక్కువమంది రెండు చేతులతో ఒకే విధంగా పనిచేసుకోగలవారుంటారు. వారిని సవ్యసాచి అంటారు.
భారతీయ సంస్కృతిలో చేతికి ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. సూర్యోదయాన లేచిన వెంటనే ‘కరాగ్రే వసతేలక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవిందా ప్రభాతం’ అంటూ దైవప్రార్థన చేసుకుంటారు. అంటే ఆ రోజంతా మంచే జరుగుతుందని కొందరు నమ్ముతారు.
హిందూ వివాహంలో పాణిగ్రహణము ఒక ప్రధానమైన ఘట్టం. పాణి అనగా సంస్కృతంలో చేయి అని గ్రహణం అనగా గ్రహించడం లేదా పట్టుకోవడం అని అర్థం. జీవితమంతా పట్టుకొన్న చేయిని విడవమని చెపుతూ భార్యాభర్తల బంధం ముడిపెట్టే గొప్ప సంప్రదాయం.
మనం చేసే పనుల్ని బట్టి మన చేతులకు మంచి, చెడు భేదాన్ని కల్పిస్తాయి. మనం చేసే దానాలు చేతులమీదుగానే చేస్తాము. కొందరి హస్త దీనుల్ని కాచే అభయహస్తం అవుతుంది. మరికొందరిది ఇతరుల్ని నాశనం చేసే భస్మాసురుని హస్తం అవుతుందని భావించినా మేలును కోరే మంచి మనసున్నోళ్ళ ‘అమృతహస్తం’ చిరస్మరణీయం.

- కంచర్ల సుబ్బానాయుడు